E-Paper
Advertisement

హార్పిక్ ఘటన మరువక ముందే.. కూరలో విషం కలిపి భర్త, అత్తపై హత్యాయత్నం!

హార్పిక్ ఘటన మరువక ముందే.. కూరలో విషం కలిపి భర్త, అత్తపై హత్యాయత్నం!
Advertisement

Nizamabad: సమాజంలో వివాహేతర సంబంధాలు పచ్చని సంసారాల్లో ఆరిపోని చిచ్చు పెడుతున్నాయి. నూరేళ్ల పంటగా నిలవాల్సిన వైవాహిక బంధాలను అక్రమ సంబంధాలు దారుణంగా బలితీసుకుంటున్నాయి. ఇటీవల నిజామాబాద్ జిల్లాలో హార్పిక్ లిక్విడ్‌తో భర్తను హతమార్చిన దారుణ సంఘటన మరువక ముందే, జిల్లాలో మరో సంచలన హత్యాయత్నం వెలుగు చూసింది.

మిల్ మేకర్ కూరలో గడ్డిమందు..

Advertisement

మోపాల్ మండల పరిధిలో ఓ మహిళ తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారని భావించి భర్త, అత్తలను మట్టుబెట్టాలని ప్లాన్ వేసింది. ఇందులో భాగంగా ఇంట్లో వండిన మిల్ మేకర్ కూరలో ఎవరికీ అనుమానం రాకుండా గడ్డిమందు కలిపింది. ఆ ఆహారాన్ని తిన్న వెంటనే భర్త, అత్త తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించడంతో ప్రాణపాయం తప్పింది.

రిమాండ్‌కు తరలింపు..

Advertisement

బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన మోపాల్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మోపాల్ ఎస్‌ఐ సుష్మిత తెలిపిన వివరాల ప్రకారం.. పోలీసుల విచారణలో నిందితురాలు సోనీ తన అక్రమ సంబంధం కోసమే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు ఒప్పుకుంది. దీంతో ఆమెను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్‌కు తరలించారు.

ఈ వరుస కుటుంబ నేరాలు నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా తీవ్ర కలకలం రేపాయి. కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Also Read: రష్యా బీచ్‌పై డ్రోన్ దాడి.. 7 గురు మృతి, 40 మందికి గాయాలు

Tags

Related News

వినాయకుడి దర్శనానికి వెళ్లి వస్తుండగా.. ఇద్దరి ప్రాణాలు గాల్లో

ప్రభుత్వ స్కూల్ పిల్లలకు గుడ్ న్యూస్.. యూనిఫాంలో కొత్త మార్పులు!

కల్వకుంట్ల ఫ్యామిలీ భూములపై రచ్చ.. మధ్యలో రైతుల్ని ఎందుకు లాగుతున్నారు?..ఆది శ్రీనివాస్ ఫైర్

ఢిల్లీ కేంద్రంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాస్టర్ ప్లాన్.. వర్కౌట్ అయ్యేనా..?

తెలంగాణ యువతకు డెల్ సంస్థ బిగ్ ఆఫర్.. అన్నీ ఉచితం!

మూడు రోజుల డెడ్‌లైన్.. జూరాల ప్రాజెక్టు నీటిపై ఎంపీ డీకే అరుణ అల్టిమేటం?

అదనపు కట్నం కోసం కానిస్టేబుల్ వేధింపులు.. ఆత్మహత్య చేసుకున్న యువతి!

సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. 45 రోజుల్లో ఆ దరఖాస్తులకు పరిష్కారం..?

Big Stories

Advertisement
×