BigTV English
Advertisement

Police Seized 8 Crore at Vijayawada: ఏపీలో నోట్ల కట్టలు.. అర్థరాత్రి 8 కోట్లు.. మెషిన్లతో కౌంటింగ్!

Police Seized 8 Crore at Vijayawada: ఏపీలో నోట్ల కట్టలు.. అర్థరాత్రి 8 కోట్లు.. మెషిన్లతో కౌంటింగ్!

AP Police Seized 8 Crore at Vijayawada: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేడి ఓ రేంజ్‌కు చేరుతోంది. ఎన్నికల పోలింగ్‌కు కేవలం నాలుగు రోజులు మాత్రమే ఉంది. నేతల మాటల యుద్ధం కాసేపు పక్కనబెడితే.. పోలీసులు జోరు పెంచారు. ఓటర్లను ప్రలోబాలకు గురి చేయకుండా ఉండేందుకు చెక్ పోస్టుల వద్ద భారీగా బలగాలను మొహరించారు. దీనికితోటు సమాచారం ఇచ్చేందుకు సీ విజల్ యాప్ ఉంది. మరోవైపు ఫ్లయింగ్ స్వ్కాడ్ దూకుడు పెంచాయి.


తాజాగా ఆంధ్ర సరిహద్దు జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్‌పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. మెదక్ నుంచి గుంటూరు‌కు పైపులోడుతో వెళ్తున్న లారీని క్షుణ్నంగా తనిఖీ చేశారు. లారీలో ప్రత్యేకమైన కేబిన్‌లో దాదాపు 8 కోట్ల రూపాయలు పట్టుబడంది. దీనిపై డ్రైవర్‌ను ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు ఇచ్చాడు. వెంటనే అదుపులోకి తీసుకున్నారు. మనీని లెక్కించేందుకు కౌంటింగ్ మిషన్లను తీసుకొచ్చారు. దీనికి సంబంధించి ఇంకా ప్రాసెస్ జరుగుతుందని పోలీసులు చెప్పారు.

మరోవైపు ఎన్నికల వేళ నకిలీ నోట్ల వ్యవహారం కలకలం రేపుతోంది. ప్రచారంలో పాల్గొన్న కూలీలకు నాయకులు దొంగనోట్ల పంచిన ఘటన నంద్యాలలో వెలుగుచూసింది. దీనిపై బాధితులు ప్రశ్నిస్తే.. తాము మంచినోట్ల ఇచ్చామని సదరు నాయకులు చెప్పడం గమనార్హం. ఈ లెక్కన ఎన్నికల్లో దొంగ నోట్లు జోరుగా చలామణిలోకి వస్తున్నాయన్నమాట.


Also Read: విజయవాడలో మోదీ రోడ్ షో.. ఒకే వేదికపై మోదీ, చంద్రబాబు, పవన్

ఐదురోజుల కిందట తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో గొల్లప్రోలు టోల్ ప్లాజా వద్ద చేసిన సోదాల్లో భారీగా నగలు పట్టుబట్టాయి. విశాఖ నుంచి కాకినాడకు వస్తున్న సీక్వెల్ లాజస్టిక్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థకు చెందిన వాహనంలో బంగారం, వెండి వస్తువులను పట్టుకున్నారు. మార్కెట్లో ఆయా వస్తువుల విలువ దాదాపు 17 కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు చెప్పారు. సరైన పత్రాలు చూపకపోవడం, తరలించే వ్యక్తుల పేర్లు లేకపోవడంతో వాహనాన్ని సీజ్ చేసి పిఠాపురం ఎమ్మార్వో ఆఫీసుకు తరలించారు.

మూడు వారాల కిందట కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన వివరాల ఆధారంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నుంచి ఏప్రిల్ 16 వరకు దేశవ్యాప్తంగా దాదాపు 562 కోట్ల రూపాయలు విలువ చేసే బంగారం, వెండి ఆభరణాలను సీజ్ చేశారు. ఇక ఏపీలో భారీగా బంగారం, వెండి 50 కోట్ల రూపాయల పైమాటేనని చెబుతున్నారు. రాబోయే వారంలో పసిడి, వెండి ఇంకెంత పట్టుబడుతుందో చూడాలి.

Also Read: YS Sharmila emotional tears: జగన్‌ను తలుచుకుంటూ.. కన్నీరు పెట్టిన వైఎస్ షర్మిల

Related News

Top 20 News Today: జగన్‌పై రామానాయుడు సంచలన వ్యాఖ్యలు, భద్రతా బలగాలను చుట్టుముట్టిన మావోయిస్టులు

Indian Student Dead: అమెరికాలో ఆంధ్రా అమ్మాయి మృతి, అసలు ఏం జరిగిందంటే?

CM Chandrababu In Prakasam: త్వరలో కనకపట్నం.. మా టార్గెట్ అదే, ప్రకాశం జిల్లా టూర్‌లో సీఎం చంద్రబాబు

Top 20 News Today: ఛీ.. ఛీ.. పాఠశాల వద్ద కండోమ్ ప్యాకెట్లు.. తమిళనాడులో ఎగిరిపడ్డ సిలిండర్లు

Tirumala Adulterated Ghee case: తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసు.. వైవీ సుబ్బారెడ్డికి పిలుపు

Amadalavalasa: ఆముదాలవలస లో వైసీపీ ముక్కలవుతుందా?

Tirumala Annadanam: అంబటి ప్రశంస.. భూమనకు ఝలక్

Top 20 News @ 9 PM: గ్రోత్ హబ్‌గా విశాఖ, కేటీఆర్‌కి వ్యతిరేఖంగా పోస్టర్స్

Big Stories

×