Pawan Kalyan: ఉగ్రవాద సంస్థల స్థావరాలపై దాడి చేసి పహల్గామ్ దాడికి ప్రతీకారం తీర్చుకుందన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. తొలి నుంచి పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని తన విధానంగా మార్చుకుందని ఆరోపించారు. పాక్‌లోని ఉగ్రవాదుల స్థావరాలే లక్ష్యంగా భారత్ సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌పై రియాక్ట్ అయ్యారు. యుద్ధాన్ని అందరూ హర్షించాలని, ప్రధాని నరేంద్రమోదీకి అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
ఆపరేషన్ సిందూర్‌పై బుధవారం మీడియాతో మాట్లాడారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. పహల్‌గామ్ దాడితో దేశం మొత్తం పుట్టెడు దుఃఖంలో ఉందన్నారు. ఉగ్రవాదులు.. నీవు హిందువా.. ముస్లిం అని అడిగి మరీ చంపేసిన విధానం చాలా దారుణమన్నారు. ఏపీకి చెందిన రెండు కుటుంబాలు కాశ్మీర్ పర్యటనకు వెళ్లినవారిని ఉగ్రవాదులు చంపేశారంటూ విచారం వ్యక్తంచేశారు.
గత రాత్రి ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేయడం దేశం మొత్తం హర్షించాల్సిన విషయమన్నారు. చివరి ఉగ్రవాదిని అంతం చేసేవరకు మోదీ పోరాటం ఆగదన్నారు. ఇలాంటి సమయంలో అందరం దేశం కోసం ఆలోచించాలని, పార్టీల కోసం కాదన్నారు. పాకిస్థాన్‌కు మద్దతుగా ఆలోచించే నాయకులు తమ వైఖరి మార్చుకోవాలని హితవు పలికారు.
మితిమీరిన సహనంతో చేతులు కట్టేసిన సమస్త భారతానికి ఆపరేషన్ సిందూర్‌తో వీరత్వాన్ని నింపిందన్నారు. పాకిస్తాన్‌లో సాధారణ ప్రజలకు ఇబ్బంది కలగకుండా కేవలం ఉగ్ర స్థావరాలపై దాడి చేసి ధ్వంసం చేయడం హర్షించదగ్గ విషయమన్నారు.ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ, త్రివిధ దళాధిపతులకు కృతజ్ఞతలు తెలిపారు పవన్ కల్యాణ్.
ALSO READ: ఐఏఎస్ శ్రీలక్ష్మికి ఊహించని షాక్, పొంచి ఉన్న కష్టాలు
90వ దశకంలో కాశ్మీర్ పండిట్లపై ఇదే విధంగా దాడి జరిగిందని గుర్తు చేశారు. హిందువులపై దశాబ్దాలుగా దాడి జరుగుతూనే ఉందన్నారు. ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం పట్ల అందరం గర్వించాలన్నారు. ఇలాంటి సమయంలో మనమంతా ఆయనకు అండంగా ఉండాలన్నారు. మోదీ నాయకత్వంలో ఉగ్రవాదంపై యుద్ధం జరుగుతుందని గుర్తు చేశారు.
సోషల్ మీడియాలో ఎవరైనా దేశాన్ని కించపరిచే విధంగా మాట్లాడితే కేసులు పెట్టాల్సిందేనని కుండబద్దలు కొట్టేశారు. సెలబ్రిటీలు, మరీ ముఖ్యంగా సోషల్ మీడియా ఇన్ ప్లూయెన్సర్లు జాగ్రత్త అని హెచ్చరించారు. ఈ విషయంలో ఏదిపడితే అది మాట్లాడవద్దని సున్నితంగా హెచ్చరించారు.
తీర ప్రాంతం ఉన్న ఏపీ మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. ఉగ్ర కదలికలపై కేంద్రం ఎప్పటికప్పుడు ఏపీకి సమాచారం ఇస్తూనే ఉందన్నారు. సరిహద్దులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిందేనన్నారు. రోహింగ్యాల వల్ల హైదరాబాద్‌లో స్థానికులు తమ ఉద్యోగాలను కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లకు పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
దేశాన్ని, సైన్యాన్ని కించపరిచేలా మాట్లాడినా, పోస్టులు పెట్టినా కేసులు పెడతాం
సరిహద్దుల్లో భారత్ యుద్ధం చేస్తున్న సమయంలో అందరం బాధ్యతాయుతంగా ఉండాలి
ముఖ్యంగా సెలబ్రిటీలు సోషల్ మీడియాలో ఏది పడితే అది మాట్లాడొద్దు… pic.twitter.com/6rL5ou5POl
— BIG TV Breaking News (@bigtvtelugu) May 7, 2025