AP Local body elections: అర్నబ్ తుఫాను ప్రభావం ఏపీలోని స్థానిక సంస్థల ఎన్నికలపై పడే అవకాశం ఉంది. ఎన్నికలు వాయిదా పడే అవకాశముందని ప్రభుత్వ వర్గాల నుంచి బలంగా వినిపిస్తున్న మాట. తుఫాను కారణంగా రోడ్లు, విద్యుత్ వ్యవస్థలు దెబ్బ తిన్న నేపథ్యంలో వాయిదాపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఏపీలో అర్నబ్ తుఫాను బీభత్సం చేసింది. రోడ్లు, విద్యుత్ సదుపాయాలు తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రస్తుతం సహాయక చర్యలు వేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలు వాయిదా వేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా జిల్లా పరిషత్ ఎన్నికల వాయిదాపై బుధవారం లేకుంటే గురువారం రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి ప్రకటన రావచ్చన్నది అధికారుల మాట.
ఎస్ఈసీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. నవంబర 3న జెడ్సీటీసీ ఎన్నికల పోలింగ్ జరగాల్సి వుంది. పోలింగ్ ఐదుకు మార్చే అవకాశం ఉందని అంటున్నారు. ఓట్ల లెక్కింపు 7 కు మారవచ్చని ఎస్ఈసీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం పట్టణ సంస్థల ఎన్నికల పోలింగ్ అక్టోబర్ 28 నుంచి నవంబర్ ఒకటికి వాయిదా పడింది. వాటికి సంబంధించి ఓట్ల లెక్కింపు నవంబర్ మూడుకు రాష్ట్ర ఎన్నికల సంఘం వాయిదా వేసిన విషయం తెల్సిందే.
నవంబర్ మూడున జిల్లా, మండల పరిషత్ ఎన్నికల పోలింగ్ ఉండడం దీని కారణంగా చెబుతున్నారు. ఎన్నికల పరంగా తలెత్తే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని పరిషత్ ఎన్నికల పోలింగ్, ఓట్ల లెక్కింపు వాయిదా వేసే అవకాశముందని అధికారుల మాట. ఎన్నికలపై ముందుకు వెళ్లాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది. ఈ నేపథ్యంలో పరిషత్ పోలింగ్, ఓట్ల లెక్కింపు వాయిదాపై ఎన్నికల కమిషనర్ పునేఠా ఓ ప్రకటన చేసే అవకాశముంది.
ALSO READ: అర్ణబ్ తుఫాన్ బీభత్సం.. ఏలూరు, తీరప్రాంతాలు జలదిగ్బంధం
ఇదొక వెర్షన్ కాగా, అర్నబ్ తుఫాను వైపు వద్దాం. తుపాను ప్రభావంతో దీనిపై ఏ విధంగా ముందుకు వెళ్లాలి అనేదానిపై ఎన్నికల సంఘం ఆచితూచి వ్యవహరిస్తోంది. మంగ, బుధవారాల్లో తుఫాన్ అల్లకల్లోలం చేసింది. రవాణాకు ఆటంకం, విద్యుత్ స్థంబాలు నేలకొరగడం, చెట్లు విరిగిపోవడం వంటి పరిమాణాలు చోటు చేసుకున్నాయి. ఇప్పట్లో పోలింగ్ నిర్వహిస్తే ఓటర్లు రాని పరిస్థితి ఉండే అవకాశముందని లెక్కలు వేస్తోంది. తుఫాన్ గురించి జరిగిన నష్టం గురించి పూర్తి నివేదిక తీసుకున్న తర్వాత ఎన్నికల వాయిదాపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. గురువారం కూడా వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ వ్యవహారంపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వెయిట్ అండ్ సీ.