BigTV English

Janasena Announced Palakonda: జయకృష్ణకే సీటు, కళావతితో ఢీ అంటే ఢీ

Janasena Announced Palakonda: జయకృష్ణకే సీటు, కళావతితో ఢీ అంటే ఢీ
Pawan kalyan announced nimmaka jayakrishna contest palakonda
Pawan kalyan announced nimmaka jayakrishna contest palakonda

Janasena Announced Nimmaka Jayakrishna as Palakonda Candidate: ఎట్టకేలకు జనసేన పోటీ చేస్తున్న అన్ని సీట్లకు అభ్యర్థులను ప్రకటించారు పవన్‌కల్యాణ్. పొత్తుల్లో భాగంగా జనసేన 21 సీట్లకు పోటీ చేస్తోంది. అన్ని సీట్లకు అభ్యర్థుల ను ప్రకటించారు పవన్. కాకపోతే ఉమ్మడి విజయనగరం జిల్లా పాలకొండ సీటుపై కాస్త ఉత్కంఠ నెలకొంది. నాలుగైదు సార్లు సర్వేలు చేయించింది ఆ పార్టీ. ఎన్నికల సమయంలో దగ్గరపడడంతో కేడర్ కూడా అయోమయంలో పడింది. చివరకు నిమ్మక జయకృష్ణ వైపు మొగ్గు చూపారు. ఈ క్రమంలో పాలకొండ నుంచి జయకృష్ణను బరిలోకి దించుతున్నట్లు ప్రకటన చేశారు పవన్‌కల్యాణ్.


పాలకొండ ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం. పాలకొండ నుంచి కూటమి అభ్యర్థిగా జయకృష్ణ పేరును ప్రకటించారు పవన్. ఇందుకు సంబందించి ప్రకటన కూడా విడుదల చేసింది ఆపార్టీ. ఇక్కడి నుంచి వైసీపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే కళావతి బరిలో ఉన్నారు. ఆమెను ఢీ కొట్టనున్నారు జయకృష్ణ. రెండుసార్లు అదే నియోజకవర్గం నుంచి గెలుపొందారు కళావతి. నియోజకవర్గం ప్రజలు ఆమెపై అసంతృప్తితో ఉన్నారు. ఈసారి ఎలాగైనా అభ్యర్థిని మార్చాలని అక్కడి ప్రజలు డిసైడ్ అయ్యారు.

నిమ్మక జయకృష్ణ తండ్రి గోపాలరావు గతంలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా కొత్తూరు నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఇక 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున నిమ్మక జయకృష్ణ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈసారి ఇక్కడ ఎలాగైనా గెలుపొందాలని భారీ స్కెచ్ వేసుకున్నారు. ఐదేళ్లగా నియోజకవర్గం ప్రజలకు అండగా ఉంటూ వచ్చారు. ఈసారి తన తండ్రి ఇమేజ్ కలిసి వస్తుందని భావిస్తున్నారు. రెండుసార్లు ఓడిపోయిన అభ్యర్థికి ఈసారి ఛాన్స్ ఇస్తే బాగుంటుందని ఓటర్లు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సర్వే కూడా ఆయనకు అనుకూలంగా వచ్చింది. మరి రెండుసార్లు ఓడించిన కళావతిని జయకృష్ణ ఇంటికి పంపిస్తారో లేదో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే!


Also Read: Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు ఈసీ నోటీసులు.. 48 గంటల్లో వివరణ ఇవ్వాలి..!

Related News

ZPTC Fightings: భగ్గుమన్న పులివెందుల.. మంత్రి ఎదుటే కొట్టుకున్న టీడీపీ, వైసీపీ కార్యకర్తలు

Pulivendula ZPTC: పులివెందుల, ఒంటమిట్టలో ముగిసిన పోలింగ్

AP Free Bus Scheme: ఆగస్ట్ 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం – స్త్రీశక్తి పథకంపై సీఎం సమీక్ష

AP Asha Workers: ఆశా వర్కర్లకు ఏపీ సర్కార్ బంపర్ ఆఫర్.. ఆరోగ్యం, భవిష్యత్తు భరోసా!

Pulivendula ZPTC: ఏపీ పాలిటిక్స్ @ పులివెందుల

Vontimitta By Election: ఓంటిమిట్ట ఉప ఎన్నికల్లో ఉద్రిక్తత.. చిన్నకొత్తపల్లి బూత్‌లో ఘర్షణ

Big Stories

×