CM Chandrababu: ఏపీని అల్లకల్లోలం చేసిన అర్నబ్ తుఫానుపై అధికారుల నుంచి ఎప్పటికప్పుడు వివరాలు తెలుసు కుంటున్నారు సీఎం చంద్రబాబు. తుఫాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఆర్టీజీఎస్ అధికారులు, క్షేత్రస్థాయిలో పని చేస్తున్న ఉద్యోగులతో సీఎం చంద్రబాబు బుధవారం ఉదయం సమీక్ష నిర్వహించారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నబ్ తుఫాను ఏపీకి అల్లకల్లోలం చేసింది. గడిచిన 24 గంటలుగా తుఫాను చేసిన బీభత్సం అంతా ఇంతా కాదు. శ్రీకాకుళం మొదలు కృష్ణా జిల్లా వరకు విధ్వంసం కొనసాగుతూనే ఉంది. క్యాంప్ ఆఫీసులో ఉన్న సీఎం చంద్రబాబు, రాత్రి 1.30 గంటల వరకు పరిస్థితిని సమీక్షిస్తూనే ఉన్నారు. రాత్రంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, క్షేత్ర స్థాయిలో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
బుధవారం ఉదయం 6 గంటలకు మళ్లీ అధికారులతో టెలికాన్ఫరెన్సు నిర్వహించారు సీఎం చంద్రబాబు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితి, జరిగిన నష్టం, సహయక చర్యలను అడిగి తెలుసుకుంటున్నారు. కొద్ది సేపట్లో తుఫాన్ తీరం దాటిందని ముఖ్యమంత్రికి వివరించారు అధికారులు. ఈ ప్రభావంతో బుధ, గురువారాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు ఆర్టీజీఎస్ అధికారులు.
తుఫాన్ ప్రభావంతో చాలా ప్రాంతాల్లో చెట్లు నేల కొరిగాయని, కొన్నిచోట్ల విద్యుత్ స్థంభాలు నేల కొరిగాయని సీఎం దృష్టికి తీసుకొచ్చారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ముందు జాగ్రత్తగా విద్యుత్ నిలిపేశామని వివరించారు. పడిపోయిన చెట్లను వెంట వెంటనే తొలగించాలని, గాలుల తీవ్రత తగ్గిన తర్వాత విద్యుత్ పునరుద్దరణకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ALSO READ: ఏపీని వణికించిన అర్నబ్ తుఫాన్.. కుమ్మేస్తున్న భారీ వర్షాలు, విద్యుత్ లేక అల్లాడిన ప్రజలు
అదే సమయంలో చెరువులు, కాల్వలు పొంగి పొర్లకుండా ఎక్కడికక్కడ జాగ్రత్తలు తీసుకోవాలని దిశా నిర్దేశం చేశారు ముఖ్యమంత్రి. జిల్లాల వారీగా తాము చేపడుతున్న సహయక చర్యలను వివరించారు కలెక్టర్లు. కోనసీమ జిల్లాలో సుమారు 6 వేల విద్యుత్ స్థంభాలు నేల కొరిగాయని తెలిపారు జిల్లా కలెక్టర్. వర్షం తగ్గుముఖం పట్టినా ఈదురు గాలులు జోరు కొనసాగుతోందని వెల్లడించారు. తుఫాన్ కారణంగా ప్రాణ నష్టం జరిగిందా? అని అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ప్రస్తుతానికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదనే అధికారులు చెప్పుకొచ్చారు. తుఫాన్ కారణంగా ఆస్తి నష్టాన్ని తగ్గించేందుకు కృషి చేయాలని సూచన చేశారు ముఖ్యమంత్రి. స్వర్ణ గ్రామ, వార్డు కార్యాలయాలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలన్నారు సీఎం చంద్రబాబు. తుఫాన్ షెల్టర్లల్లో ఆశ్రయం పొందుతున్న వారిని పరిస్థితి పూర్తి స్థాయిలో కుదుట పడిన తర్వాత ఇళ్లకు పంపాలన్నారు సీఎం చంద్రబాబు.
🚨 The speed has slowed a bit, but seeing the aftermath is truly devastating.
📍Mogalthur,W.Godavari district#CycloneArnabUpdate pic.twitter.com/K5aEusxFPC
— SreeRahul(TakkariDonga) (@rahul_2011_T) October 28, 2026
#WATCH | Cyclone Arnab | Visakhapatnam, Andhra Pradesh |
Tree uprooted near the AU College of Engineering for Women due to strong winds prevailing under the influence of the cyclone.Centre of the severe cyclonic storm is very close to the coast line and the landfall process… pic.twitter.com/fjEEpwyxZT
— ANI (@ANI) October 28, 2026
#CycloneArnab : Landfall process has commenced at 1.23 AM.#AP CM holds another teleconference with officials.
No loss of life reported so far.
Trees uprooted at several places in the Narsapuram region; officials have begun clearing them
West Godavari and Krishna districts… pic.twitter.com/A5PATXNQ1v
— NewsMeter (@NewsMeter_In) October 27, 2026