E-Paper
Advertisement

Janasena: జనసేన ప్రచారానికి స్టార్ క్యాంపెయినర్లు వీరే..

Janasena: జనసేన ప్రచారానికి స్టార్ క్యాంపెయినర్లు వీరే..
Advertisement
Janasena Star Campaigners
Janasena Star Campaigners

Janasena: వచ్చే ఎన్నికల్లో కూటమి గెలుపే లక్ష్యంగా జనసేన ఇప్పటికే కసరత్తుల మొదలుపెట్టింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బహిరంగ సభలు నిర్వహిస్తూ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్.. జనసేన అభ్యర్థుల తరఫున ప్రచారానికి స్టార్ క్యాంపెయినర్లను నియమించారు.

జనసేన అభ్యర్థుల తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల్లో ప్రచారం చేసి ప్రజల్లో జోష్ నింపడానికి పార్టీ అధినే పవన్ కళ్యాణ్ స్టార్ క్యాంపెయినర్లను ప్రకటించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు, క్రికెటర్ అంబటి రాయుడు, డ్యాన్స్ మాస్టర్ జానీ మాస్టర్, సినీ నటులు సాగర్, పృథ్వీ, హైపర్ ఆది, గెటప్ శ్రీనులను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ ప్రచారకర్తలుగా నియమించారు.

Advertisement

ఈ స్టార్ కాంపెయినర్లు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన నిర్వహించే ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రసంగించనున్నారు. వీరంతా తన అభిమానులను జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసేలా ప్రసంగాలు చేయనున్నారు.

టీడీపీ, బీజేపీతో పొత్తులో భాగంగా జనసేనకు రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాల్లో 21 అసెంబ్లీ స్థానాలు దక్కాయి. 25 పార్లమెంట్ స్థానాల్లో జనసేనకు 2 సీట్లు దక్కిన విషయం తెలిసిందే. కాగా, పొత్తులో భాగంగా జనసేనాని పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్నారు.

Related News

రూ.1000 కోట్ల ఆస్తి.. వేలాది కుటుంబాల ఇళ్ల కల నెరవేర్చిన మంత్రి లోకేశ్

ఆంధ్రప్రదేశ్‌కి దక్కిన అరుదైన గౌరవం.. బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్‌గా ఏపీకి అంతర్జాతీయ అవార్డు

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Big Stories

Advertisement
×