E-Paper
Advertisement

డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడ్డ బస్సు.. స్పాట్‌లో 26 మంది ప్రయాణికులు!

డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడ్డ బస్సు.. స్పాట్‌లో 26 మంది ప్రయాణికులు!
Advertisement

Bus Accident: విజయవాడ సమీపంలో జాతీయ రహదారిపై మంగళవారం వేకువజామున ఒక భయంకరమైన రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చెన్నై నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న వైబీఎం ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అమరావతి పరిధిలోని తేలప్రోలు సమీపంలో ఉన్న జాతీయ రహదారి-16పై ప్రమాదానికి గురైంది. వేగంగా వెళ్తున్న ఈ బస్సు అకస్మాత్తుగా అదుపుతప్పి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను బలంగా ఢీకొని బోల్తా పడింది.

ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 26 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. ఈ దుర్ఘటనలో 12 మందికి తీవ్ర రక్తగాయాలు కాగా, మరికొందరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాదాన్ని గమనించి బస్సును తప్పించే క్రమంలో వెనుక నుంచి వస్తున్న ఒక లారీ మరో వాహనాన్ని ఢీకొట్టడంతో, ఆ లారీ డ్రైవర్‌కు కూడా తీవ్ర గాయాలయ్యాయి.

Advertisement

సమాచారం అందుకున్న వెంటనే గన్నవరం డీఎస్పీ ధర్మేంద్ర, ఆత్కూరు పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన ప్రయాణికులను స్థానికుల సహాయంతో వెంటనే సమీపంలోని చిన్న అవుటపల్లి పిన్నమనేని సిద్ధార్థ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నారు.

Also Read: హార్పిక్ ఘటన మరువక ముందే.. కూరలో విషం కలిపి భర్త, అత్తపై హత్యాయత్నం!

Tags

Related News

అనకాపల్లి జిల్లాలో విషాదం.. వేర్వేరు ఘటనల్లో రెండు ప్రేమజంటల ఆత్మహత్య!

వైసీపీకి చిచ్చుపెడుతున్న విజయసాయిరెడ్డి.. మా పార్టీ అసలైన రాయలసీమ రెడ్ల పార్టీ

అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.. వైసీపీ నేతలు షాక్

ట్రైన్‌పై ఓ వ్యక్తి నానాహంగామా.. ఆత్మహత్య చేసుకుంటానంటూ, రేణిగుంట రైల్వే స్టేషన్‌లో రచ్చ

మెల్‌బోర్న్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. విశాఖకు చెందిన ఇద్దరు మహిళలు మృతి, షాకింగ్ ఫుటేజ్ వెలుగులోకి

భర్తను వదిలేసి బావ కొడుకుతో ఎఫైర్.. చివరకు ఏమైందంటే..

రాష్ట్రంలో తీవ్ర కరువు.. ఎకరాకు రూ. 25 వేల పరిహారం ఇవ్వాల్సిందే! వైఎస్ జగన్ డిమాండ్

తుని వద్ద రోడ్డు ప్రమాదం.. పెళ్లి బస్సు బోల్తా, 40 మందికి గాయాలు!

Big Stories

Advertisement
×