Big Stories

Rajahmundry : రాజమండ్రి ఎంపీ సీటు.. మాకొద్దు మహాప్రభో అంటున్న నేతలు..

Rajahmundry political news

Rajahmundry political news(AP news today telugu):

ఎన్నికలంటే ప్రధాన పార్టీల టికెట్ల కోసం ఆశావహులు క్యూ కడుతుంటారు.. అదే ప్రధాన నగరాలంటే పోటీ ఏ రేంజ్లో ఉంటుందో వేరే చెప్పనవసరం లేదు .. అయితే రాజమండ్రిలో మాత్రం సీన్ రివర్స్‌లో కనిపిస్తోంది. ఒకప్పుడు రాజమండ్రి ఎంపీ టికెట్ కోసం అన్ని పార్టీల్లో విపరీతమైన పోటీ కనిపించేది ..అయితే ఇప్పుడు అభ్యర్ధి కావలెను అంటూ.. ప్రధాన పార్టీలు వెతుక్కోవాల్సి వస్తోంది. బలమైన అభ్యర్ధులను గుర్తించి.. వారిని బతిమలాడుకునే పనిలో పడ్డాయి అన్ని పార్టీలు.. అసలక్కడ అలాంటి పరిస్థితి ఎందుకొచ్చింది. రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గంలో ఏం జరుగుతోంది?

- Advertisement -

ప్రస్తుతం రాజమండ్రి ఎంపీగా పోటీ చేయడానికి సమర్ధుడైన అభ్యర్థి లేక అన్ని పార్టీలు సతమతమవుతున్నాయి. గత ఎన్నికల్లో ఇక్కడ ఎంపీగా గెలిచిన మార్గాని భరత్‌రామ్ ప్రస్తుతం రాజమండ్రి సిటీ సెగ్మెంట్ ఇన్‌చార్జ్‌గా షిఫ్ట్ అయ్యారు. దాంతో అక్కడ వైసీపీ అభ్యర్థి కోసం వెతుక్కోవాల్సి వస్తోంది. అలాగే గతఎన్నికలలో టీడీపీ తరఫున పోటీ చేసిన మాజీ ఎంపీ మురళీమోహన్ కోడలు మాగంటి రూప ఎన్నికల తర్వాత పత్తా లేకుండా పోయారు .. మరోవైపు 2014లో టీడీపీ, బీజేపీ పొత్తులో భాగంగా అప్పట్లో రాజమండ్రి సిటీ నుంచి బీజేపీగాఎమ్మెల్యేగా ఉన్న ఆకుల సత్యనారాయణ ప్రస్తుతం రాజకీయాలకు దూరమవ్వడంతో.. బీజేపీ సరైన నాయకుడే లేకుండా పోయారు.

- Advertisement -

2019 ఎన్నికల్లో ఇక్కడ వైసీసీ అభ్యర్థి మార్గాని భరత్ ఎంపీగా గెలిచి పార్లమెంటుకు వెళ్లారు. ఆయనకు ముందు నటుడు మురళీమోహన్ టీడీపీ నుంచి ఎంపీగా గెలిచారు. అయితే ప్రస్తుతం మురళీమోహన్ రాజమండ్రికి దూరమయ్యారు. వారిద్దరి కంటే ముందు కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నాయకుడు ఉండవల్లి అరుణ్ కుమార్ రాజమండ్రి ఎంపీగా రెండుసార్లు పనిచేశారు.

ప్రస్తుతానికి వస్తే ఏ పార్టీ కూడా పలానా వ్యక్తి ఎంపీ అభ్యర్థి అని.. చెప్పకోలేని స్థితిలో ఉన్నాయి. వైసీపీ టికెట్ రేసులో ఇద్దరు ముగ్గురున్నారని పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నప్పటికీ .. సదరు అభ్యర్థులు మాత్రం పోటీకి సుముఖంగా లేరని తెలుస్తోంది. ఆ ముగ్గురిలో డాక్టర్ గూడూరి శ్రీనివాసరావు, డాక్టర్ అనుసూరి పద్మలత పేర్లు ప్రధానంగా ఫోకస్ అవుతున్నాయి. వీరితో పాటు కాకినాడకు చెందిన గుబ్బల తులసికుమార్ పేరు కూడా వినిపిస్తోంది. అయితే వీరిలో ఎవరూ ఇప్పటిదాకా బయటపడటం లేదు. ఎంపీ కేండెట్ తన పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల ఖర్చులు కూడా భరించాలన్ని కండీషన్ వారిని కట్టి పడేస్తోందంట. తమకు తాము పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ.. ఎమ్మెల్యే అభ్యర్థుల ఖర్చులు భరించలేమంటూ వారు చేతులెత్తేస్తున్నారంట.

గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన మాగంటి రూప, జనసేన, బిజెపి పొత్తులో భాగంగా పోటీ చేసిన ఆకుల సత్యనారాయణ ప్రస్తుతానికి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు టీడీపీ, జనసేనల మధ్య పొత్తు కుదిరినా రాజమండ్రి ఎంపీ కేండెట్‌పై మాత్రం క్లారిటీ రావడం లేదు. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎంపీగా నిలబడతారనే ప్రచారం జరిగినా.. ఆయన మాత్రం తాను ఈసారి రాజమండ్రి రూరల్ నుంచి మాత్రమే పోటీ చేస్తామని కరాకండిగా చెప్తున్నారు.

ఇక జనసేన విషయానికి వస్తే .. టీ టైం వ్యవస్థాపకుడు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ ఇక్కడి నుంచి ఎంపీగా పోటీ చేస్తారని జనసేన శ్రేణులు అంటున్నాయి. అయితే ఆయన చూపంతా కాకినాడ సిటీ, పిఠాపురం అసెంబ్లీ సెగ్మెంట్ల వైపే ఉందంట.. మొత్తానికి ఎన్నికలు దగ్గర పడుతున్నా.. ఏ పార్టీకి ఎంపీ కేడెంట్ కనపడకపోతుండటం.. అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.. అంతేమరి.. రాజమండ్రి లాంటి సిటీలో .కేండెట్ల కరవు అంటే వండరే మరి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News