BigTV English

Illu Illalu Pillalu Today Episode: శ్రీవల్లికి దొరికిపోయిన నర్మద, సాగర్.. కళ్యాణ్ దెబ్బకి షాక్.. ధీరజ్ కు ప్రేమ నిజం చెప్తుందా..?

Illu Illalu Pillalu Today Episode: శ్రీవల్లికి దొరికిపోయిన నర్మద, సాగర్.. కళ్యాణ్ దెబ్బకి షాక్.. ధీరజ్ కు ప్రేమ నిజం చెప్తుందా..?

Illu Illalu Pillalu Today Episode September 9th: నిన్నటి ఎపిసోడ్ లో.. సాగర్ ని మంచిగా రెడీ చేసి దేవుడి దగ్గరికి తీసుకొస్తుంది నర్మదా. ఎప్పుడు లేంది వీళ్లు పూజ చెయ్యడానికి పూజ గదిలోకి వెళ్లి పూజ చేసి మరి సాగర్ ని ఎక్కడ తీసుకెళ్తుంది అబ్బా అని శ్రీవల్లి ఆలోచిస్తుంది. అంతే కాదు అనుమానం కూడా మొదలవుతుంది.. అయితే మొత్తానికి శ్రీవల్లి నర్మదా సాగర్ లో గుట్టు రట్టు చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంది. సాగర్ ఆశీర్వాదం ఉండాలి అని అంటాడు..


ఇప్పుడు ఎవరికీ తెలియకుండా ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నావు.. ఈ విషయం తెలిస్తే ఇంట్లో నేను ఎగ్జామ్ రాయడానికి వెళ్ళనిస్తారా అని అడుగుతుంది. సాగర్ నర్మదని తీసుకొని వాళ్ల నాన్న ఆశీర్వాదం కావాలని అక్కడికి వస్తాడు. నాన్న నాకు మీ ఆశీర్వాదం కావాలి అని అడుగుతాడు. ఇంత సడన్గా ఆశీర్వాదం ఏంట్రా అని రామరాజు అడుగుతాడు. కానీ తిరుపతి మాత్రం ఆశీర్వాదమని గతంలో వెళ్లి పెళ్లి చేసుకుని వచ్చావు.. ఈసారి ఏం వెలగబెడతామని అనుకుంటున్నావు అని అడుగుతాడు. తింగరోడైన వీడు చెప్పింది కరెక్టే కదరా పోయినసారి అలా జరిగింది వీడు చెప్తుంటే నాకు కూడా అనుమానం వస్తుంది అని రామరాజు అంటాడు. అయితే అదేం లేదు నాన్న అని ఎగ్జామ్ అనే మాట సాగర్ నోటి నుంచి వస్తుంది.. నర్మద ఏదోకటి చెప్పి కవర్ చేస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. సాగర్ నర్మదా వెళ్ళిపోతారు. ప్రేమ కళ్యాణ్ కోసం అంతా వెతుకుతూ ఉంటుంది. ఏంటి నువ్వు ఇప్పుడు కళ్యాణ్ కోసం వెతుకుతున్నావు ఏంటి అని ప్రేమ ఫ్రెండ్స్ అడుగుతారు. ఏం లేదే ఊరికే అడుగుదామని అని ప్రేమ ఏదో ఒకటి కవర్ చేస్తుంది. మొత్తానికి కళ్యాణ్ను పట్టుకుంటుంది ప్రేమ. ఆ కళ్యాణ్ ను రోడ్డు పై పరిగెత్తించి మరీ కొడుతుంది. వీధులన్నీ తిప్పి మరి చితగ్గొట్టేస్తుంది. నర్మదా సాగర్ కి ఆల్ ది బెస్ట్ ఎగ్జామ్ కి లోపలికి పంపిస్తుంది. భద్రావతి ఇంట్లో సేన కొడుకుకి పెళ్లి సంబంధం కోసం మనుషులు వస్తారు. మాకు బాగా నచ్చింది కట్నకానుకలు ఏమాత్రం ఇస్తారు అని అడుగుతారు.. కొంచమైనా సిగ్గుండాలి మీ అమ్మాయి లేచిపోయింది. సేన కుటుంబానికి ఘోర అవమానం జరుగుతుంది.


ఇక శ్రీవల్లి సాగర్ నర్మదా ఏదో ఎగ్జామ్ కోసం వెళ్ళినట్లు ఉన్నారు అని వాళ్ళని వెతుక్కుంటూ వెళ్తుంది. సాగరు ఎగ్జామ్ ని అతి కష్టం మీద రాసి బయటకు వస్తాడు. ఎగ్జామ్ ఎలా రాశావు సాగర్ అని నర్మదా అడుగుతుంది. కానీ దానికి సాగర్ మౌనంగా ఉంటాడు. సాగర్ కాలేజ్ నుంచి బయటికి రావడం చూసిన శ్రీవల్లి షాక్ అవుతుంది.. పెళ్లి అని చెప్పేసి ఇక్కడ వీళ్లు ఎగ్జామ్ రాయడానికి వస్తున్నారా అని షాక్ అవుతుంది. కచ్చితంగా ఇంట్లో చెప్పి రచ్చ చేయాలి అప్పుడే నా కడుపు మంట చల్లారిపోతుంది అని శ్రీవల్లి అనుకుంటుంది.

ఆ తర్వాత సాగర్ వాళ్ళని చూస్తూ శ్రీవల్లి తనలో తానే మాట్లాడుకోవడం చేస్తుంది.. అప్పుడే కళ్యాణ్ శ్రీవల్లికి డాన్స్ ఇచ్చి కింద పడేలా చేస్తాడు. మనిషిని ఇక్కడ కనిపించట్లేదు రా దొంగ సచ్చినోడా అని తిట్టుకుంటూ ఉంటుంది. అతను హాడావిడిగా పరిగెత్తుతూ ఉంటే వెనకాల ప్రేమ రావడం చూసి షాక్ అవుతుంది.. ప్రేమ ఎవడిని తరుముతుంది. ప్రేమకు వాడికి అసలు సంబంధం ఏంటి అని ప్రశ్న మీద ప్రశ్నలు వేసుకుంటుంది. ప్రేమ వాణ్ణి పరిగెత్తించి కొడుతూ వెళ్ళిపోతుంది. అసలు ఈ ట్విస్ట్ ఏంటి అటు సాగర్ నర్మదా.. ఇటు ప్రేమ ఇలాంటి ట్విస్ట్ లు ఇచ్చారేంటి అని అనుకుంటుంది.

Also Read : బాలుకు అవమానం.. శివతో మళ్లీ గొడవ.. ఇంట్లో రచ్చ చేసిన సంజయ్..

రేపటి ఎపిసోడ్ లో భద్ర ప్రేమ రోడ్డుపై పరిగెత్తడం చూసిన ధీరజ్ ఫ్రెండ్ ధీరజ్ కి ఈ విషయాన్ని చెప్తాడు. ఎక్కడ అని అడిగి ప్రేమను వెతుక్కుంటూ వస్తాడు. ప్రేమ కింద పడిపోవడం చూసిన ధీరజ్ ప్రేమను హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు. నర్మదా ఎంతగా మాట్లాడుతున్నా సాగర్ మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు. ఆ తర్వాత ఏమైంది అని నర్మదా అడుగుతుంది. దానికి సాగర్ నేను ఎగ్జామ్ సరిగ్గా రాయలేదు అని అంటాడు. మరేం పర్లేదు ఇంకొకసారి నువ్వు బాగా రాయచ్చు అని అంటుంది. ఇక ధీరజ్ ప్రేమను ఎంతగా బ్రతిమలాడి అడిగినా సరే నిజమే బయట పెట్టదు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ భద్ర అమూల్య ప్రేమించమని విశ్వంతో చెప్తుంది. తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Nindu Noorella Saavasam Serial Today September 9th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అంజు గుండెల్లో దిగిన తీవ్రవాదుల బుల్లెట్స్‌

Intinti Ramayanam Today Episode: శ్రీయాకు దిమ్మతిరిగే షాక్.. చెంప దెబ్బలు.. పల్లవికి స్ట్రాంగ్ కౌంటర్..

Brahmamudi Serial Today September 9th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: తీర్థంలో పౌడర్‌ కలిపిన రుద్రాణి – వెనక నుంచి చూసిన కనకం, స్వరాజ్‌

GudiGantalu Today episode: బాలుకు అవమానం.. శివతో మళ్లీ గొడవ.. ఇంట్లో రచ్చ చేసిన సంజయ్..

Today Movies in TV : మంగళవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. ఆ రెండు మిస్ చెయ్యకండి..

×