ఏపీలో రాజకీయాలు ఇప్పుడు వైజాగ్ చుట్టూ తిరుగుతున్నాయి. వైజాగ్ లో గూగుల్ ఏఐ సెంటర్ రావడంతో టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం ముదిరింది. అసలు గూగుల్ ఏఐ సెంటర్ వచ్చేది లేదని కొన్నాళ్లు, ఒప్పందం కుదిరాక కేవలం ఒప్పందమే కదా అని మరోసారి, అసలు దాంతో ఉద్యోగాలెన్ని వస్తాయని ఇంకోసారి, రాయితీలివ్వడం వల్లే ఆ కంపెనీ వస్తోందని.. ఇలా విమర్శలకోసం వైసీపీ ఆపసోపాలు పడుతోంది. ఇంకో అడుగు ముందుకేసి గూగుల్ ఏఐ సెంటర్ రావడం వల్ల వైజాగ్ కి కరెంటు కష్టాలు వస్తాయనే విమర్శలు కూడా మొదలు పెట్టారు వైసీపీ నేతలు. అయితే గూగుల్ ఏఐ సెంటర్ ఎపిసోడ్ లో కూటమి ప్రభుత్వానికి మంచి మార్కులు పడ్డాయనే చెప్పాలి. అదే ఊపులో వచ్చే నెల వైజాగ్ లో జరగబోయే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) సమ్మిట్ కోసం కూటమి ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా భారీ పెట్టుబడులను ఆకర్షించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. సరిగ్గా ఈ సమ్మిట్ కి ముందే గూగుల్ బోణీ చేయడం కూటమి నేతలకు మరింత ఉత్సాహాన్నిస్తోంది.
విదేశీ పర్యటనలు..
MSME శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఇప్పటికే విదేశీ పర్యటనలో ఉన్నాారు. స్విట్జర్లాండ్, జర్మనీలో ఆయన పర్యటిస్తూ విదేశీ పెట్టుబడులకోసం అణ్వేషిస్తున్నారు. CII సమ్మిట్ కోసం ప్రముఖ కంపెనీలను ఆయన ఏపీకి ఆహ్వానించారు. ఏపీ ప్రభుత్వం అందిస్తున్న పెట్టుబడి రాయితీలను వివరించారు. ఇప్పటికే వచ్చిన వివిధ కంపెనీల గురించి కూడా చెప్పారు. వాటికి అనుబంధంగా మరిన్ని కంపెనీలు వస్తాయని ఆయన అంచనా వేస్తున్నారు.
During my visit to Zurich, Switzerland, I held highly productive discussions engaging with global industry leaders and innovators to explore strategic collaborations that will strengthen Andhra Pradesh’s MSME, innovation, and technology ecosystem.
I held meaningful discussions… pic.twitter.com/Xpe2lf4ap2
— Kondapalli Srinivas (@SKondapalliOffl) October 15, 2025
నారా లోకేష్..
తాజాగా మంత్రి నారా లోకేష్ కూడా ఆస్ట్రేలియా పర్యటనకు బయలుదేరారు. ఈనెల 24 వరకు ఆయన ఆస్ట్రేలియాలో పర్యటిస్తారు. అక్కడి అధునాతన వర్సిటీల్లో బోధనా పద్ధతులపై అధ్యయనం చేస్తారని తెలుస్తోంది. CII భాగస్వామ్య సదస్సు విజయవంతం చేయాలని రోడ్ షోలు కూడా నిర్వహిస్తారు. మొత్తానికి విదేశీ పెట్టుబడుల విషయంలో కూటమి నేతలు ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్టున్నారు.
I’ve departed to Australia today for a 7-day learning and partnership tour under the ‘Special Visitors Program’. I’ll be meeting university leaders, top CEOs, and skills ministers to unlock opportunities for Andhra Pradesh’s youth. I’m also catching up with the Australian Seafood… pic.twitter.com/DwzIUgLoQn
— Lokesh Nara (@naralokesh) October 18, 2025
వైజాగ్ లో నవంబర్ 14, 15 తేదీల్లో CII సమ్మిట్ జరుగుతుంది. ఇందులో దేశ, విదేశీ కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారు. పారిశ్రామికవేత్తలతోపాటు, పాలసీ రూపకర్తలు, విద్యావేత్తలు కూడా పాల్గొంటారు. దీని ద్వారా ఏపీకి మరిన్నిపెట్టుబడులు వస్తాయని, ఏపీ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.
Also Read: లోకేష్ కోడి-గుడ్డు కామెంట్స్
వైసీపీ పరిస్థితి ఏంటి?
గూగుల్ ఏఐ సెంటర్ చుట్టూ జరిగిన రాజకీయం చూస్తూనే ఉన్నాం. రేపు CII సమ్మిట్ ద్వారా మరిన్ని పెట్టుబడులు వస్తే అప్పుడు రాజకీయ రచ్చ ఎలా ఉంటుందో చూడాలి. ఆయా పెట్టుబడుల్ని చూపెడుతూ కూటమి నేతలు వైసీపీని కచ్చితంగా రెచ్చగొడతారు. అప్పుడు కూడా అమర్నాథ్ వంటి నేతలు బయటకు వచ్చి కౌంటర్లివ్వడానికి ఆపసోపాలు పడతారని కూటమి నేతలే సెటైర్లు పేలుస్తున్నారు.
Also Read: వర్మ జీరో కాదు, హీరోనే..
Also Read: జగన్ పులివెందులకు ఇచ్చిందేంటి? చంద్రబాబు విశాఖకు తెచ్చిందేంటి?