Big Stories

BJP Manifesto 2024 : మోడీ గ్యారెంటీ.. అసలు మతలబేంటి?

BJP Releases ‘Modi Ki Guarantee’ Manifesto: మనం ఇంతకుముందే చెప్పుకున్నాం.. ఎవరెన్ని ఆరోపణలు చేసినా.. ఎన్ని తిట్లు తిట్టుకున్నా.. ఎన్ని విమర్శలు చేసినా.. దానికి మించి కౌంటర్లు వేసినా.. ఓటర్ ఓ పార్టీకి ఓటు వేయాలంటే చూసేది మేనిఫెస్టో అని.. ఏ పార్టీ మాకు ఏం చేస్తుంది? ఎలాంటి హామీలు ఇస్తుంది? ఇలాంటి వివరాలన్ని మేనిఫెస్టోలో ప్రజలు చూస్తారు.. అనలైజ్ చేసుకుంటారు. ఇప్పటికే కాంగ్రెస్‌ న్యాయపత్ర పేరుతో మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. ఇక ఇప్పుడు మోడీకి గ్యారెంటీ పేరుతో బీజేపీ కూడా రిలీజ్ చేసింది. మరి మోడీ ఇస్తున్న గ్యారెంటీ లేంటి? అవి అమలయ్యే గ్యారెంటీలా? అధికారాన్ని చేరువ చేసేలా ఉన్న గ్యారెంటీలా? లెట్స్‌ ఫైండవుట్.

 

- Advertisement -

76 పేజీల మేనిఫెస్టో.. ప్రతి చోటా మోడీ మాత్రమే దర్శనమిస్తున్న ఈ మేనిఫెస్టోలో చాలా విషయాలు ఉన్నాయి. ఇందులో ఎన్డీఏ సర్కార్ తాము చేసింది ఏంటో చెప్పుకుంటూనే.. చేయబోయేది ఏంటో వివరించే ప్రయత్నం చేసింది. వచ్చే ఐదేళ్లలో కాదు. 2047 వరకు తాము ఏమేం చేస్తామో వివరించడమే ఇందులో హైలేట్.. ఎట్‌ దీ సేమ్ టైమ్.. ప్రజలను ఆకట్టుకునేందుకు ఎలాంటి ఉచితాలు ప్రకటించలేదు. యస్.. ఒక్క రేషన్‌ ఉచితంగా అందిస్తామన్న విషయం తప్ప.. ఏం చేయకుండానే మీ జేబుల్లో డబ్బుల్లు కుమ్మరిస్తామని అస్సలు హామీ ఇవ్వలేదు బీజేపీ.. ఇక వివాదస్పద అంశాల జోలికి అస్సలు పోలేదు. లైక్.. NRC టాపిక్‌ ఈ మేనిఫెస్టోలో భూతద్ధం పెట్టి వెతికినా కనిపించలేదు. కానీ CAA మాత్రం ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పింది. ఇది కూడా కొత్త విషయం కానే కాదు. ఇక ఎప్పటి నుంచో చెబుతున్న యూనిఫామ్ సివిల్‌ కోడ్‌.. వన్‌ నేషన్‌ వన్ ఎలక్షన్‌ను మాత్రం అమలు చేస్తామని చెప్పింది. మొత్తం 10 వర్గాలకు.. 24 మెయిన్ టాపిక్స్‌తో ఈ మెనిఫెస్టోను డిజైన్ చేసింది మోడీ సర్కార్.

- Advertisement -

దేశంలో ప్రస్తుతం 80 కోట్ల మంది పేదలకు ఉచిత రేషన్‌ అందుతోంది. ఈ రేషన్‌ను మరో ఐదేళ్లు అందిస్తామని చెబుతోంది బీజేపీ.. ఇక 70 ఏళ్లకు పైబడిన వృద్ధులందరిని ఆయుష్మాన్‌ భారత్ స్కీమ్‌లోకి తీసుకొచ్చి.. 5 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని హామీ ఇచ్చింది. 2019 ఎలక్షన్‌ మేనిఫెస్టోలో.. అస్సాంలో NRCని పూర్తి చేసి తీరుతామన్న బీజేపీ.. అసలు ఈసారి ఆ టాపిక్‌ను పక్కన పెట్టేసింది. అంతేకాదు.. మణిపూర్, నాగాలాండ్, కశ్మీర్‌లో ప్రస్తుతం భద్రతా బలగాలకు ప్రత్యేక అధికారాలు ఇస్తున్న చట్టాలను తొలగిస్తామని చెబుతోంది.

Also Read: రికార్డులు బ్రేక్.. 45 రోజుల్లో రూ.4650 కోట్లు సీజ్

ఇక ఒక్కో వర్గానికి అనేక హామీలను ఇస్తోంది మోడీకి గ్యారెంటీ.. ఆత్మనిర్భర్‌గా మార్చడం.. అంటే పప్పు ధాన్యాలు, వంట నూనెలు, కూరగాయల ఉత్పత్తి పెంచేందుకు తోడ్పడడం.. ప్రతి కుటుంబానికి నాణ్యమైన ఇల్లు దక్కేలా చూడం. మురికవాడల్లో నివసించేవారికి తక్కువ ఖర్చుతో ఇల్లు నిర్మించి ఇవ్వడం..ఇలా సాగిపోయింది మేనిఫెస్టో.. ఇక మధ్యతరగతి విషయానికి వస్తే.. రెరా చట్టాన్ని బలోపేతం చేయడం.. స్టార్టప్‌ ఎకో సిస్టమ్‌ని పెంచి ఉద్యోగాలను సృష్టించడం.. మరిన్ని IITలు, IIMలు, ఎయిమ్స్‌లను పెంచడం.. అకడమిక్, ప్రాక్టికల్ నైపుణ్యాలను పెంచేందుకు ఇంటర్న్‌షిప్‌ ప్రొగ్రామ్స్‌ను ప్రారంభించడం.. రైల్, మెట్రో కనెక్టివిటీని పంఎచడం.. కొత్త ఎయిర్‌పోర్టులను నిర్మించడం.. 5జీ, 6జీ టెక్నాలజీతాఓ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం.. తమ గ్యారెంటీ అంటోంది బీజేపీ.

యువతకు కూడా అనేక అంశాలపై హామీ ఇస్తోంది బీజేపీ.. మరిన్ని గ్లోబల్ కెపాసిటీ సెంటర్లు, గ్లోబల్ టెక్ సెంటర్లు, గ్లోబల్ ఇంజనీరింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి.. దేశాన్ని హై-వాల్యూ సర్వీసెస్ కోసం గ్లోబల్ హబ్‌గా మార్చే ప్రయత్నాలను బలోపేతం చేస్తామంటోంది బీజేపీ.. ఇక రైతుల కోసం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనను బలోపేతం చేయడం. MSPని పెంచడం.. పీఎం ఫసల్ బీమా యోజనను బలోపేతం చేయడం. నిత్యావసరాల ఉత్పత్తి కోసం కొత్త క్లస్టర్లను ఏర్పాటు చేయడం. ప్రకృతి సెద్యాన్ని బలోపేతం చేయడం ఇందులో హైలెట్‌ఆ ఉన్నాయి. ముద్రా రుణాలను 10 నుంచి 20 లక్షలకు పెంచేందుకు హామీ ఇస్తోంది. అంతేకాదు ZERO TOLLERANCE TOWARDS TERRORISM.. అంటే ఉగ్రవాదాన్ని సహించేది లేదని చెబుతోంది బీజేపీ.. 2014 తర్వాత దేశవ్యాప్తంగా ఉగ్రదాడులు తగ్గిపోయాయంటోది బీజేపీ..
దేశ రక్షణ విషయంలో రాజీ పడేది చెబుతోంది. ఓవరాల్‌గా పరిపాలన, దేశ భద్రత, పారిశుద్ధ్యం, స్పోర్ట్స్‌, అభివృద్ధి, పర్యావరణం, మహిళలు, రైతులు ఇలా అన్ని వర్గాలకు న్యాయం చేస్తామంటోంది మోడీ గ్యారెంటీ పత్రం.

Also Read: ఈడీ అరెస్ట్ చేసింది.. కేవలం 3 శాతం మంది రాజకీయ నాయకులనే: మోదీ

ఇవన్నీ చూశాక కాస్త ఆశ్చర్యకరంగా అనిపించిన విషయం ఏంటంటే.. ప్రజాకర్షక పథకాలకు బీజేపీ ఎందుకు దూరంగా ఉంది? ఇప్పటికే కాంగ్రెస్‌ పాంచ్ న్యాయ్.. పచ్చీస్‌ గ్యారెంటీస్ అని అనేక హామీలు ఇచ్చింది. మహిళలకు లక్ష రూపాయలు ఇవ్వడం. రిజర్వేషన్లను ఎత్తేస్తామని చెప్పడం.. రైతులకు కనీస మద్ధతు ధర కల్పించేందుకు చట్టం తీసుకురావడం. కానీ ఇవేవి బీజేపీ మేనిఫెస్టో కనిపించడం లేదు. ఉద్యోగాలు పెరిగేలా చర్యలు తీసుకుంటామంటున్నారు.

కానీ ఇన్ని ఉద్యోగాలు ఇస్తామని బీజేపీ చెప్పడం లేదు. మరి ప్రజలు బీజేపీ మేనిఫెస్టోను ఆదరిస్తారా? అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న.. చెప్పనివి చేయడం బీజేపీకి అలవాటు. దీనికి ఎగ్జాంపుల్ నోట్ల రద్దు అంశం. నోట్లు రద్దు చేస్తామని ఏ ఎన్నికల హామీ ఇవ్వలేదు బీజేపీ. సడెన్‌గా ప్రధాని నరేంద్రమోడీ తెరపైకి వచ్చి అనౌన్స్ చేశారు. సేమ్ అలాంటి షాక్‌లు మళ్లీ ఏమైనా ఇస్తారా? అనే డౌట్‌ కూడా ఉంది. ఎందుకంటే ఈ ఎన్నికల్లో బీజేపీకి 400 సీట్లు దక్కితే.. రాజ్యాంగాన్ని మార్చేస్తారన్న ప్రచారం ఉంది. నిజానికి ప్రతిపక్షాలు ఈ టాపిక్‌పై ఎప్పటి నుంచో విమర్శలు చేస్తున్నాయి. కానీ దీనికి సంబంధించి బీజేపీ ఎలాంటి ప్రకటన చేయలేదు. రేపు అధికారంలోకి వచ్చాక ఏదైనా సడన్ డెసిషన్ తీసుకుంటారా? అనేది కూడా పెద్ద క్వశ్చన్.

మొత్తంగా చూసుకుంటే బీజేపీ మేనిఫెస్టోలో ఉచితాలు లేవు.. ప్రజలను ఆకట్టుకునే పథకాలు అసలే లేవు.. అన్నింటికి సహాకారం మాత్రమే అందిస్తామంటోంది. అలా చేస్తేనే 2047 వరకు అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ నిలుస్తుందని చెబుతోంది బీజేపీ. మరి మోడీకి గ్యారెంటీ అని తీసుకొచ్చిన ఈ మేనిఫెస్టో.. మోడీ ప్రధాని పదవికి గ్యారెంటీ ఇస్తుందా? ప్రజలు ఈ మేనిఫెస్టోపై తమ సమ్మతిని ఓట్ల రూపంలో చూపిస్తారా? లేదా? అనేది మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News