BigTV English

Operation Chirutha @ Shamshabad: 5 బోన్లు, 25 ట్రాప్ కెమెరాలు.. ఆపరేషన్ చిరుత సక్సెస్!

Operation Chirutha @ Shamshabad: 5 బోన్లు, 25 ట్రాప్ కెమెరాలు.. ఆపరేషన్ చిరుత సక్సెస్!

Operation Chirutha at Shamshabad Success: శంషాబాద్ లో ఆపరేషన్ చిరుత ఎట్టకేలకు సక్సెస్ అయింది. 5 రోజుల క్రితం శంషాబాద్ విమానాశ్రయంలోకి వచ్చిన చిరుత.. ఎట్టకేలకు బోనులో చిక్కినట్లు అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్ఎం డోబ్రియల్ తెలిపారు. ఎయిర్ పోర్టు లోపలికి వచ్చిన చిరుత.. ఫెన్సింగ్ దూకినట్లు సిబ్బంది సీసీ కెమెరాల్లో చూసి గుర్తించారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా.. చిరుతను బంధించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ప్రత్యేకంగా 5 బోన్ లు 25ట్రాప్ కెమెరాలు పెట్టీ ఎప్పటికప్పుడు అధికారులతో మానిటరింగ్ చేశామన్నారు.


తాజాగా చిరుత బోనులో చిక్కగా.. దానిని నెహ్రూ జూ పార్క్ కు తరలించి అక్కడ వైద్య పరీక్షలు నిర్వహిస్తామని, ఒకరోజు పర్యవేక్షణ ఉంచి.. అడవిలో వదిలిపెడతామని తెలిపారు. చిరుతను పట్టుకునేందుకు శ్రమించిన రంగారెడ్డి జిల్లా DFO సుధాకర్ రెడ్డి, FDO విజయనంద్ లను ప్రత్యేకంగా డోబ్రియల్ అభినందించారు. చిరుతపులి చిక్కడంతో ఐదు రోజులుగా బిక్కుబిక్కుమంటూ ఉన్న రైతులకు ఊరట లభించింది.


Tags

Related News

Hyderabad Rains Today: కుమ్మేస్తున్న వరుణుడు.. ఇళ్లల్లో ఉండటమే బెటర్, ఈ ఏరియాలు జలమయం

Telangana politics: కారులో భారీ కుదుపు.. కమలం గూటికి మాజీలు, బీఆర్ఎస్ తర్వాత ప్లానేంటి?

Shamshabad Airport: శంషాబాద్ విమానాశ్రయంలో హైఅలర్ట్! బాంబ్ స్క్వాడ్ ప్రత్యేక తనిఖీలు.. ఎందుకంటే..

Telangana Rains: వర్షాల ఎఫెక్ట్.. ఈ ఐదు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు

Telangana Government: రాష్ట్ర అభివృద్ధిపై సీఎం రేవంత్ ఫోకస్.. నలుగురు మంత్రులతో కమిటీ

Heavy rains: కుండపోత వర్షం.. వారికి వర్క్ ఫ్రం హోం ఇవ్వండి.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..

Big Stories

×