E-Paper
Advertisement

తాజ్ మహల్ లోకి ఫ్రీ ఎంట్రీ.. పర్యాటకులకు అదిరిపోయే ఆఫర్!

తాజ్ మహల్ లోకి  ఫ్రీ ఎంట్రీ.. పర్యాటకులకు అదిరిపోయే ఆఫర్!
Advertisement

Free Entry at Taj Mahal: ఆగ్రా వెళ్లాలని ప్లాన్ చేస్తున్న పర్యాటకులకు అదిరిపోయే అవకాశం. నవంబర్ 19న తాజ్ మహల్, ఆగ్రా కోట, ఫతేపూర్ సిక్రీ లాంటి ప్రముఖ చారిత్రక కట్టడాలను ఉచితంగా సందర్శించవచ్చు. ప్రపంచ వారసత్వ వారోత్సవాల ప్రారంభం సందర్భంగా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో దేశీయ పర్యాటకులతో పాటు విదేశీ సందర్శకులకు కూడా ఎంట్రీ ఫీజు లేకుండానే ఈ చారిత్రక ప్రదేశాలను చూసే అవకాశం కల్పిస్తోంది.

నవంబర్ 19న ఫ్రీ ఎంట్రీ.. ఏ ప్రాంతాలకు అవకాశం?

ప్రపంచ వారసత్వ వారోత్సవాలు నవంబర్ 19 నుంచి 25 వరకు జరగనున్నాయి. ఈ సందర్భంగా మొదటి రోజైన నవంబర్ 19న దేశ వ్యాప్తంగా ఏఎస్ఐ ఆధ్వర్యంలో నిర్వహించే కేంద్ర ప్రభుత్వ సంరక్షిత స్మారక కట్టడాలు, పురావస్తు ప్రదేశాలకు ఉచిత ప్రవేశం కల్పించనున్నారు. ఆగ్రాలోని పర్యాటక ప్రాంతాలకు కూడా ఈ అవకాశం వర్తిస్తుంది. ముఖ్యంగా ప్రపంచ ప్రఖ్యాత తాజ్ మహల్, ఆగ్రా కోట, ఫతేపూర్ సిక్రీలను సందర్శించాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. భారతీయులతో పాటు విదేశీ పర్యాటకులు కూడా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు.

తాజ్ మహల్‌లో ఆ ఫీజు మాత్రం తప్పనిసరి!

Advertisement

ఉచిత ప్రవేశం ప్రకటించినప్పటికీ తాజ్ మహల్ సందర్శనకు సంబంధించి ఒక విషయం గుర్తుంచుకోవాలి. ప్రధాన సమాధి లోపలికి వెళ్లాలనుకునే పర్యాటకులు మాత్రం అదనంగా రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని ఏఎస్ఐ సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్ట్ స్మితా కుమార్ వెల్లడించారు. అంటే, స్మారక కట్టడం సందర్శనకు ప్రవేశ రుసుము ఉండదు కానీ, ప్రధాన సమాధి సందర్శనకు మాత్రం ప్రత్యేక టికెట్ అవసరం.

విద్యార్థుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు

వారసత్వ వారోత్సవాల్లో భాగంగా వివిధ చారిత్రక కట్టడాల వద్ద ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నారు. దేశ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాల గురించి ప్రజలకు మరింత అవగాహన కల్పించడం ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశం. ముఖ్యంగా పాఠశాల విద్యార్థుల కోసం వ్యాసరచన, డ్రాయింగ్ లాంటి పలు పోటీలను నిర్వహించనున్నారు. చిన్న వయసు నుంచే చారిత్రక కట్టడాల ప్రాముఖ్యతను తెలుసుకోవడంతో పాటు వాటి పరిరక్షణపై ఆసక్తి పెంచేందుకు ఈ కార్యక్రమాలు ఉపయోగపడనున్నాయి.

తాజ్ మహల్ దగ్గర భద్రత మరింత కట్టుదిట్టం

Advertisement

మరోవైపు తాజ్ మహల్ ప్రాంగణంలో భద్రతను పెంచేందుకు అధికారులు కీలక చర్యలు చేపడుతున్నారు. సందర్శకుల రద్దీని పర్యవేక్షించడంతో పాటు భద్రతను మెరుగుపరిచేందుకు ప్రాంగణంలోని ముఖ్యమైన ప్రాంతాల్లో అదనపు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. వీటిలో 360 డిగ్రీల కోణంలో నిఘా పెట్టగల కెమెరాలు కూడా ఉండనున్నాయి. అంతేకాకుండా, పర్యాటక గైడ్‌లను సులభంగా గుర్తించేందుకు వారికి వేర్వేరు రంగుల్లో గుర్తింపు కార్డులు జారీ చేయనున్నారు. పర్యాటకుల నిర్వహణ, భద్రత, వారసత్వ ఉత్సవాల నిర్వహణను మరింత సమర్థంగా చేపట్టేందుకు అధికారులు ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తంగా నవంబర్ 19న ఆగ్రాలోని చారిత్రక కట్టడాలను సందర్శించాలనుకునే వారికి ఇది మంచి అవకాశంగా చెప్పవచ్చు.

Read Also: అమరావతిలో మరో అద్భుతం.. ఏకంగా రూ.2,245 కోట్లతో దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్!

Tags

Related News

వెకేషన్ వెళుతున్నారా? హోటల్ లేదా ఎయిర్‌బిఎన్‌బి ఏది బుక్ చేసుకోవాలి.. ఏది బెటర్?

గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న రైలుకు బ్రేకులు పడకపోతే.. ఎలా ఆపుతారో తెలుసా?

బంధువులకు సెండాఫ్ ఇచ్చేందుకు వందేభారత్ ఎక్కారు.. షాకింగ్.. రూ.30 వేల జరిమానా కట్టారు!

రైల్లో సైడ్ లోయర్ బెర్త్‌ నే ఎందుకు కోరుకుంటారు? సైకాలజీ చెప్పే క్రేజీ విషయాలివే!

అమరావతిలో మరో అద్భుతం.. ఏకంగా రూ.2,245 కోట్లతో దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్!

కాకులు వాలని ఎకైక పుణ్య క్షేత్రం.. సైన్స్‌కే సవాల్ విసురుతున్న యాగంటి రహస్యాలివే?

సీనియర్ సిటిజన్లకు పిచ్చి పిచ్చిగా నచ్చేసిన బెంగళూరు-గోవా వందే భారత్.. ఎందుకో తెలుసా?

Big Stories

Advertisement
×