E-Paper
Advertisement

Pawan Letter: కాపు నేతలకు జనసేనాని లేఖ.. ఆ పార్టీ వలలో చిక్కుకోవద్దని విన్నపం

Pawan Letter: కాపు నేతలకు జనసేనాని లేఖ.. ఆ పార్టీ వలలో చిక్కుకోవద్దని విన్నపం
Advertisement

Pawan Letter: వైపీపీ టార్గెట్‌గా విమర్శలు గుప్పిస్తూ జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ కాపు నేతలకు లేఖ రాశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి ఓటమి కళ్లెదుటే కనిస్తోందని.. అందుకే కొందరు కాపు పెద్దలను రొచ్చగొడుతున్నారని ఫైర్‌ అయ్యారు పవన్‌. తాను గౌరవించే కాపు పెద్దలు దూషించినా కూడా దీవెనలుగానే స్వీకరిస్తానని తెలిపారు. తనను ఎంతగా దూషించినా వారి కోసం జనసేన వాకిలి తెరిచే ఉంటుందని లేఖ ద్వారా తెలిపారు.

ఈ సందర్భంగా జగన్‌ సర్కార్‌పై మండిపడ్డ ఆయన కాపులకు రిజర్వేషన్ ఇచ్చేది లేదని కరాఖండిగా చెప్పి.. వారినే పావులుగా వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. అలాంటి వ్యక్తిని ముందుగా ప్రశ్నించాల్సిన అవసరముందన్నారు. కుట్రలు, కుయుక్తులతో అల్లిన వైసీపీ వలలో కాపు పెద్దలెవరూ చిక్కుకోవద్దనేదే తన విన్నమన్నారు పవన్‌కల్యాణ్‌. అన్ని సామాజిక వర్గాల్లోనూ నిర్ధిష్టమైన శాతం, కాపు సామాజిక వర్గంలో బలమైన శాతం జనసేనకు అండగా ఉండటంతో వైసీపీకి జీర్ణం కావడం లేదని.. అందుకే కులపరమైన అస్త్రాన్ని వైసీపీ ప్రయోగిస్తోందని ఆయన నిప్పులు చెరిగారు.

Advertisement

కాపులను కాపు నాయకులతో తిట్టిస్తూ.. తూలనాడిస్తున్న వ్యక్తిని కాకుండా నన్ను దూషించడం వల్ల ఎవరికి ప్రయోజనమో గ్రహించాలన్నారు సేనాని. తాను ఇంకా శాసన సభలోకి అడుగుపెట్టలేదని తెలిపిన ఆయన.. తనతోపాటు ఎమ్మెల్యేలను తీసుకువెళ్లే రాజకీయ ప్రస్థానంలో తన ముందరి కాళ్ళకు బంధాలు వేయించాలని చూస్తున్నది ఎవరో ప్రజలు గ్రహిస్తూనే ఉన్నారని లేఖలో పేర్కొన్నారు. కుట్రలు, కుతంత్రాలతో అల్లిన వైసీపీ వలలో చిక్కుకోవద్దని.. తాను గౌరవించే కాపు పెద్దలకు సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నానంటూ లేఖలో విన్నవించారు పవన్‌కల్యాణ్‌.

.

Advertisement

.

Related News

తిరుమలలో ప్రైవేట్ వాహనాలపై TTD క్లారిటీ

పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్‌.. సీఎం సతీశన్ మనసులోని మాట

బిగ్ టీవీ ఎఫెక్ట్.. ముగ్గురు అధికారులపై వేటు, ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినికి గర్భం

డీఎస్సీ రచ్చపై నోరు విప్పిన జనసేన.. ఐదేళ్లలో మీరేం చేశారంటూ వైసీపీని ప్రశ్నించిన మంత్రి దుర్గేష్

బొత్సకు దెబ్బ మీద దెబ్బ.. బెల్లానకు విజయనగరం జిల్లా బాధ్యతలు, వైసీపీ హైకమాండ్ కీలక నిర్ణయం

ఆటోను ఢీ కొట్టిన లారీ.. స్పాట్ లో ముగ్గురు మృతి, విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

చవితి ముసురు.. తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున నుంచి..

జనసేన కొత్త వ్యూహం.. గ్రామీణ ప్రాంతాల్లో జెండా పాతేందుకు పక్కా ప్లాన్!

Big Stories

Advertisement
×