E-Paper
Advertisement

Rajahmundry Adulterated Milk Case: రాజమండ్రి కల్తీ పాల కేసు.. డేంజర్ కెమికల్స్ వినియోగం

Rajahmundry Adulterated Milk Case: రాజమండ్రి కల్తీ పాల కేసు.. డేంజర్ కెమికల్స్ వినియోగం
Advertisement

Rajahmundry Adulterated Milk Case:  రాజమండ్రిలో కల్తీ పాల వ్యవహారం కొత్త మలుపు తిరిగిందా? మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోందా? ఇప్పటివరకు ఐదుగురు మృత్యువాత పడ్డారా? పాలలో ఇథనాల్ గైకోల్ గ్యాస్ కలవడమే అసలు కారణమా? పాలు తీసుకున్న కొందరు పరిస్థితి విషమంగా ఉందా? పాలు పోసే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారా? అవుననే అంటున్నారు అధికారులు.

రాజమండ్రి కల్తీ పాల కేసు.. వెలుగులోకి కొత్త విషయాలు 

Advertisement

ఏపీ వ్యాప్తంగా కలకలం రేపుతోంది రాజమండ్రిలో కల్తీ పాల వ్యవహారం. ఈ ఘటనలో ఇప్పటివరకు ఐదుగురు మృత్యువాత పడ్డారు. ఈ ఘటనను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. దర్యాప్తు వేగంగా చేయాలని ఆదేశించడంతో అధికారులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. తాజాగా ఈ ఘటనలో బాధితుల కుటుంబాలకు పాలు పోసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాడు.

కోరుకొండ మండలం నరసాపురానికి చెందిన పాల వ్యాపారి గణేష్‌ని విచారణ చేస్తున్నారు అధికారులు.  వరలక్ష్మి డెయిరీ పేరిట అనధికారికంగా రెండు కూలింగ్ ఛాంబర్లు నిర్వహిస్తున్నాడు. ఈ రెండింటిలో పాలు నిల్వ చేస్తున్నాడు పాల వ్యాపారి గణేష్. పదేళ్లకు పైగా పాల వ్యాపారం చేస్తున్న గణేష్, 125 మంది ఆయనకు ఖాతాదారులున్నారు.  సోమవారం సాయంత్రానికి 64 కుటుంబాల నుంచి రక్త నమూనాలు సేకరించి వివిధ పరీక్షలకు వాటిని పంపించారు. చికిత్స పొందుతున్నవారి రక్త నమూనాలను సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌తోపాటు విశాఖపట్నం,హైదరాబాద్‌ ల్యాబ్‌లకు పంపించారు.

Advertisement

మిల్క్ ట్రేడర్ అరెస్ట్.. డేంజర్ కెమికల్స్ వినియోగం

సేకరించిన పాలకు సంబంధిత కేంద్రంలో ఇథలీన్‌ గ్లైకాల్‌ అనే కూలెంట్‌ రసాయనం కలవడం వల్ల ఈ దారుణం జరిగినట్లు ఓ అంచనాకు వచ్చారు అధికారులు.  ఓ డెయిరీలో దీన్ని కలిపినట్టు సమాచారం. ఇథలీన్‌ గ్లైకాల్‌ రసాయనం కేవలం కార్లు, సిస్టం తయారీ పరిశ్రమల్లో మాత్రమే ఉపయోగిస్తారట. ఇథనాల్ గైకల్ అత్యంత ప్రమాదకరమైన రసాయనం. 100 నుంచి 200 మిల్లీగ్రామ్ మనిషి శరీరంలోకి వెళ్తే ప్రమాదమని చెబుతున్నారు.

రాజమండ్రి హాస్పిటల్లో ఉన్నవారు ఇథనాల్ గైకల్ పాలలో కలవడం వల్లే చనిపోయినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. దశాబ్దమున్నరపాటు పాల వ్యాపారం చేస్తున్నాడు గణేష్. రాజమండ్రిలోని పాలు, పెరుగు వర్తక సంఘాల్లో సభ్యత్వం తీసుకున్నాడు. రాజమండ్రి పరిసరాల్లో పాలు అమ్మకాలు చేసే వర్తకులు కచ్చితంగా తమ సంఘంలో రిజిస్టర్ చేసుకుంటారని తెలిపింది పాలు వర్తకుల సంఘం.

ALSO READ: అమాయకుడిపై ఖాకీ ప్రతాపం.. కట్ చేస్తే సీన్ రివర్స్!

అధిక లాభాలు గడించాలన్న అత్యాశతో బయట ఊళ్ళ నుంచి వచ్చినవాళ్లు సంఘంలో చేరకుండా వ్యాపారాలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అంటున్నారు రాజమండ్రి పాలు-పెరుగు వర్తకుల సంఘం. దీనివల్ల పాల వ్యాపారంపై జీవించేవారిపై ప్రభావం చూపుతుందని అంటున్నారు రాజమండ్రి పాల వర్తక సంఘం.

 

Related News

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

Big Stories

Advertisement
×