BigTV English

AP Politics: పవన్ కోసం వర్మ జీరో..? ఆ ఆడియో ఎలా లీకైంది..

AP Politics: పవన్ కోసం వర్మ జీరో..? ఆ ఆడియో ఎలా లీకైంది..
Advertisement

AP Politics: ఏపీలో కీలకమైన నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి. డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ నియోజకవర్గంలో చుట్టూ వివాదాల కొనసాగుతున్నాయట. రాష్ట్ర మొత్తం టిడిపి వర్సెస్ వైసిపి అన్నట్లు రాజకీయం నడుస్తుంటే .. అక్కడ టిడిపి వర్సెస్ జనసేన అన్నట్లు యుద్దం నడుస్తోందంట. అది కూడా డిప్యూటీ సీఎం వర్సెస్ మాజీ ఎమ్మెల్యే వర్మల మధ్య నడుస్తున్న వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారిందంట..


పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ గురించి తీవ్ర వ్యాఖ్యలు
మంత్రి నారాయణ తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. ఇటీవల నెల్లూరు సిటీ నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో మంత్రి నారాయణ మాట్లాడిన ఆడియో లీక్ అయింది. ప్రస్తుతం ఆ ఆడియో తీవ్ర దుమారం రేపుతోందట. ఈ ఆడియోలో ఆయన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ గురించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆడియో కాల్‌లో మంత్రి నారాయణ మాట్లాడుతూ.. పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే వర్మను పూర్తిగా జీరో చేశామని సంచలన వ్యాఖ్యలు చేశారు.

వర్మ త్యాగంలో పవన్ గెలిచారంటున్న అంబటి రాంబాబు
కేవలం పవన్ కళ్యాణ్‌ కోసమే వర్మను జీరో చేశామని ఆయన స్పష్టంగా చెప్పడం హాట్ టాపిక్‌గా మారిందట. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌, వర్మ వర్గాల మధ్య రోజూ ఏదో ఒక గొడవ జరుగుతుందన్న టాక్ వినిపిస్తోంది. ఇది ఇలా ఉండగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ త్యాగం వల్ల ఇక్కడ డిప్యూటీ సీఎం పవన్ గెలిచారని ఇటీవల అంబటి రాంబాబు అన్నారు. 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏర్పడటంతో పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో వర్మ తన సీటును త్యాగం చేయాల్సి వచ్చింది. ఈ నిర్ణయంపై ఆయన అనుచరులు అభ్యంతరం తెలిపారు. అయినా కూడా కూటమి, పవన్ గెలుపు కోసం వర్మ పోటీ చేయకుండా పవన్ కళ్యాణ్‌కు అవకాశం ఇచ్చారని, అతని త్యాగం వల్లే పవన్‌కు బాగా కలిసి వచ్చిందంటారు.


పవన్ గెలుపు పూర్తి క్రెడిట్ వర్మదే అంటున్న అంబటి
ఆ క్రమంలోనే అంబటి రాంబాబు.. పవన్ కళ్యాణ్ గెలుపుపై వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ సొంతంగా గెలవలేదని.. బలమైన ఓటు బలం ఉన్న వర్మ త్యాగం వల్ల పిఠాపురంలో గెలవగలిగారని సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ గెలుపుకు పూర్తి క్రెడిట్ వర్మకు ఇవ్వాలని, వర్మ సహకారం లేకపోతే పవన్ గెలవడం కష్టమయ్యేది అని అంబటి రాంబాబు అన్నారు.

వర్మ సైలెంట్‌గా ఉండాలని చంద్రబాబు వార్నింగ్
తనను జీరో చేశారని వర్మ గత నాలుగు నెలలుగా చెప్పుకుంటున్నారని మంత్రి నారాయణ టెలీకాన్ఫరెన్స్‌లో పేర్కొన్నారు. పిఠాపురంలో వర్మ ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా ఉండాలని చంద్రబాబు స్వయంగా వార్నింగ్ ఇచ్చారని ఆడియోలో అన్న మాటలు వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా జనసేన వాళ్లు పిలిస్తేనే వర్మ వెళ్లి మాట్లాడాలని, లేకుంటే నిశ్శబ్దంగా ఉండాలని…సీఎం నుంచి స్ట్రిక్ట్‌గా ఇన్‌స్ట్రక్షన్స్‌ ఉన్నాయని మంత్రి నారాయణ ఆ ఆడియోలో అన్న మాటలు ఇప్పుడు చర్చినీయంశంగా మారాయి. పార్టీ ఇంటర్నల్‌ విషయాలపై ఏం మాట్లాడొద్దని, ఎవరైనా లైన్ దాటి మాట్లాడితే వ్యవహారం వేరేలా ఉంటుందని మంత్రి నారాయణ ఈ టెలీకాన్ఫరెన్స్‌లో తెలిపారు. లీకైన ఈ ఆడియో ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది..

Also Read: ఇంటికి పోవద్దా.. పండగపూట బంద్ ఏంటి.! పబ్లిక్ రియాక్షన్

పిఠాపురంలో కూటమి వర్సెస్ కూటమి రాజకీయం.. తాజాగా మంత్రి వాఖ్యలు.. పెను దుమారం రేపుతున్నాయంట. చంద్రబాబు ఎంత ప్రయత్నించినా వివాదాలను నిలిచిపోయేలా లేవు.. మరి దీనిపై చంద్రబాబు యాక్షన్ ఎలా ఉండబోతుందో? జనసేన వ్యూహమేంటో చూడాలి.

Story By Apparao, Bigtv

Related News

AP Heavy Rains: రానున్న 2-3 గంటల్లో ఉరుములతో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు హైఅలర్ట్

Minister Post MLA Balakrishna: బాలయ్యకు బంపర్ ఆఫర్.. మంత్రి పదవి పక్కా..?

Narayana Varma: పిఠాపురంలో వర్మను జీరో చేశామన్న వ్యాఖ్యలపై మంత్రి నారాయణ వివరణ

Tirumala Darshan Tickets: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. జనవరి నెల దర్శన కోటా షెడ్యూల్ విడుదల

Pawan Kalyan: చెప్పాడంటే చేస్తాడంతే.. 100 రోజుల ప్రణాళికను పట్టాలెక్కించిన పవన్

Chandrababu Jagan: జగన్ పులివెందులకు ఇచ్చిందేంటి? చంద్రబాబు విశాఖకు తెచ్చిందేంటి?

Ysrcp Leaders: ఇంతకీ ప్రధాని మోదీని వైసీపీ నేతలు కలిశారా లేదా? అసలెందుకీ రాద్ధాంతం?

Big Stories

×