Cyclone Arnab: ఆంధ్రప్రదేశ్‌లో అర్నబ్ తీవ్ర తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. ఉత్తరాంధ్ర నుంచి ఉమ్మడి కృష్ణా జిల్లాల వరకు పెను విధ్వంసం సృష్టించింది. నర్సాపురం తీరం సమీపంలోకి ప్రవేశించింది. ప్రస్తుతం భూభాగాన్ని తాకింది అర్నబ్ తుఫాన్ వలయం. పూర్తిగా తీరం దాటడానికి మరో రెండు లేదా మూడు గంటలు పట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
బంగాళాఖాతలో ఏర్పడిన అర్నబ్ తుఫాను మరో రెండు గంటల్లో పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం వద్ద తీరం ధాటే అవకాశం ఉంది. గడిచిన 6 గంటల్లో గంటకు 17 కి.మీ. వేగంతో కదులుతోంది ఈ తుఫాన్. కాకినాడకు 70 కిమీ, నర్సాపురానికి 60 కి.మీ, తునికి 120 కి.మీ, మచిలీపట్నానికి 120 కి.మీ, విశాఖకు 190 కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది. తుఫాను ప్రభావంతో మంగళవారం నుంచి శ్రీకాకుళం జిల్లా నుంచి కృష్ణా జిల్లాల వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీరం ధాటే సమయంలో గంటలకు 3 కిలోమీటర్ల వేగంగా ప్రయాణిస్తున్న అర్నబ్. తుఫాను నేపథ్యంలో గడిచిన 24 గంటల్లో ఉత్తరాంధ్రలో 25 సెంటీమీటర్లు పైగానే వర్షం పడింది.
అర్నబ్ తీవ్ర తుపాను నేపథ్యంలో బుధవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా విశాఖ, అనకాపల్లి, కాకినాడ, ఉభయగోదావరి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం అంచనా వేశారు. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, గుంటూరు, పల్నాడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు.
తీవ్ర తుఫాన్ ప్రభావం శ్రీకాకుళం జిల్లాపై బలంగా పడింది. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలతోపాటు పెనుగాలులు తోడయ్యాయి. దీంతో ఎక్కడికక్కడ చెట్లు విరిగిపోయాయి. జిల్లా వ్యాప్తంగా వాహనాల రాకపోకలపై ట్రాఫిక్ ఆంక్షలు విధించారు అధికారులు. జిల్లాలో ఇప్పటివరకు 60 సెం.మీ భారీ వర్షపాతం నమోదు అయ్యింది. బుధవారం అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు అధికారులు.
ఈదురు గాలులకు మంగళవారం మధ్యాహ్నం నుండి కొన్ని ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. ఫలితంగా విద్యుత్ వైర్లు తెగి విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బుధ, గురువారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు నాగావళి, వంశధార నదుల్లో వరద ప్రవాహం గరిష్ట స్థాయికి చేరుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ క్రమంలో నదీ తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
ALSO READ: ఏపీకి దూసుకొస్తున్న ‘అర్నబ్’ తుపాన్.. తెల్లవారుజామున 2 నుంచి వర్షాలు..!
🚨 అమలాపురంలో #ArnabCyclone బీభత్సం! 🌪️⛈️
అర్ధరాత్రి భారీ ఈదురుగాలులు, కుండపోత వర్షంతో విలవిల్లాడుతున్న కోనసీమ! 💨 కొబ్బరి చెట్లు బలమైన గాలులకు ఊగిపోతూ భయానక పరిస్థితులు నెలకొన్నాయి.
యానాం సమీపంలో తుపాను తీరం దాటే అవకాశం ఉండటంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారుల… pic.twitter.com/sOlAoDP03f
— Janya Digital Media (@janyamedia1) October 27, 2026
#ArnabCyclone Uppada , Near Kakinada, Andhra Pradesh pic.twitter.com/TewhjFuTRo
— KSN (@SmoothingWoods) October 28, 2026