E-Paper
Advertisement

రూటు మార్చిన వైసీపీ.. బీజేపీని టార్గెట్ చేస్తూ, మంత్రి సత్యకుమార్‌పై పేర్ని నాని విసుర్లు

రూటు మార్చిన వైసీపీ..  బీజేపీని టార్గెట్ చేస్తూ,  మంత్రి సత్యకుమార్‌పై పేర్ని నాని విసుర్లు
Advertisement

Vijayawada: ఏపీలో రాజకీయాలు కొత్త టర్న్ అవుతున్నాయి. కొన్నాళ్లుగా బీజేపీపై సైలెంట్ అయిన వైసీపీ.. క్రమంగా బాణాలు ఎక్కుపెడు తోంది. ఏపీ నేతలను మాత్రమే కాదు.. బీజేపీ పెద్దలపై అస్త్రాలు సంధిస్తోంది. బుధవారం మాజీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలపై బీజేపీ వర్గాల్లో అప్పుడే చర్చ మొదలైంది.

ఏపీలో రూటు మార్చిన వైసీపీ

విజయవాడలో మీడియా ముందుకొచ్చారు వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని. ముఖ్యంగా కూటమి ప్రభుత్వానికి సంబంధించి కామన్ పాయింట్‌ని ఎత్తుకున్నారు. ఈ వ్యవహారంలో కూటమి పార్టీలను ఆయన టార్గెట్ చేశారు. నిర్మాణంలో ఉన్న 10 మెడికల్ కాలేజ్ లను వెంటనే ప్రభుత్వమే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాదు మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయొద్దని డిమాండ్ చేశారు.

Advertisement

కేంద్రం నుంచి వయబులిటీ గ్యాప్ ఫండ్ ఇస్తామంటున్నారని గుర్తు చేశారు వైసీపీ నేత. మెడికల్ కాలేజీలు కట్టడానికి ప్రజల సొమ్ము కావాలా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు హెరిటెజ్ సొమ్ము ఇస్తున్నారా? పవన్ సినిమాల్లో వచ్చిన డబ్బు ఇస్తున్నారా? మోదీ-అమిత్ షా-సత్య కుమార్ జేబులోంచి ఇస్తున్నారా? అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు రైజ్ చేశారు. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో సీట్లను బ్లాక్‌లో అమ్ముతుంటే నియంత్రించలేకపోతున్నారని దుయ్యబట్టారు.

బీజేపీ నేతలు, మంత్రి సత్యకుమార్ టార్గెట్

ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సగం సీట్లను అమ్ముకోవచ్చని ప్రభుత్వ పెద్దలు ఎలా చెబుతారు, లక్షలు వసూలు చేసే నారాయణ-చైతన్య కాలేజీలను మీరు నియంత్రించగలిగారా? ఇంతమంది చెబుతున్నా మెడికల్ కాలేజీలను ప్రైవేట్‌కు ఇస్తామని ఎలా చెబుతారని ప్రశ్నించారు. ఏపీలో చంద్రబాబు-పవన్-బీజేపీ కలిసి కూటమి కట్టారని పేర్ని, కేంద్రంలో మేమే.. రాష్ట్రంలో మేమే అని అంటున్నారని గుర్తు చేశారు.

Advertisement

రాష్ట్రానికి ఏదో ఊడ బొడుస్తామని చెప్పి ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని ఆరోపించారు. అలవి కాని హామీలతో అధికారంలోకి వచ్చారని, వచ్చిన నుంచి దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. బరి తెగించి ప్రజల ఆస్తులను అమ్మేస్తున్నారని, సమాజ హితం కోరే అనేకమంది వారిస్తున్నా, ప్రభుత్వ మెడికల్ కాలేజీలను అమ్మే ప్రయత్నాలు మాను కోవాలన్నారు.

ALSO READ: ఏపీలో ఆటో డ్రైవర్లకు పండగ.. బ్యాంకు ఖాతాల్లో రూ.15 వేలు, ఇంకెందుకు ఆలస్యం

Related News

ఏపీలో ఆటో డ్రైవర్లకు పండగ.. బ్యాంకు ఖాతాల్లో రూ.15 వేలు, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీ మైనర్ అనుమానాస్పదంగా మృతి, విజయవాడ లాడ్జీలో ఏం జరిగింది?

అర్ధరాత్రి పెను విషాదం.. ఆ గ్రామంలో భారీ అగ్నిప్రమాదం, ప్రకాశం జిల్లాలో ఘటన

దూసుకొస్తున్న అక్వాన్ తుఫాన్.. కాకినాడ వద్ద తీరం దాటే ఛాన్స్, బలమైన గాలులు మొదలు

ఏపీ కాంట్రాక్టు ఉద్యోగాల జాబ్ స్కామ్‌లో.. మేడ్చల్ ప్రాంత లింకులు..?

రూటు మార్చుకున్న అక్వాన్ తుఫాన్.. ఈ ప్రాంతాల్లో డేంజర్ బెల్స్..?

నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు భేటీ.. ఏపీకి ఆర్థిక సాయంపై కీలక చర్చ

Big Stories

Advertisement
×