E-Paper
Advertisement

ఏపీకి దూసుకొస్తున్న ‘అర్నబ్’ తుపాన్.. తెల్లవారుజామున 2 నుంచి వర్షాలు..!

ఏపీకి దూసుకొస్తున్న ‘అర్నబ్’ తుపాన్.. తెల్లవారుజామున 2 నుంచి వర్షాలు..!
Advertisement

Cyclone Arnab: ఆంధ్రప్రదేశ్ అర్నబ్ తుపాన్ అతి వేగంగా కదులుతుంది. దీంతో అక్కడి ప్రాంత మంతా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలోని ఉపరితల ప్రాంతం నండి భూభాగాన్ని తుపాను బాహ్య వలయం చుట్టూ అలుముకుంటుంది. దీంతో తెల్లవారుజామున 2–4 గంటల మధ్య పూర్తిగా తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

రేపు ఉదయం..

అయితే గడిచిన 6 గంటల్లో గంటకు 18 కిమీ వేగంతో కదిలిన అతి వేగంగా తుపాన్ కదులుతుంది. విశాఖపట్నంకు 170కి.మీ., కాకినాడకు 90 కి.మీ. మచిలీపట్నంకు 170 కి.మీ. బాపట్లకు 240 కి.మీ దూరంలో కేంద్రీకృతం అయి వుంది. ఈ తుఫాను ప్రభావంతో రేపు ఉదయం వరకు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు క్లారిటీ ఇచ్చారు. ఈరోజు ఉదయం 8.30గంటల నుంచి 28 ప్రాంతాల్లో కురిసిన అతిభారీ వర్షాలు పడనున్నాయి. దీంతో దాదాపుగా 133 ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు క్లారిటీ ఇచ్చారు.

75 మి.మీ వర్షపాతం..

Advertisement

ఇప్పటికే కాకినాడలో మంచి వర్షాలు ప్రారంభమవ్వగా, విశాఖపట్నంలో ఇప్పటికే 75 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇక తుపాను మరింత బలపడుతుండటంతో రాబోయే 3 గంటల్లో విశాఖలో ఈదురుగాలులు గంటకు 40 కి.మీ, కాకినాడ-తుని ప్రాంతాల్లో గంటకు 30 కి.మీ వేగంతో వీచే అవకాశముందని రాత్రికి వీటి తీవ్రత మరింత పెరుగుతుందని అధికారులు తెలిపారు.

Also read: ఏపీలో క్షణక్షణం ఉత్కంఠ.. దూసుకొస్తున్న అర్నాబ్ తుఫాను.. ప్రజల్ని బయటకు రావొద్దన్న చంద్రబాబు!

Tags

Related News

ఏపీలో క్షణక్షణం ఉత్కంఠ.. దూసుకొస్తున్న అర్నాబ్ తుఫాను.. ప్రజల్ని బయటకు రావొద్దన్న చంద్రబాబు!

వైఎస్ షర్మిల సంచలన నిర్ణయం.. స్థానిక ఎన్నికలు నిలిపివేయాలని ఎస్ఈసీకి లేఖ!

సుప్రీంకోర్టులో వైఎస్సార్‌సీపీకి ఎదురుదెబ్బ.. నామినేషన్ల పిటిషన్‌ తిరస్కరన!

ఆ ఆస్తులతో నీకు సంబంధం లేదు.. వైఎస్ షర్మిలకు భారతి లేఖ.. సోషల్ మీడియాలో వైరల్!

చంద్రబాబు, పవన్‌లది అలీబాబా ఇద్దరు దొంగల పాలన: పేర్ని నాని

‘అర్నబ్’ తుపాన్ ఎఫెక్ట్.. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 10 రైళ్లు రద్దు!

ఏపీలో అర్నబ్ తుఫాను బీభత్సం.. రంగంలోకి దిగిన బృందాలు, కలెక్టర్లకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

Big Stories

Advertisement
×