BigTV English

Punganur Riots Case: పుంగనూరు అల్లర్ల కేసు.. ఎంపీ మిథున్ రెడ్డికి ఊరట.. తుది తీర్పు తేదీ ప్రకటించిన హైకోర్టు

Punganur Riots Case: పుంగనూరు అల్లర్ల కేసు.. ఎంపీ మిథున్ రెడ్డికి ఊరట.. తుది తీర్పు తేదీ ప్రకటించిన హైకోర్టు

⦿ ఎంపీ మిథున్ రెడ్డికి హైకోర్టులో ఊరట
⦿ ముందస్తు బెయిల్ పై పిటిషన్
⦿ బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు
⦿ మిథున్ రెడ్డితో సహా మరో ఐదుగురికి బెయిల్
⦿ పుంగనూరు అల్లర్లలో మిథున్ రెడ్డిపై కేసు నమోదు
⦿ పలు సెక్షన్ల కింద కేసులు నమోదు
⦿ తదుపరి ఆదేశాలు వచ్చేదాకా
⦿ ఎలాంటి చర్యలూ తీసుకోవద్దన్న హైకోర్టు


అమరావతి, స్వేచ్ఛ: Punganur Riots Case: వైకాపా పార్లమెంట్ సభ్యుడు మిథున్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. పుంగనూరు అల్లర్ల కేసులో నిందితుడుగా జైలు లో ఉన్న మిథున్ రెడ్డి తనకు ముందస్తు బెయిల్ కావాలని పిటిషన్ దాఖలు చేశారు. ఇందుకు సంబంధించి మంగళవారం ఏపీ హైకోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసుకు సంబంధించి మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది రాష్ట్ర హైకోర్టు. అలాగే మిథున్ రెడ్డితో పాలు అరెస్టయిన మరో ఐదుగురుకి సైతం బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఆదేశాలిచ్చింది. తదుపరి కోర్టు ఆదేశాలు ఇచ్చేంతవరకూ వారిపై ఎటువంటి చర్యలూ తీసుకోరాదని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.

జులైలో కేసులు నమోదు
పుంగనూరులో గత జులై నెలలో జరిగిన టీడీపీ, వైసీపీ పరస్పర దాడులలో కేసులు నమోదు చేశారు పోలీసులు. మాజీ ఎంపీ రెడ్డప్ప ఫిర్యాదు చేసిన నేపథ్యంలో 9 మందిపై కేసు నమోదు చేశారు. ఇంకా మరికొందరు టీడీపీ నాయకులపై , ఎస్టీ, ఎస్సీ తో సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేనిన విషయం విదితమే. తెలుగుదేశం నాయకుడు సుహేల్ భాష ఫిర్యాదు చేసిన నేపథ్యంలో హత్యాయత్నంతో సహా పలు సెక్షన్ల కింద ఏ1 గా ఎంపీ మిథున్ రెడ్డి, ఏ2 నిందితుడిగా మాజీ ఎంపి రెడ్డప్పతో సహా మరో 34 మందిపై కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. తెలుగుదేశం నాయకుడు ఆర్కే ప్రసాద్ ఫిర్యాదు మేరకు వైసీపీ నాయకులు మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డప్పతో సహా మరో 33 మందిపై సెక్షన్ 307 తో సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.


ముందస్తు బెయిల్
కాగా పుంగనూరు అల్లర్ల కేస్ లో ముందస్తు బెయిల్ కోరుతూ హై కోర్టును ఆశ్రయించిన వైసీపీ నేత మిథున్ రెడ్డి తో పాటు మరో నలుగురికి సంబంధించిన కేసులో గత మంగళవారం ఇరు పక్షాల తరపున లాయర్ల వాదనలు విన్న జడ్జి ఈ నెల 29న తుది తీర్పు ఇవ్వనున్నట్లు హైకోర్టు జడ్జి తెలిపారు. అప్పటిదాకా మిథున్ రెడ్డి తో సహా మరో నలుగురికి ఇంటీరియం ఆర్డర్స్ పొడిగింపు ఉంటుందని స్పష్టం చేశారు. దీనితో వారందరికీ బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు మంగళవారం కీలక ఆదేశాలు జారిచేసింది.

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×