BigTV English

Pawan Kalyan: ఈసారి పర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది.. హ్హ..

Pawan Kalyan: ఈసారి పర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది.. హ్హ..
pawan kalyan

Pawan Kalyan: పవన్ కల్యాణ్ ఫుల్ క్లారిటీతో ఉన్నారు. జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తు పక్కాగా ఉంటుందని చెబుతున్నారు. అయితే, అన్నీ పద్దతిగా జరిగితేనే అంటున్నారు. టీడీపీ నేతలను సీఎం చేయడానికి జనసేన లేదని చెప్పేశారు. ఒక పార్టీ నాయకుడు, మరోపార్టీ నాయకుడిని సీఎం చేయాలని ఎందుకు అనుకుంటాడని ప్రశ్నించారు. అవసరమైనప్పుడు తగ్గడమే కాదు, బెబ్బులిలా తిరగబడాలని.. ఓడిపోయిన వాడికే దెబ్బకొట్టి విజయం సాధించడం తెలుస్తుందని పంచ్ డైలాగులు వదిలారు పవన్ కల్యాణ్.


డిసెంబర్‌లో ఎలక్షన్స్ వస్తాయని.. తాను జూన్ నుంచే ప్రచారం స్టార్ట్ చేస్తానని ప్రకటించారు. మళ్లీ ఓడిపోవడానికి తాను సిద్ధంగా లేనని.. కచ్చితంగా ప్రభుత్వం స్థాపించే తీరాలని అన్నారు. త్రిముఖ పోరులో ఈసారి జనసేన బలి కావడానికి సిద్ధంగా లేదని..
కచ్చితంగా అలయెన్సే ఉంటుందని తేల్చి చెప్పారు. చర్చలు ఫలించాక.. టీడీపీ, జనసేన, బీజేపీలు ప్రజల మధ్యే ఒప్పందం చేసుకుంటాయని.. కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ ప్రజల ముందు ఉంచుతామని.. రాష్ట్రానికి ఏమేం చేస్తామో మీడియా, పబ్లిక్ సమక్షంలో చెబుతామని వివరించారు.

ఎవరు ముఖ్యమంత్రి కావాలనేది ముఖ్యం కాదని.. ప్రస్తుత ముఖ్యమంత్రిని గద్దె దించడమే ప్రధాన లక్ష్యమన్నారు పవన్. ముఖ్యమంత్రి ఎలా అయ్యేది ఎన్నికలు అయ్యాక, ఫలితాలు వచ్చాక మాట్లాడతామని చెప్పారు. జనసేనకు వచ్చే సీట్ల ప్రకారమే సీఎం సీటు అడిగే హక్కు ఉంటుందని.. అందుకే ఈసారి పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలను గెలిపించాలని జనసైనికులకు పిలుపు ఇచ్చారు పవన్ కల్యాణ్.


జనసేనకు కృష్ణా జిల్లా నుంచి శ్రీకాకుళం వరకు 25 శాతం ఓటింగ్ ఉందని.. గోదావరి జిల్లాల నుంచి 34-36 శాతం ఓట్ షేరింగ్ ఉంటుందని.. రాష్ట్రం మొత్తం తీసుకుంటే యావరేజ్‌గా 14 నుంచి 18 శాతం ఓటింగ్ జనసేనకు ఉందని చెప్పారు. అయితే, ఈ ఓటింగ్ శాతం మనల్ని అధికారంలోకి తీసుకు రాలేదని.. అంతకుమించి ఉండాలని అన్నారు.

ఇక, చంద్రబాబు మోసం చేస్తారని కొందరు అంటున్నారని.. అలా మోసపోవడానికి తానేమైనా చిన్నపిల్లాడినా? గడ్డం, తెల్ల వెంట్రుకలు రాలేదా? తనకు వ్యూహం ఉండదా? ఊరికే ఇక్కడి వరకు వచ్చేస్తామా? అంటూ తనదైన స్టైల్‌లో జవాబిచ్చారు జనసేనాని.

అలయెన్స్ ఎంత ముఖ్యమో జనసైనికులకు విడమరిచి చెప్పారు పవన్. ఏ పార్టీ ఎదుగుదలకైనా పొత్తులు ముఖ్యమని, తెలంగాణలో బీఆర్ఎస్ అలానే ఎదిగిందని గుర్తు చేశారు. 10 సీట్లతో ఎమ్ఐఎమ్‌ ఎలా కీలక పార్టీగా మారిందో చూస్తున్నాం కదా అన్నారు. గత ఎన్నికల్లో జనసేనకు కనీసం తమిళనాడులో విజయ్‌కాంత్‌కు వచ్చినన్ని సీట్లు కూడా రాలేదని చెప్పుకొచ్చారు.

ఇక, అధికార వైసీపీపై విరుచుకు పడ్డారు పవన్ కల్యాణ్. ఆకాశంలో హెలికాప్టర్‌లో వెళ్తూ కూడా.. కింద చెట్లను నరికే కల్చర్ వైసీపీదే అన్నారు. ల్యాండ్, సాండ్, మైన్, లిక్కర్.. అన్నీ దోచుకుంటున్నారని.. ప్రజలను వేధిస్తున్నారని.. ఇలాంటి అరాచక ప్రభుత్వం పోవాల్సిందేనని గట్టిగా చెప్పారు. జనసేన అంటే వైసీపీకి ఎందుకు అంత భయమని ప్రశ్నించారు పవన్. తాను మాట్లాడగానే.. సకల కళా కోవిదులు, వైసీపీ బుడతలు బయటకు వచ్చి ఏదేదో మాట్లాడతారని అంబటి రాంబాబు, పేర్ని నానిల గురించి పరోక్షంగా విమర్శించారు. తనని, తన పిల్లల్ని కూడా తిడుతున్నారని.. సినిమాలు చేసుకుంటే తనకు రోజుకు కోటి, రెండు కోట్లు వస్తాయని.. అయినా, రాష్ట్ర భవిష్యత్తు, ప్రజల కోసం అన్నీ భరిస్తున్నానని పవన్ కల్యాణ్ అన్నారు.

Related News

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Visakhapatnam 2050: విశాఖ నగరం 2050లో.. ఇలా ఉంటుందా? అసలు ఊహించలేం కదా!

Araku Coffee: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అరకులో ఇకపై అందరూ లక్షాధికారులే!

Pawan Kalyan project: పవన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం.. కోట్లల్లో ఖర్చు.. ఎందుకంటే?

Big Stories

×