E-Paper
Advertisement

విమానాలు లేవు.. కానీ నంబర్-1 ఎయిర్‌పోర్ట్.. ఖజురహోపై నెట్టింట ట్రోల్స్!

విమానాలు లేవు.. కానీ నంబర్-1 ఎయిర్‌పోర్ట్.. ఖజురహోపై నెట్టింట ట్రోల్స్!
Advertisement

Khajuraho Airport: మధ్యప్రదేశ్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ఖజురహో విమానాశ్రయం దేశంలో సరికొత్త సంచలనం సృష్టించింది. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) ఇటీవల విడుదల చేసిన కస్టమర్ శాటిస్‌ఫ్యాక్షన్ ఇండెక్స్ (CSI) సర్వేలో ఈ ఎయిర్‌పోర్ట్ దేశంలోనే నంబర్-1 స్థానాన్ని కైవసం చేసుకుంది. ప్రయాణికులకు అందించే సేవలు, సౌకర్యాల ఆధారంగా నిర్వహించిన ఈ సర్వేలో ఈ విమానాశ్రయం అగ్రస్థానంలో నిలవడం విశేషం. అయితే ఇక్కడే ఆసక్తికర చర్చ నెట్టింట మెుదలైంది. అసలు కమర్షియల్ విమాన సర్వీసులే లేకుండా ఈ ఎయిర్ పోర్ట్ అగ్రస్థానంలో ఎలా ఉందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

సోషల్ మీడియాలో ట్రోల్స్

ఈ ర్యాంకింగ్ వార్త బయటకు రావడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. అసలు ఒక్క వాణిజ్య విమానం కూడా నడవని ఎయిర్‌పోర్ట్‌కు మొదటి ర్యాంక్ ఎలా వచ్చిందంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అసలు ప్రయాణికులే లేనప్పుడు సంతృప్తి స్థాయిని ఎలా కొలిచారంటూ అనేక సందేహాలు, ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. దీంతో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇచ్చిన ర్యాంకింగ్స్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

జులై 1 నుంచి నిలిచిన సర్వీసులు

Advertisement

ఈ వివాదంపై ఖజురహో విమానాశ్రయ డైరెక్టర్ సంతోష్ సింగ్ స్పందించారు. సాధారణంగా ఇక్కడి నుంచి ఢిల్లీ, వారణాసి నగరాలకు విమాన సర్వీసులు నడుస్తుంటాయని, అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల జూలై 1 నుంచి కమర్షియల్ విమాన సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయని ఆయన వివరించారు. ఈ సర్వే అంతకుముందు ప్రయాణించిన ప్రయాణికుల అనుభవాల ఆధారంగా జరిగిందని త్వరలోనే అంటే అక్టోబర్ నాటికి విమాన సేవలు తిరిగి ప్రారంభమవుతాయని ఆయన స్పష్టం చేశారు.

స్వతంత్ర సంస్థ ఆధ్వర్యంలో సర్వే

ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) నిబంధనల ప్రకారం.. ప్రతీ రెండేళ్లకు ఒకసారి ఒక స్వతంత్ర ఏజెన్సీ ద్వారా ప్రయాణికుల సంతృప్తి సర్వే (CSI) నిర్వహిస్తారు. ఎయిర్‌పోర్ట్‌లో అందుబాటులో ఉండే మౌలిక వసతులు, పరిశుభ్రత, సిబ్బంది ప్రవర్తన వంటి పలు అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ ర్యాంకింగ్స్ కేటాయిస్తారు. ఈ క్రమంలోనే జులై నెలకు ఖజురహో ఎయిర్ పోర్టులో విమాన సర్వీసులు ఉండగా.. ప్రయాణికుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. అప్పుడు వారు వ్యక్తం చేసిన సంతృప్తి ఆధారంగా దేశంలోనే నెం.1 ర్యాంక్ ను దానికి కేటాయించారు.

Advertisement

Also Read: మొటిమలతో ఇబ్బందిపడుతున్నారా? రోజూ ఈ డ్రింక్ తాగితే మచ్చలు, మొటిమలు మాయం

స్థానికుల హర్షం.. సిబ్బందిపై ప్రశంసలు

సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నప్పటికీ.. స్థానిక ప్రజలు మాత్రం ఈ ర్యాంకింగ్‌ను గట్టిగా సమర్థిస్తున్నారు. ఖజురహో విమానాశ్రయంలో ఉండే పరిశుభ్రత, ప్రశాంత వాతావరణం, అక్కడి సిబ్బంది అందించే మర్యాదపూర్వక సేవలు ఎంతో అద్భుతంగా ఉంటాయని కొనియాడుతున్నారు. ఏదేమైనా విమాన రాకపోకలు తాత్కాలికంగా నిలిచిపోయినా లభించిన ఈ గౌరవం మాత్రం ఖజురహో ఎయిర్‌పోర్ట్ స్థాయిని మరోసారి చాటిచెప్పింది.

Also Read: కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Related News

విమానం కాదు.. ఆకాశంలో తేలే 5-స్టార్ హోటల్.. ప్రయాణికులకు లగ్జరీ రూమ్స్!

ప్రపంచంలో ఎక్కువ మంది టూరిస్ట్‌లు వెళ్లే దేశం ఏది? ఇండియా ఏ స్థానంలో ఉంది?

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

బుల్లెట్ రైళ్ల కోసం స్వదేశీ కంట్రోల్ సిస్టమ్.. భారత్ సంచలన నిర్ణయం!

తక్కువ ఖర్చు.. ఎక్కువ సేఫ్టీ.. మీ కారులో ఈ 6 గ్యాడ్జెట్లు ఉన్నాయా?

అది కొండ కాదు.. బట్టల గుట్ట, అంతరిక్షం నుంచీ కనిపిస్తోంది.. ఇది ఎక్కడుందంటే?

రైల్వే ప్రయాణికులకు బిగ్ అప్‌ డేట్.. ఆగస్టు నుంచి ఈ ఎక్స్ ప్రెస్ రైళ్లకు కొత్త కోచ్‌లు!

Big Stories

Advertisement
×