BigTV English

Ustaad Bhagat Singh : ఉస్తాద్ డైలాగ్స్ పై పవన్ రియాక్షన్.. “ఆ డైలాగ్స్ అందుకే చెప్పా”

Ustaad Bhagat Singh : ఉస్తాద్ డైలాగ్స్ పై పవన్ రియాక్షన్.. “ఆ డైలాగ్స్ అందుకే చెప్పా”

pawan kalyan latest speech


Ustaad Bhagat Singh Teaser Dialogues(AP political news): పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా, హరీష్ శంకర్ దర్శకుడిగా తెరకెక్కుతోన్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. ఇటీవలే ఈ సినిమా నుంచి భగత్స్ బ్లేజ్ పేరుతో టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. ఈ టీజర్లో పవన్ కల్యాణ్ చెప్పిన డైలాగ్స్.. పొలిటికల్ లీడర్లకు వార్నింగ్ ఇస్తూ చెప్పినట్లే ఉన్నాయి. ముఖ్యంగా జనసేన పార్టీ గుర్తు అయిన గాజుగ్లాస్ చుట్టూ తిరిగిందీ టీజర్. గ్లాస్ పగిలేకొద్దీ పదునెక్కుద్ది అంటూ.. పగిలిన గాజు గ్లాస్ తో విలన్లను ఊచకోత కోసే సీన్ హైలెట్ గా నిలిచింది.

ఖచ్చితంగా గుర్తుపెట్టుకో.. గ్లాస్ అంటే సైజ్ కాదు.. సైన్యం.. కనిపించని సైన్యం అంటూ పవన్ కల్యాణ్ బహిరంగ సభల్లో చెప్పే డైలాగ్ లను ఉస్తాద్ భగత్ సింగ్ లోనూ రిపీట్ చేశారు. ఆ డైలాగ్స్ ఎందుకు చెప్పాల్సి వచ్చిందో క్లారిటీ ఇచ్చారు పవన్ కల్యాణ్. పిఠాపురం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న పవన్ కల్యాణ్ మంగళవారం నియోజకవర్గ కార్యకర్తలు, ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. హరీష్ శంకర్ బాధపడలేకనే ఆ డైలాగ్స్ చెప్పాల్సి వచ్చిందన్నారు. ఒక సందర్భంలో పగిలేకొద్దీ పదునెక్కడం గాజుకు ఉన్న లక్షణం అని హరీష్ కు చెప్పానని, దానినే హరీష్ శంకర్ డైలాగ్ గా చెప్పించాడన్నారు. ఇది రాజకీయాలను ఉద్దేశించి కావాలని చెప్పిన డైలాగ్ కాదన్నారు.


Also Read : కళ్లు చెదిరే విజువల్స్ .. గూస్‌బంప్స్‌ తెప్పిస్తున్న కంగువ టీజర్‌

అందరూ జనసేన ఓడిపోయింది.. ఓడిపోయింది అంటున్నారు కానీ.. జనసేనే లేకపోతే ఇప్పుడీ పొత్తే ఉండేదని కాదని పవన్ కల్యాణ్ తెలిపారు. దశాబ్దకాలంలో ఎప్పుడూ ఓటెయ్యమని అడగలేదని, ఈ సారి తనుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు పవన్ కల్యాణ్. ప్రజానాయకుల మీద కోపంతో నోటాకు ఓటేసి.. మీ ఓటును వృథా చేసుకోకండని విజ్ఞప్తి చేశారు.

ఏపీ ఎన్నికల వేళ ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ విడుదలవ్వడం.. అందులో పవన్ కల్యాణ్ చెప్పిన డైలాగులు రాజకీయ వేడిని పెంచాయి. ఇది జనసేన ప్రమోషన్స్ లా ఉందన్న విమర్శలూ వచ్చాయి. ఈ సినిమాలో శ్రీలీల నటిస్తుండగా.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. నవీన్ యర్నేని, రవిశంకర్ యలమంచిలి సినిమాను నిర్మిస్తున్నారు.

Tags

Related News

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Visakhapatnam 2050: విశాఖ నగరం 2050లో.. ఇలా ఉంటుందా? అసలు ఊహించలేం కదా!

Araku Coffee: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అరకులో ఇకపై అందరూ లక్షాధికారులే!

Pawan Kalyan project: పవన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం.. కోట్లల్లో ఖర్చు.. ఎందుకంటే?

Big Stories

×