E-Paper
Advertisement

Spirit Movie: ‘స్పిరిట్’ ఎగ్జయిటింగ్ అప్డేట్.. మెంటలెక్కించేశాడయ్యో!

Spirit Movie: ‘స్పిరిట్’ ఎగ్జయిటింగ్ అప్డేట్.. మెంటలెక్కించేశాడయ్యో!
Advertisement

Spirit Movie: రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas), హ్యాట్రిక్ బ్లాక్‌బస్టర్‌ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘స్పిరిట్’ (Spirit Movie). ప్రభాస్ ఫస్ట్ టైమ్ తన కెరీర్‌లోనే మోస్ట్ ఇంటెన్స్ క్యారెక్ట‌ర్‌లో కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఇటీవల న్యూ ఇయర్ స్పెషల్‌గా వదిలిన పవర్ ఫుల్ ఫస్ట్ లుక్‌ ఎలా వైరల్ అయిందో తెలియంది కాదు. ప్రభాస్‌ను రా, ఫిల్టర్ చేయని అవతార్‌లో ఈ పోస్టర్‌లో ప్రజెంట్ చేసి, సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతుందో వంగా హింట్ ఇచ్చేశారు. ఇక ఈ సినిమాకు సంబంధించి మరో పవర్ ఫుల్ పోస్టర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ ఎగ్జయిటింగ్ అప్డేట్ చూస్తే.. నిజంగానే మెంటలొచ్చేస్తున్నాయి. వాస్తవానికి ఇంకో 90 మినిట్స్‌లో ఎగ్జయిటింగ్ అప్డేట్ రాబోతుంది అంటూ మేకర్స్ ముందే హింట్ ఇచ్చేశారు. ఈ హింట్‌తో అంతా, ఇప్పటి వరకు జరుగుతున్న ప్రచారం నిజమవుతుందని భావించారు, కానీ, వారి ఊహలకు అందని విధంగా వంగా ట్రీట్ ఉంది.

Also Read- Hero Vijay Divorce: విజయ్‌కు భార్య షాక్.. పెళ్లయిన 26 ఏళ్లకు విడాకులు, ఆ రూమర్లే కారణమా?

వివేక్ – ఐశ్వర్య ట్రీట్ అదిరింది

Advertisement

అసలు జరుగుతున్న ప్రచారం ఏమిటంటే.. ఇందులో కొరియన్ స్టార్ డాన్ లీ (Don Lee) విలన్‌గా నటిస్తున్నాడనేలా ఎప్పటి నుంచో వార్తలు వైరల్ అవుతున్నాయి. మార్చి 1 ఆయన పుట్టినరోజు కావడంతో, అంతా డాన్ లీ కు సంబంధించిన అప్డేటే వస్తుందని ఊహించారు. కానీ, ఊహించని విధంగా బాలీవుడ్ అగ్ర నటుడు వివేక్ ఒబెరాయ్ (Vivek Anand Oberoi) పిక్‌ని మేకర్స్ వదిలారు. వివేక్ ఒబెరాయ్ కత్తి పట్టుకుని స్టైలిష్‌గా నిలబడి ఉండగా, ఆయన ఎదురుగా ఐశ్వర్య దేశాయ్ (Aishwarya Desai) డ్రగ్స్ సేవిస్తూ.. కొంటె చూపుతో నెటిజన్లకు డ్రగ్ ఎక్కిస్తోంది. ఈ పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇంతకు ముందు ప్రభాస్, త్రిప్తి దిమ్రీ జంట లుక్‌ని రివీల్ చేసిన మేకర్స్, ఇప్పుడు వివేక్ ఒబెరాయ్, ఐశ్వర్య దేశాయ్ జంటగా ఉన్న లుక్ వదిలి.. నిజంగానే మెంటలెక్కించేశారు. ఇందులో వివేక్ ఒబెరాయ్ విలన్ అనే క్లారిటీ ఇచ్చేశారు.

Also Read- Son Of Movie Review: సాయి సింహాద్రి ‘కొడుకు’ పాత్రను జస్టిఫై చేశాడా?.. ‘సన్ ఆఫ్’ ఫుల్ రివ్యూ ఎలా ఉందంటే?

విడుదల ఎప్పుడంటే?

Advertisement

సందీప్ వంగా మార్క్ ఇన్‌టెన్స్, యాక్షన్, ఎమోషన్స్, రా పవర్‌తో ఈ యాక్షనర్‌ అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ని అందించబోతోందనే విషయం ఈ పోస్టర్స్‌తోనే తెలిసిపోతోంది. రెబల్ స్టార్ ప్రభాస్ సరసన ఇంటర్నేషనల్ క్రష్ త్రిప్తి దిమ్రీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఓ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడతో పాటు చైనీస్, జపనీస్, కొరియన్.. ఇలా మొత్తంగా 8 భాషల్లో యూనివర్సల్‌గా ఈ సినిమా 5 మార్చి, 2027న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని భద్రకాళి పిక్చర్స్, టి-సిరీస్ ఫిల్మ్స్ సంయుక్తంగా భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి.

Also Read- Toxic: ప్రేక్షకులకు టార్చర్ చూపించబోతున్న ‘టాక్సిక్’ సినిమా.. మరీ అంత ఘోరమా?

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×