Gundeninda Gudigantalu : తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ వచ్చినా సీరియల్స్లలో గుండె నిండా గుడిగంటలు సీరియల్ ఒకటి. ఈ సీరియల్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. గత కొద్దిరోజులుగా సీరియల్ కి డిమాండ్ కూడా భారీగా పెరగడంతో ఎక్కువమంది ఈ సీరియల్స్ ని చూడ్డానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే ఈ సీరియల్ లో ఎక్కువగా బాలు మీనాల కోసమే చూస్తున్నారు అని అందరికీ తెలుసు. బాలు కి బెస్ట్ ఫ్రెండ్ గా ఉన్న రాజేష్ క్యారెక్టర్ కూడా జనాలని విపరీతంగా విపరీతంగా ఆకట్టుకుంటూ వస్తుంది బాలుకి మంచి స్నేహితుడుగా తనకి ఏ కష్టం వచ్చినా కూడా ముందుంటున్నారు రాజేష్. ఇప్పుడు ఈ సీరియల్ నుంచి తప్పుకుంటున్నాడు అంటూ ఒక వార్త వినిపిస్తుంది. అందులో నిజం ఎంత ఉందో తెలియదు.. గానీ ప్రస్తుతం ఇదైతే హాట్ టాపిక్ గా మారింది. మరి నిజంగానే రాజేష్ ఈ సీరియల్ నుంచి తప్పుకుంటున్నాడా లేదా అన్నది కాస్త వివరంగా తెలుసుకుందాం..
ఈ సీరియల్లో బాలు కి ప్రాణ స్నేహితుడుగా రాజేష్ నటిస్తున్నాడు. ఒకరికి ఒకరు ఏ కష్టం వచ్చినా సాయం చేసుకుంటూ మంచి స్నేహితులుగా కొనసాగుతున్న వీరిద్దరూ ఇప్పుడు విడిపోతున్నారు అంటూ ఒక వార్త వినిపిస్తుంది. అందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ఈ సీరియల్ నుంచి రాజేష్ తప్పుకుంటున్నాడు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం అవుతుంది. అందుకు కారణం కూడా లేకపోలేదు. రాజేష్ ఇటీవల వేరొక సీరియల్లో కనిపించడంతో ఈ సీరియల్ కి గుడ్ బై చెప్పాడా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అందులోనూ ఈ మధ్య రాజేష్ కనిపించకపోవడంతో అది నిజమే అనే ప్రచారం జోరు అందుకుంది.. స్టార్ మా లో ప్రసారమవుతున్న మరొక సీరియల్ గోదావరిలో ఈ నటుడు కనిపించడంతో ప్రేక్షకులు రాజేష్ క్యారెక్టర్ గుండె నిండా గుడిగంటల నుండి వెళ్లిపోయింది అంటూ ఫీల్ అవుతున్నారు. నిజానికి ఈ సీరియల్ లో కూడా అతను నటిస్తూ వస్తున్నాడని ఒక తెలుస్తుంది. మరి రాజేష్ ఏ సీరియల్ కి ప్రియారిటి ఇస్తాడు అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.
సోషల్ మీడియా ద్వారా ఎంతో మంది మంచి క్రేజీని సంపాదించుకుంటూ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటూ వస్తున్నారు. ఇటీవల కాలంలో ఎక్కువ మంది సోషల్ మీడియా ద్వారా బాగా పాపులర్ అయ్యి సీరియల్స్లలో కూడా సందడి చేస్తూ వస్తున్నారు. గత కొద్దిరోజులుగా సీరియల్స్ లో నటిస్తున్న వాళ్ళందరూ కూడా సోషల్ మీడియా ఇంట్లో కావడం విశేషం. అలా రాజేష్ కూడా పాపులర్ అయ్యి సీరియల్స్లలో అవకాశాలను అందుకుంటూ వచ్చాడు. ఇతని అసలు పేరు యశోద కృష్ణ ప్రస్తుతం సీరియల్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈయనకున్న క్రేజ్ తో మంచి రెమ్యూనరేషన్ ని కూడా అందుకుంటూ వస్తున్నాడు.
Also Read : ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘టీఆర్పీ రేటింగ్.. నవంబర్ నెల హైలెట్స్..