BigTV English
Advertisement

Suriya Kanguva Movie Teaser: కళ్లు చెదిరే విజువల్స్ .. గూస్‌బంప్స్‌ తెప్పిస్తున్న కంగువ టీజర్‌

Suriya Kanguva Movie Teaser: కళ్లు చెదిరే విజువల్స్ .. గూస్‌బంప్స్‌ తెప్పిస్తున్న కంగువ టీజర్‌

Suriya Kanguva Movie TeaserSuriya Kanguva Movie Teaser: కోలివుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా నటిస్తున్న చిత్రం కంగువ. పీరియాడికల స్టోరీతో ఈ సినిమా పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా మూవీ మేకర్స్ టీజర్ రిలీజ్ చేసింది. ఈ విడియో చూస్తుంటే సూర్య తనలోని మరో కొత్త కోణాన్ని ప్రేక్షకులకు చూపించబోతున్నారు. బాబీ డియోల్ కూడా తనలోని మరో కొత్త యాంగిల్ ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారు. ఈ వీడియోలో యాక్షన్ సీన్స్ చూస్తుండే గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉన్నాయి. ఈ సినిమాలో దిశా పటానీ హీరోయిన్ గా నటిస్తుండగా.. విలక్షన నటుడు జగపతిబాబు, బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ డియోల్, యోగిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహించగా.. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.


ఈ టీజర్ లో సూర్య తనలోని నటవిశ్వరూపం చూపిస్తూ.. అగ్నితో సెగలు రేపే అటవిక యోధుడిలా కనిపించిన లుక్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ఎంతో క్రూరంగా కనిపించే శవాల గుట్ట, భీకరమైన యుద్ధ సన్నివేశాలను ఈ టీజర్ లో చూపించారు. వీడియో చివరిలో వినిపించే సూర్య వాయిన్ నెక్స్ట్ లెవెల్ అనేలా ఉంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ అయితే బీభత్సం అనే చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో 3Dలో తెరకెక్కుతోంది. ప్రపంచ వ్యాప్తంగా పది భాషల్లో ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Also Read: Ustaad Bhagat Singh: “గ్లాస్ అంటే సైజ్ కాదు.. సైన్యం.. కనిపించని సైన్యం”.. పూనకాలు తెప్పిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్


కొద్దిరోజుల క్రింతం కూడా ఈఓ సినిమా నుంచి ఓ టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం విడుదలైన ఈ రెండో టీజర్ తో పాటుగా గతంలో విడుదల చేసిన టీజర్ కూడా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను మెప్పించాయి. తాజాగా విడుదలైన టీజర్ చూస్తుంటే సూర్య నటవిశ్వరూపం ఏంటో ప్రేక్షకులను అర్ధం అవుతోంది. ఇందులో ఉన్న విజువల్స్, యాక్షన్ సీన్స్ చూస్తుంటే ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేయడం పక్కా అనిపించేలా ఉంది. దాదాపు రూ.250 కోట్ల బడ్జెట్ తో ఈ కంగువ చిత్రం తెరకెక్కుతోంది. పాన్ ఇండియా స్థాయిలో రూ.1,000 కోట్లు కలెక్షన్స్ రాబట్టాలనే టార్గెట్ తో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకి సీక్వెన్స్ కూడా ఉంటుందని నిర్మాత ధనంజయన్ గతంలోనే వెల్లడించారు. అయితే కంగువ పార్ట్-1 సాధించబోయే విజయం ఆధారంగా వాటిని తెరకెక్కిస్తామని తెలిపారు.

Tags

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×