BigTV English

Nita Ambani Dance Performance : అనంత్ – రాధిక ప్రీ వెడ్డింగ్ వేడుకలు.. నీతా అంబానీ ప్రత్యేక నృత్య ప్రదర్శన

Nita Ambani Dance Performance : అనంత్ – రాధిక ప్రీ వెడ్డింగ్ వేడుకలు.. నీతా అంబానీ ప్రత్యేక నృత్య ప్రదర్శన
nita ambani dance performance
nita ambani dance performance

Nita Ambani Dance Performance in Anant-Radhika Pre Wedding Celebrations : అనంత్ అంబానీ – రాధిక మర్చంట్ ల ప్రీ వెడ్డింగ్ వేడుకలు జామ్ నగర్ లో మార్చి 1 నుంచి 3 వరకూ ఘనంగా జరిగాయి. అతిరథమహారథులంతా ఈ వేడుకలకు హాజరై.. ప్రత్యేక అవుట్ ఫిట్స్ లో కనిపించి కనువిందు చేశారు. సెలబ్రిటీలు తమ ఆట పాటలతో అతిథులను అలరించారు. వేడుకల్లో చివరిరోజున.. ఆదివారం కాబోయే కోడలి కోసం ప్రత్యేక నృత్య ప్రదర్శన ఇచ్చారు. విశ్వంభరి స్తుతికి ఆమె చేసిన నృత్యం.. అందరినీ అలరించింది. ఈ స్తుతి శక్తి స్వరూపిణి అయిన అంబేదేవికి అంకితం చేయబడిన ఒక పవిత్రమైన శ్లోకం.


నీతా అంబానీ ఈ స్తుతిని ఆమె చిన్నతనం నుంచి వింటున్నారు. గుజరాతీ సంప్రదాయ దుస్తుల్లో.. అందమైన చీరకట్టుతో విశ్వంభరి స్తుతికి ఉత్తేజకరమైన ప్రదర్శన ఇచ్చారు. తన చిన్న కొడుకు – కాబోయే కోడలు అనంత్ – రాధిక లు ఆనందంగా ఉండాలని, అందుకు ఆశీస్సులు కావాలని ఆ తల్లిని కోరుతూ.. భక్తితో ప్రదర్శన ఇచ్చారు. ఈ నృత్య ప్రదర్శనను స్త్రీ శక్తికి ప్రతీకలైన యువతులందరికీ అంకితం చేశారు.

కాగా.. అనంత్ రాధిక ప్రీ వెడ్డింగ్ వేడుకలలో చివరి రోజున.. అంబానీ ఫ్యామిలీ రెండు వేర్వేరు ఈవెంట్‌లను నిర్వహించింది. ఉదయం అంతా టస్కర్ ట్రైల్స్ గురించి, అతిథులు జామ్‌నగర్ అందాలను ఆస్వాదించి, వంటారాలో బ్రంచ్ ను ఆనందించారు – అంబానీలు కొత్తగా ప్రారంభించిన జంతు సంరక్షణ కేంద్రాన్ని సందర్శించారు. సాయంత్రం అంతా ‘హస్తక్షర్’ గురించి ఈవెంట్ నిర్వహించారు. చివరి రోజున ఈ వేడుకలో బిల్ గేట్స్, మార్క్ జుకర్‌బర్గ్, అతని భార్య ప్రిస్సిల్లా చాన్, నటులు సిద్ధార్థ్ మల్హోత్రా, అమితాబ్ బచ్చన్, కియారా అద్వానీ, ఐశ్వర్య రాయ్, రణబీర్ కపూర్, సైఫ్ అలీ ఖాన్‌తో సహా అతిథులు భారతీయ సంప్రదాయ దుస్తుల్ని ధరించారు.


Read More : ఫ్లిప్ కార్ట్ మరో ముందడుగు.. యూపీఐ సేవలు ప్రారంభించిన ఈకామర్స్ సంస్థ..

ఆఖరి రోజు కూడా అనంత్ అంబానీ రాధిక కోసం ఎదురుచూస్తుండగా రాధిక మర్చంట్ నడిరోడ్డుపై నడుచుకుంటూ వచ్చారు. అంబానీ దంపతులు మహా హారతి, అనంతరం విలాసవంతమైన విందు చేశారు. అరిజిత్ సింగ్, ప్రీతమ్, శ్రేయా ఘోషల్, ఉదిత్ నారాయణ్ వంటి కళాకారులు అతిథుల కోసం ప్రదర్శనలు ఇచ్చిన అనంతరం కార్యక్రమం ముగిసింది. .

అంబానీ కుటుంబం మార్చి 1 నుండి మార్చి 3 వరకు అనంత్ – రాధిక లగ్రాండ్ వెడ్డింగ్ బాష్‌ను నిర్వహించారు. మొదటి రోజున అతిథులు భారతదేశంలో మొదటిసారిగా పాప్ ఐకాన్ రిహన్నా ప్రదర్శనను చూశారు. 2వ రోజు, అంబానీలు తమ అతిథులకు వంటారా పర్యటనను అందించారు. ఈ రోజు ఈవెంట్‌కు ఎ వాక్ ఆన్ ది వైల్డ్‌సైడ్ అని పేరు పెట్టారు. ఇక్కడ అందరూ జంగిల్ నేపథ్య దుస్తులను ధరించాలని సూచించారు. దీంతో అతిథులు రకరకాల అవుట్ ఫిట్స్ లో కనిపించారు.

సాయంత్రం వారు మేళా రోగ్ అనే గొప్ప సంగీత పార్టీని నిర్వహించగా.. అక్కడ అతిథులందరూ భారతీయ వస్త్రధారణలో కనిపించారు. రాత్రి అంబానీలు వివిధ పాటలను ప్రదర్శించారు. తల్లిదండ్రులు కాబోతున్న దీపికా పదుకొనే, రణవీర్ సింగ్, అలియా భట్ – రణబీర్ కపూర్‌లతో సహా అతిథులు ఐకానిక్ పాటలకు నృత్యం చేశారు. మూడు రోజుల ప్రీ వెడ్డింగ్ ఉత్సవాలు మార్చి 3న ముగియగా, జూలై 12న ముంబైలో అనంత్-రాధిక వివాహం జరగనుంది. వీరి వివాహానికి అంబానీ ఫ్యామిలీ ఏకంగా రూ.1000 కోట్లు ఖర్చు చేస్తోంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెళ్లిగా నిలవనుంది.

Related News

Digital Rent Agreement: ఈ రూల్ తెలియకుండా ఇల్లు అద్దెకు ఇస్తే రూ. 5000 జరిమానా కట్టక తప్పదు..

Real Estate: ఈ విషయాలు తెలియకుండా ‌ఫార్మ్ లాండ్స్ కొంటే భారీ నష్టం తప్పుదు..అడ్వర్టయిజ్‌మెంట్స్ చూసి మోసపోకండి..

Gold Particles: మురుగునీటి నుంచి భారీగా బంగారం ఉత్పత్తి.. లక్షల్లో సంపాదన..? ఎక్కడో తెలుసా?

Free Tempered Glass: టెంపర్డ్ గ్లాస్ డబ్బులు పెట్టి కొంటున్నారా? ఇకపై ఫ్రీగా పొందండిలా!

Jio Cheapest Plan: జియో చీపెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్, దీనితో లాభమేంటో తెలుసా?

Jio Offers: జియో నుంచి అదిరిపోయే ఆఫర్, 11 నెలలకు జస్ట్ ఇంతేనా?

Big Stories

×