PM Modi Space Speech| అంతరిక్ష పరిశోధన రంగంలో భారతదేశం అనేక అద్భుత విజయాలు సాధించిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. ‘గ్లోబల్ స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ సదస్సు’ ప్రారంభోత్సవ సందర్భంగా ఆయన మాట్లాడారు. మంగళ్‌యాన్, చంద్రయాన్ వంటి ఆకాశ విజ్ఞాన ప్రయోగాలను భారత్ విజయవంతంగా పూర్తి చేసిందని తెలిపారు. చంద్రుడిపై నీటి ఆనవాళ్లను గుర్తించిన ఘనత చంద్రయాన్ మిషన్‌దేనని మోదీ పేర్కొన్నారు. ఇండియా అనుకున్న దాని కంటే ఎన్నో రెట్లు దాటి విజయాలను సొంతం చేసుకుందని అన్నారు.
భారతీయ రాకెట్లు పరిమితిని మించి పేలోడ్లు విజయవంతంగా తీసుకెళ్లాయని.. డాకింగ్ సిస్టమ్ ద్వారా శాటిలైట్లు కూడా విజయవంతంగా లాంచ్ చేశామని గుర్తు చేశారు.
అంతేకాకుండా, దక్షిణాసియా దేశాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని, వాటి కోసం ప్రత్యేకంగా ఒక ఉపగ్రహాన్ని భారత దేశం ప్రయోగించిన విషయాన్ని గుర్తు చేశారు. అతి త్వరలో భారత వ్యోమగామి ఒకరు అంతరిక్షంలో పర్యటించనున్నారని ప్రధాని మోదీ తెలిపారు. ఆయన దృష్టిలో 2050 నాటికి చంద్రుడి మీద భారతీయులు అడుగుపెడతారని స్పష్టం చేశారు.
ఇటీవల రాజధాని ఢిల్లీలో ప్రారంభమైన ‘గ్లోబల్ స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ కాన్ఫరెన్స్ (GLEX 2025)’ ఈ నెల 9వ తేదీ వరకు జరగనుంది. ఈ కాన్ఫరెన్స్‌లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా అంతరిక్ష పరిశోధన రంగానికి చెందిన ప్రతినిధులు, శాస్త్రవేత్తలు పాల్గొంటున్నారు.
మరోవైపు, భారత ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంలో దేశ భద్రతకు ప్రాధాన్యతనిస్తూ, ప్రధాని నరేంద్ర మోదీ తన విదేశీ పర్యటనలను తాత్కాలికంగా రద్దు చేసుకున్నారు. తాజా పరిస్థితులను సమీక్షిస్తూ, సరిహద్దు అంశాలపై సైనిక మరియు భద్రతా అధికారులతో సమాలోచనలు జరిపేందుకు ప్రధాని ఈ నిర్ణయం తీసుకున్నారు.
Also Read: భారత పౌరులను చంపిన పాక్ ఆర్మీ.. జమ్మూలో 8 మంది అమాయకులు మృతి
ఆపరేషన్ సిందూర్.. గర్వపడాల్సిన విషయం
పాకిస్తాన్ లో ఉగ్రవాద స్థావరాలపై భారత్ వైమానిక దాడులు చేసిన తరువాత ప్రధాని మోడీ కేబినెట్ సమావేశం నిర్వహించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ లో 9 ఉగ్రవాద స్థావరాలపై మిలిటరీ దాడులు చేసి ఉగ్రమూలలను దెబ్బకొట్టడం భారత దేశం గర్వించదగ్గ విషయమని ఆయన ఈ సందర్బంగా అన్నారు. ప్లాన్ చేసినట్లుగా చాలా కచ్చితత్వంతో ఈ వైమానిక దాడులు జరగడం, ఏ పొరపాట్లు జరగకపోవడం వాయు సైన్యాన్ని అభినందించాల్సిన విషయమన్నారు.