Big Stories

Surya Kumar: మళ్లీ సూర్యకుమారే నెంబర్ వన్…

T20 వరల్డ్ కప్ లో అద్భుతమైన ఆటతీరుతో ప్రత్యర్థుల్ని భయపెడుతున్న భారత స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్… T20ల్లో నెంబర్ వన్ ర్యాంక్ ను నిలబెట్టుకున్నాడు. ICC తాజాగా విడుదల చేసిన T20 ర్యాంకింగ్స్‌లో మళ్లీ సూర్యకుమార్‌దే అగ్రస్థానం. ఇక యువ బౌలర్‌ అర్ష్‌దీప్‌సింగ్‌ 23వ ర్యాంక్ కు చేరుకుని… కెరీర్‌లో బెస్ట్‌ ర్యాంక్‌ సాధించాడు.

- Advertisement -

ప్రస్తుతం T20 వరల్డ్ కప్ లో దుమ్మురేపుతున్న సూర్యకుమార్ యాదవ్… కెరీర్‌లోనే అత్యున్నత ఫామ్‌లో ఉన్నాడు. సౌతాఫ్రికాపై అత్యధికంగా 68 రన్స్ చేశాడు… సూర్యకుమార్. కేవలం 40 బంతుల్లోనే ఈ భారీ స్కోరు బాదాడు. ఆ తర్వాత జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ లో 25 బంతుల్లోనే 61 రన్స్ బాదేశాడు. నెదర్లాండ్స్ పైనా 25 బంతుల్లోనే 51 రన్స్ చేశాడు. బంగ్లాదేశ్ పై 16 బాల్స్ లో 30 రన్స్ చేసిన సూర్యకుమార్… పాకిస్థాన్ పై 15 రన్స్ చేశాడు. కేవలం ఐదు మ్యాచుల్లో 200కిపైగా స్ట్రైక్‌రేట్‌తో మొత్తం 225 పరుగులు చేశాడు. దీంతో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో 869 పాయింట్లు సాధించి తొలి ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు… సూర్యకుమార్‌. T20 ర్యాంకింగ్స్‌లో సూర్య తర్వాత 830 పాయింట్లతో మహమ్మద్ రిజ్వాన్‌ రెండోస్థానంలోనూ… 779 పాయింట్లతో డేవన్ కాన్వే మూడో స్థానంలోనూ, 762 పాయింట్లతో బాబర్ అజామ్ నాలుగో స్థానంలోనూ, 748 పాయింట్లతో ఐదెన్ మార్‌క్రమ్ ఐదో స్థానంలోనూ ఉన్నారు.

- Advertisement -

ఇక… T20 వరల్డ్ కప్ నుంచి శ్రీలంక గ్రూప్ స్టేజ్‌లోనే వెనుదిరిగినా… ఆ జట్టు టాప్‌ స్పిన్నర్‌ వహిందు హసరంగ మాత్రం ఐసీసీ ర్యాంకింగ్స్‌లో పైకి దూసుకొచ్చాడు. ఇప్పటిదాకా బౌలింగ్‌ విభాగంలో 698 పాయింట్లతో టాప్ ప్లేస్ లో ఉన్న రషీద్‌ ఖాన్‌ను వెనక్కినెట్టి… 704 పాయింట్లతో మొదటి ర్యాంక్‌కు చేరాడు…. వహిందు హసరంగ. ఇక భారత యువ బౌలర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌… తన కెరీర్‌లోనే బెస్ట్ ర్యాంక్ సాధించాడు. T20 బౌలర్ల జాబితాలో 23వ స్థానానికి చేరుకున్నాడు. T20 మ్యాచ్ ల్లో ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్ లో హార్దిక్‌ పాండ్య 187 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. బంగ్లాదేశ్‌ కెప్టెన్ షకిబ్ అల్ హసన్ 252 పాయింట్లతో ఆల్ రౌండర్లలో టాప్ ప్లేస్ లో కొనసాగుతున్నాడు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News