BigTV English

Tirupati To Shirdi: తిరుపతి నుంచి షిర్డీకి ప్రతీ రోజూ ట్రైన్.. సీఎం చంద్రబాబు సూచన, రైల్వేశాఖ ఆమోదం

Tirupati To Shirdi: తిరుపతి నుంచి షిర్డీకి ప్రతీ రోజూ ట్రైన్.. సీఎం చంద్రబాబు సూచన, రైల్వేశాఖ ఆమోదం

Tirupati To Shirdi: ఏపీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ఫోకస్ చేశారు. ఏపీ నుంచి వివిధ రాష్ట్రాలకు రైళ్లు, విమానాలు కనెక్ట్‌విటీ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతి -షిర్డీకి ట్రైన్ విషయంలో క్లారిటీ వచ్చేసింది. ఒకప్పుడు వారంలో ఒకటి లేదా రెండు రోజులు మాత్రమే ఉండేది. సీఎం చంద్రబాబు రైల్వేమంత్రికి లేఖ రాశారు. దీంతో ఆయన నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఇకపై ఈ రెండు టెంపుల్ సిటీల మధ్య ప్రతీరోజూ రైలు భక్తులకు అందుబాటులోకి రానుంది.


ఏపీ ప్రజలకు కేంద్రప్రభుత్వం ఓ శుభవార్త చెప్పేసింది. ఇకపై ప్రతిరోజూ తిరుపతి-షిర్డీ మధ్య ట్రైన్ అందుబాటులోకి వచ్చింది. ఒకప్పుడు ఈ రెండు టెంపుల్ సిటీల మధ్య వారానికి ఒకటి లేదా రెండు రోజులు మాత్రమే ఉండేది. ఇకపై రెగ్యులర్ సర్వీసు కానుంది. ఈ మేరకు రైల్వేశాఖ ప్రకటన చేసింది.

రానున్న పండుగల నేపథ్యంలో రద్దీని దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. తిరుపతి నుంచి షిర్డీ మధ్య 07637/07638 నెంబర్‌తో రోజూ ట్రైన్ నడపనున్నట్లు పేర్కొంది. కొద్దిరోజుల కిందట సీఎం చంద్రబాబు రైల్వేమంత్రికి ఓ లేఖ రాశారు. ఆయన ప్రతిపాదనను కేంద్రం ఆమోదం తెలిపింది.


విచిత్రం ఏంటంటే ఈ రైలు ఏపీ-తెలంగాణ ప్రాంతాల మీదుగా నడిపితే ఆ రైలు నిత్యం బిజీగా ఉండేదని అంటున్నారు భక్తులు. రేణిగుంట, ధర్మవరం, రాయచూర్, షోలాపూర్, దౌండ్ స్టేషన్ల మీదుగా షిర్డీకి చేరుకోనుంది. తిరుమల బ్రహ్మోత్సవాలు, దసరా, దీపావళి పండుగలు రాబోతున్నాయి. రద్దీని దృష్టిలో పెట్టుకున్న కేంద్రం, ఈ నిర్ణయం తీసుకుంది.

ALSO READ: టీటీడీ ఈవోగా అనిల్‌కుమార్, వైసీపీకి చెమటలు

తిరుమలకు వెళ్లేవారికి రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఇటీవల కొన్ని రైళ్లను నవంబర్ వరకు పొడిగించిన విషయం తెల్సిందే. తిరుపతి-షిర్డీ, నరసాపురం-అరుణాచలం మధ్య నడిచే రైళ్లతోపాటు హైదరాబాద్-కొల్లాం, కాచిగూడ-మధురై మార్గాల్లో ప్రత్యేక రైళ్లు తిరుపతి మీదుగా రాకపోకలు సాగిస్తాయి. ఈ సదుపాయాన్ని భక్తులు సద్వినియోగం చేసుకుంటారని అధికారులు భావిస్తున్నారు.

Related News

Turakapalem: తురకపాలెంలో ICAR బృందం పర్యటన..

AP Politics: పార్టీ పదవుల కోసం.. టీడీపీలో డిమాండ్

Ayyanna Patrudu: స్పీకర్ సంచలన వ్యాఖ్యలు.. వరాలిచ్చే అధికారం తనకు లేదు, జగన్‌ నిర్ణమేంటి?

TTD EO: టీటీడీ ఈవోగా అనిల్‌కుమార్ సింఘాల్.. వైసీపీకి చెమటలు, ఈసారైనా ప్రక్షాళన జరిగేనా?

YS Raja Reddy: రాజారెడ్డికి అమ్మమ్మ ఆశీర్వాదం.. తల్లితోపాటు అక్కడికి, జగన్ టీమ్‌లో కలకలం

×