E-Paper
Advertisement

Proterial Sri City AP: ఏపీకి బిగ్ ఆఫర్.. శ్రీ సిటీలో మెట్ గ్లాస్ ఇండియా స్టీల్ ప్లాంట్!

Proterial Sri City AP: ఏపీకి బిగ్ ఆఫర్.. శ్రీ సిటీలో మెట్ గ్లాస్ ఇండియా స్టీల్ ప్లాంట్!
Advertisement

Proterial Sri City AP: ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో మరో కీలక అడుగు పడింది. అమెరికా.. జపాన్ దేశాలకు చెందిన ప్రముఖ సంయుక్త సంస్థ ప్రొటీరియల్ రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. చిత్తూరు జిల్లాలోని శ్రీ సిటీ పారిశ్రామిక వాడలో అత్యాధునిక ఎలక్ట్రికల్ స్టీల్ కర్మాగారాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ‘మెట్ గ్లాస్ ఇండియా’ (Metglas India) పేరుతో ఈ నూతన కంపెనీని స్థాపించనున్నారు. ఈ ప్లాంట్ ప్రధానంగా విద్యుత్ రంగంలో కీలకమైన ‘అల్లాయ్ రిబ్బన్’ ఉత్పత్తిపై దృష్టి సారించనుంది. తొలిదశలో సుమారు 77 మిలియన్ డాలర్ల (సుమారు ₹650 కోట్లు) పెట్టుబడి పెట్టేందుకు యాజమాన్యం సిద్ధమైంది.

ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 200 మందికి నేరుగా ఉపాధి లభించనుంది. కంపెనీ ఆపరేషన్స్ 2026 అక్టోబర్ నాటికి ప్రారంభమవుతాయని సంస్థ సీఈఓ శాన్ స్టాక్ వెల్లడించారు. ఈ ప్లాంట్‌లో జపాన్‌కు చెందిన అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించబోతున్నారు. తొలిదశలో ఏడాదికి 30 వేల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఈ ప్లాంట్ పనిచేయనుంది. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా భవిష్యత్తులో ఈ సామర్థ్యాన్ని మరింత పెంచే అవకాశం ఉందని ప్రతినిధులు తెలిపారు.

Advertisement

స్థానిక యువతకు ఈ ప్లాంట్‌లో అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని కంపెనీ స్పష్టం చేయడం విశేషం. ఉద్యోగాలకు ఎంపికైన పలువురు స్థానిక అభ్యర్థులకు అధునాతన సాంకేతికతపై శిక్షణ ఇచ్చేందుకు జపాన్ పంపించనున్నట్లు సంస్థ వెల్లడించింది. దీనివల్ల ఏపీ యువతకు అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలు లభించడమే కాకుండా, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కూడా బలం చేకూరుతుంది. శ్రీ సిటీలోని మౌలిక సదుపాయాలు.. ప్రభుత్వం కల్పిస్తున్న ప్రోత్సాహకాల వల్లే ఇక్కడ ప్లాంట్ ఏర్పాటుకు మొగ్గు చూపినట్లు యాజమాన్యం తెలిపింది. ఈ భారీ పెట్టుబడితో రాష్ట్రం ఎలక్ట్రికల్ స్టీల్ ఉత్పత్తిలో కీలక హబ్‌గా మారే అవకాశం కనిపిస్తోంది.

Read Also: Botsa Health: బొత్స సత్యనారాయణకు అస్వస్థత.. ఎమర్జెన్సీ వార్డులో అత్యవసర చికిత్స

Related News

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

Big Stories

Advertisement
×