Suriya: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి తెలుగు ప్రేక్షకులకు చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల విషయం పక్కన పెడితే ఆయన వ్యక్తిత్వానికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు. అభిమానులను అన్నదమ్ముల్లా చూడడం.. వారికోసం తాను ఎంత పెద్ద హీరో అన్న విషయం మరిచి హత్తుకోవడం.. కాళ్లకు నమస్కరిస్తే తిరిగి ఆయన కూడా నమస్కారం పెట్టడం.. పిల్లలకు సినిమాలు, కలక్షన్స్ గురించి కాకుండా కళల గురించి ఎక్కువ తెలుసుకోవాలని గుర్తుచేయడం, ముఖ్యంగా కుటుంబంతో సూర్య ఉండే విధానం.. ప్రేక్షకులు ఆయనకు అభిమానులుగా మారే విధంగా చేశాయి.
ఇక సూర్య భార్య జ్యోతిక గురించి కూడా తెలుగువారికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కోలీవుడ్ లోనే కాదు చిత్ర పరిశ్రమ మొత్తంలో మోస్ట్ అడొరబుల్ కపుల్ లిస్ట్ తీస్తే టాప్ 5 లో ఈ జంట ఉంటారు అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంటకు ఇద్దరు పిల్లలు. ఇక పెళ్లి తరువాత జ్యోతిక సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ఇల్లు, పిల్లలను చూసుకుంటూ ఉండిపోయింది.
Nani New Movie : స్టార్ హీరో సినిమాలో వేలు పెట్టిన మేనేజర్… పారితోషికం కోసం ప్రొడ్యూసర్ ను మార్చారా?
తాము ఇప్పటివరకు ఉమ్మడి కుటుంబంగా ఉండడానికి కారణం తన వదిన జ్యోతికనే అని, తల్లి తరువాత తానే తల్లిగా మారి తమ కుటుంబాన్ని చూసుకుందని కార్తీ ఎన్నోసార్లు మీడియా ముందు చెప్పుకొచ్చాడు. అంతలా కలిసిపోయిన ఈ కుటుంబం ఇప్పుడు ముక్కలయ్యింది. గత రెండేళ్లుగా సూర్య.. తన కుటుంబంతో కలిసి ముంబైలో ఉంటున్నాడు. తల్లిదండ్రులతో విబేధాల కారణంగానే సూర్య – జ్యోతిక ముంబైకు మకాం మార్చారని, జ్యోతికకు అసలు చెన్నై తిరిగి వచ్చే ఉద్దేశ్యమే లేదని వార్తలు వచ్చాయి.
పిల్లల చదువుల కోసం తాము ముంబైకి షిఫ్ట్ అయ్యామని సూర్య చాలాసార్లు చెప్పుకొచ్చాడు. కానీ, అందులో నిజం లేదని కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. దానికి కారణం.. ముంబైలో అడుగుపెట్టిన దగ్గరనుంచి సూర్య.. షూటింగ్స్ కోసం చెన్నై వచ్చి వెళ్తున్నాడే కానీ, ఒక్కసారి కూడా జ్యోతిక అత్తమామ ఇంట్లో అడుగుపెటింది లేదు. వారి ఫ్యామిలీ ఫంక్షన్స్ కూడా అటెండ్ అవ్వలేదని సమాచారం. దీంతో ఫ్యామిలీ విభేదాలు నిజమే అని పుకార్లు షికార్లు చేశాయి.
Naga Chaitanya : శోభిత కోసం సామ్ తో ఉన్న ఆ ఒక్క మెమొరీని చెరిపేసిన చై
తాజాగా కంగువ ప్రమోషన్స్ లో సూర్య.. తాను ఎందుకు ముంబైకు మకాం మార్చాడో చెప్పుకొచ్చాడు. కేవలం తన భార్య జ్యోతిక కోసమే తాము ముంబైకు షిఫ్ట్ అయ్యినట్లు క్లారిటీ ఇచ్చాడు. ” జ్యోతికకు 18 ఏళ్ళ వయస్సులోనే చెన్నై వచ్చేసింది. మా పెళ్లి తరువాత చెన్నైలోనే ఆమె మా కుటుంబంతో కలిసి ఉంది. మా ఫ్యామిలీ కోసం జ్యోతిక ఎన్నో త్యాగాలు చేసింది. ముంబై నుంచి వచ్చినా ఇక్కడ జీవించడానికి అలవాటు పడింది. పిల్లలను ఎంతో బాగా పెంచింది. తనకు ఎన్నో మంచి అవకాశాలు వచ్చినా వదులుకుంది. ముంబైలో ఉన్న తన ఫ్రెండ్స్ కు దూరమైంది.
కరోనా తరువాత మా జీవితాల్లో చాలా మార్పులు వచ్చాయి. అప్పుడే మేము ముంబై షిఫ్ట్ అవ్వాలని నిర్ణయించుకున్నాం. జ్యోతిక ఇప్పుడు తన కెరీర్ ను తాను బిల్డ్ చేసుకుంటుంది. ఫ్యామిలీ విభేదాలు అంటూ వస్తున్న వార్తలో నిజం లేదు” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి జ్యోతిక తెలుగులో రీఎంట్రీ ఎప్పుడు ఇస్తుందో చూడాలి.