Naga Chaitanya – Samantha : టాలీవుడ్ బ్యూటీఫుల్ ఫెయిర్ సమంత (Samantha ), నాగ చైతన్య(Naga Chaitanya) జంట గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఏం మాయ చేసావే సినిమాతో పరిచయం అయిన వీరిద్దరూ కొన్నేళ్లు ప్రేమలో మునిగి తేలారు. ఆ తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత కొత్త ఇల్లు కొని.. కొన్నేళ్లు కాపురం చేశారు. ఆ తర్వాత మనస్పర్థలు రావడంతో విడిపోయారు.
వీరిద్దరూ పెళ్లి చేసుకున్నప్పుడు కంటే విడిపోయిన తర్వాతే ఎక్కువ పాపులారిటీని దక్కించుకుంటున్నారు. ఆగస్టు ఎనిమిదో తేదీన శోభిత ధూళిపాళ (Sobhitha Dulipala)తో నాగచైతన్య నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి పనులు కూడా ప్రారంభమైనట్లు శోభిత ఇటీవల ఫొటోలను షేర్ చేసింది. ఇదే సమయంలో నాగ చైతన్యకు సమంత షాక్ ఇచ్చినట్లు సమాచారం. నాగ చైతన్యకు లీగల్ నోటీసులు పంపించబోతున్నట్లు ఓ వార్త షికారు చేస్తోంది.
నాగ చైతన్య, సమంత పెళ్ళికి ముందే ఓ ఫ్లాట్‌ను కొనుగోలు చేశారు. వారికి నచ్చినట్లు డిజైన్ చేయించుకున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే వీరిద్దరి డ్రీమ్ హౌస్ అది. పెళ్లి తర్వాత వారిద్దరు అందులోనే కాపురం చేశారు. అయితే ఈ ఫ్లాట్ ను కొనుగోలు చేసే సమయంలో నాగచైతన్య కన్నా తానే ఎక్కువ ఖర్చుపెట్టానని సమంత చెబుతోందని తెలిసింది. దీనికి సంబంధించిన అన్ని ఆధారాలను కోర్టుకు సమర్పించి, ఆ తర్వాత చైతూకు లీగల్ నోటీసులు పంపించబోతోందని ఇండస్ట్రీలో టాక్.
శోభితతో పెళ్ళైన తర్వాత ఆ ఫ్లాట్ లోనే కాపురం ఉందామని నాగచైతన్య చెప్పాడట . అయితే శోభిత అందుకు ఒప్పుకోలేదట . అందులో ఉండటంవల్ల పదే పదే పాత భార్య జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయని, వేరే ఫ్లాట్ లో ఉందామని చెప్పిందని సమాచారం. దానికి నాగచైతన్య మాత్రం ససేమీరా అనడంతో శోభిత మాట్లాడటం మానేసిందట. అందులోనే ఉందామని, ఎంతో ఇష్టపడి ఇంటీరియర్ చేయించానని చైతూ చెప్పడట. దాని వల్ల నాగచైతన్య, శోభిత మధ్య స్పర్థలు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. కానీ ఇప్పుడు అంతా సర్దుకుందని తెలుస్తోంది.
నాగచైతన్యతో సమంత విడాకులు తీసుకున్న తర్వాత ఆ ఫ్లాట్ ఖాళీగా ఉంది. ఎవరింటికి వారు వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆ ఫ్లాట్ ను శోభిత ధూళిపాలకు గిఫ్ట్ గా రాయాలని నాగచైతన్య భావిస్తున్నట్లు సమాచారం. తాను అధికంగా ఖర్చుపెట్టిన ఫ్లాట్ ను వేరేవారికి బహుమతిగా రాసిస్తానంటే ఎలా ఒప్పుకుంటానని సమంత తన సన్నిహితులతో అన్నట్లు సమాచారం. ఈ విషయంపై స్పందించిన నెటిజన్లు కూడా ఇద్దరూ కలిసి కొనుగోలు చేసిన ఫ్లాట్ ను శోభితకు ఎలా రాస్తావంటూ చైతూపై మండిపడుతున్నారు. ఈ వార్తల్లో నిజమేంత ఉందో తెలియాల్సి ఉంది. ప్రస్తుతం దీని పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. నాగ చైతన్య, లేదా సమంత దీనిపై క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఏది ఏమైనా పెళ్లి జరుగుతున్న సమయంలో ఇలాంటివి జరగడం బాగోదని, ముందే తేల్చుకోమని సన్నిహితులు నాగచైతన్యకు సలహాలు ఇస్తున్నారని టాక్.