BigTV English

Pooja Hegde: ‘గుంటూరు కారం’ సెట్స్‌లో మహేశ్ బాబు, పూజా హెగ్డే.. ఫోటోలు ఎంత బాగున్నాయో

Pooja Hegde: ‘గుంటూరు కారం’ సెట్స్‌లో మహేశ్ బాబు, పూజా హెగ్డే.. ఫోటోలు ఎంత బాగున్నాయో


Pooja Hegde Guntur Kaaram: ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా పలు స్టార్ హీరోల సినిమాలు థియేటర్లలో సందడి చేశాయి. అందులో సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమా గుంటూరు కారం ఒకటి. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. భారీ అంచనాల నడుమ జనవరి 12 ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అందరి అంచనాలను అందుకోవడంలో విఫలం అయింది.

ఫస్ట్ డే నుంచి మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. ఇక అదే సమయంలో హనుమాన్ మూవీ, సైంధవ్, నా సామిరంగ వంటి మూవీలు థియేటర్లలో సందడి చేయడంతో ఈ మూవీ అంతగా ప్రేక్షకాదరణ పొందలేకపోయింది. అంతేకాకుండా ఈ మూవీ దర్శకుడు త్రివిక్రమ్ పై చాలా విమర్శలు కూడా తలెత్తాయి.


త్రివిక్రమ్ ఎప్పుడు ఒకే జానర్ సినిమాలు చేస్తాడని.. అమ్మా, అత్తా, మామ, అల్లుడు, కొడుకు అనే కాన్సెప్ట్‌లతోనే ఆయన సినిమాలు తీస్తాడని చాలా మంది మండిపడ్డారు. ఇకపోతే ఎన్ని విమర్శలు వచ్చినా.. సినిమా కలెక్షన్లు మాత్రం బాక్సాఫీసు వద్ద బాగానే వచ్చాయి. సినిమా పరంగా కాకపోయినా కలెక్షన్ల పరంగా అయినా ఈ మూవీ అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది.

READ MORE: ‘గుంటూరు కారం’లో మార్పులు.. ఈ సీన్లనే యాడ్ చేస్తున్నారంట..?

ఇందులో ముఖ్యంగా మహేశ్ బాబు, శ్రీలీల డ్యాన్స్ ఓ రేంజ్‌లో ఉంది. ఈ కారణంగానే చాలా మంది ప్రేక్షకాభిమాలనులు థియేటర్లకి బారులు తీరారు. ఇక థియేటర్లలో అలరించిన ఈ సినిమా ఇటీవల ఓటీటీలోకి వచ్చి ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా హిందీ వెర్షన్‌లో ఈ సినిమాకి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది.

ఇదిలా ఉంటే ఇందులో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. అయితే ఈ మూవీలో హీరోయిన్‌గా శ్రీలీలకు ముందు పూజా హెగ్డేను తీసుకున్నారు మేకర్స్. కొన్ని రోజులు ఆమెపై కొన్ని కీలక సన్నివేశాలను కూడా చిత్రీకరించారు. అయితే అనివార్య కారణాల వల్ల ఇరువురి అంగీకారంతో పూజా హెగ్డే సినిమా నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత పూజా స్థానంలోకి మీనాక్షి చౌదరి వచ్చారు.

అయితే ఇప్పుడు గుంటూరు కారం మూవీ కోసం పూజా హెగ్డేపై చిత్రీకరించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఫొటోల ప్రకారం చూస్తే.. ఇందులో మొదటిగా అమ్ము పాత్రకు పూజా హెగ్డేను తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎల్లో కలర్ చుడిదార్ వేసిన పూజా‌ను చూస్తుంటే.. గుంటూరు వెళ్లినపుడు కొన్ని సీన్స్‌ను చిత్రీకరించినట్లు కనిపిస్తుంది.

అంతేకాకుండా ఆ ఫొటోల్లో పూజా హెగ్డేతో పాటు శ్రీలీల కూడా కనిపిస్తోంది. దీనిబట్టి చూస్తే మహేశ్ మరదలిగి మీనాక్షి చౌదరి చేసిన పాత్రను శ్రీలీలకు ఇచ్చినట్లు అర్థం అవుతుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు ట్విట్టర్‌లో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలు చూసిన కొందరు నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమాలో పూజా హెగ్డేను పెట్టినా బాగుండేదని.. సినిమా హిట్ అయ్యేదని అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×