E-Paper
Advertisement

Techie Suicide: ప్రియుడిపై కేసు.. ఓ మహిళా టెక్కీ ఆత్మహత్య, తీగలాగితే..

Techie Suicide: ప్రియుడిపై కేసు.. ఓ మహిళా టెక్కీ ఆత్మహత్య, తీగలాగితే..
Advertisement

Techie Suicide: ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారంటే అందుకు కారణాలు చాలానే ఉంటాయి. రేపో మాపో వివాహం కావాల్సిన ఓ మహిళ టెక్కీ అర్థాంతరంగా ఈ లోకాన్ని విడిచిపెట్టింది. కేవలం తన ప్రియుడిపై కేసు నమోదు చేయడం ఇందుకు కారణంగా తెలుస్తోంది. సంచలనం రేపిన ఈ ఘటన హనుమకొండ జిల్లాలో వెలుగుచూసింది.

ప్రియుడిపై కేసు.. ఆపై టెక్కీ ఆత్మహత్య

Advertisement

హనుమకొండ జిల్లా ధర్మసాగర్‌ ప్రాంతంలోని రాంపూర్‌కు చెందినది టెక్కీ అనూష. ఆమె వయస్సు 22 ఏళ్లు. ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. అయితే అనూష.. వరంగల్‌‌ లోని కాశీబుగ్గ ప్రాంతానికి చెందిన పవన్‌ను ప్రేమించింది. వీరిద్దరు వివాహం చేసుకోవాలని డిసైడ్ అయ్యారు.

ఈ విషయాన్ని వారిద్దరు వారి వారి తల్లిదండ్రులకు చెప్పారు. వారిని ఏదో విధంగా  కన్వీన్స్ చేశారు. మొత్తానికి ఇరు కుటుంబాల పెద్దలు పెళ్లికి అంగీకరించారు. ప్రస్తుతం మంచి ముహూర్తాలు లేకపోవడం తో మార్చిలో వివాహం చేయాలని డిసైడ్ అయ్యారు.

Advertisement

దర్యాప్తులో నిమగ్నమైన పోలీసులు

సీన్ కట్ చేస్తే.. ఇటీవల హైదరాబాద్‌లో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ వ్యవహారంలో పవన్‌పై మాదాపూర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయం హైదరాబాద్ పోలీసుల ద్వారా అనూష కుటుంబసభ్యులకు తెలిసింది. ఈ విషయం తెలియగానే అప్పటినుంచి అనూష అప్‌సెట్ అయ్యింది. మానసికంగా బాధపడుతూ కనిపించేది.

చివరకు మనస్తాపం చెంది బుధవారం ఉదయం తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య పాల్పడింది అనూష. ఆమె తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇంతకీ పవన్‌పై ఎందుకు కేసు నమోదు అయ్యింది? అంతకుముందు జరిగిన వ్యవహారం ఏంటి? ఆయా విషయాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.

ALSO READ: రక్తంలో ప్రేమ లేఖ.. తనను కాదంటే నీ గుట్టు బయటపెడతా

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×