BigTV English

Rayapati Rangarao : టీడీపీలో అసంతృప్తి సెగలు.. కేశినేని బాటలో రాయపాటి రంగారావు

Rayapati Rangarao : టీడీపీలో అసంతృప్తి సెగలు.. కేశినేని బాటలో రాయపాటి రంగారావు

Rayapati Rangarao : ఎన్నికల వేళ ఏపీ రాజకీయాలు కాకరేపుతున్నాయి. టీడీపీ అధినేతకు తెలుగు తమ్ముళ్లు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తుండంతో రాష్ట్ర రాజకీయాలు మరింత రంజుగా సాగుతున్నాయి. టికెట్‌ దక్కని నేతలంతా పార్టీని వీడుతూ.. తీవ్రస్థాయిలో తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కుతున్నారు. మరొకరు ఇటీవలే విజయవాడలో ఎంపీ కేశినేని నాని టీడీపీని వీడగా.. అవే పాలిట్రిక్స్‌ గుంటూరులోనూ సాగుతుండటంతో పొలిటికల్‌ కాక సెగలు రేపుతోంది.


దశాబ్ధాల కాలం నుంచి టీడీపీలో ఉన్న రాయపాటి సాంబశివరావు ఫ్యామిలీ నుంచి కూడా అసంతృప్తి జ్వాలలు ఎగిపిపడుతున్నాయి. తన కుమారుడు రంగరావు గత కొంతకాలం నుంచి చంద్రబాబుపై అసంతృప్తిగా ఉన్నారు. గుంటూరు కానీ, సత్తెనపల్లి నుంచి కానీ తనకు టికెట్ ఇవ్వాలని ఆశించారు రంగారావు. అయితే.. అధిష్టానం పట్టించుకోకపోవడంతో కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంది రాయపాటి ఫ్యామిలీ. సత్తెనపల్లి స్థానాన్ని కన్నా లక్ష్మీనారాయణ ప్రకటించడంతో రంగారావు ఆగ్రహంతో ఊగిపోయారు.

తమను కాదని రాజకీయ విరోధి అయిన కన్నాకు ఎలా ఇస్తారని మండిపడ్డ ఆయన టీడీపీకి రాజీనామా చేశారు. అంతటితో ఆగకుండా తన కార్యాలయంలోని చంద్రబాబు ఫొటోను నేలకేసి కొట్టి ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. ఈ సందర్భంగా చంద్రబాబు, లోకేష్‌లపై తీవ్రస్థాయిలో ఫైర్‌ అయ్యారు. తండ్రీ కొడుకులపై విమర్శలు గుప్పించారు. మంగళగిరిలో లోకేశ్ ఎలా గెలుస్తారో చూస్తానంటూ శపథం చేశారు.


.

.

Related News

Durgamma Temple: ఇంద్రకీలాద్రి టెంపుల్‌లో అపచారం.. ముగ్గురు వ్యక్తులు చెప్పులను ధరించి టెంపుల్‌లోకి..?

AP Rains: ఏపీ వాసులకు అలర్ట్.. రాగల 3 గంటల్లో పిడుగుపాటు హెచ్చరిక.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

GST Official Suspended: సోషల్ మీడియా పోస్ట్ తో ఉద్యోగం ఊడింది.. జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ పై సస్పెన్షన్ వేటు

Prakasam District: గిద్దలూరులో విషాదం.. బాత్రూంలో డెలివరీ.. బకెట్లో శిశువును పడేసి.. పరారైన తల్లి

Tirumala: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం

Dasara Navaratri Celebrations: శ్రీ వేదమాత గాయత్రీ దేవిగా.. కనకదుర్గమ్మ దర్శనం

Vijayawada News: స్కూల్‌ బస్సు డ్రైవర్‌కు గుండెపోటు.. అదుపు తప్పిన బస్సు, విద్యార్థులు సేఫ్

AP Council Session: మండలిలో అధికార-విపక్షాల మధ్య మాటలయుద్ధం.. బొత్స-లోకేష్ మధ్య ఏం జరిగింది?

Big Stories

×