BigTV English

AP : RCB ఫ్యాన్స్ ఓవరాక్షన్.. చితక్కొట్టిన పోలీసులు.. వీడియో వైరల్

AP : RCB ఫ్యాన్స్ ఓవరాక్షన్.. చితక్కొట్టిన పోలీసులు.. వీడియో వైరల్

AP : అభిమానం ఉండాలి. అది కంట్రోల్‌లో ఉండాలి. ఒంట్లో ఉండాలి. ఇంట్లో ఉండాలి. అలా కాదని.. రోడ్డెక్కి రచ్చ చేస్తే.. అర్థరాత్రి ఓవరాక్షన్ చేస్తే.. తాట తీస్తారు బెజవాడ పోలీసులు.


ఆర్సీబీ ఐపీఎల్‌ టైటిల్‌ గెలిచిన రాత్రి విజయవాడ కృష్ణలంకలో కొందరు యువకులు రోడ్లపై వీరంగం వేశారు. బైక్‌పై స్పీడ్‌గా వెళుతూ నానారచ్చ చేశారు. రోడ్డు మధ్యలో ఉన్న బారికేడ్‌ను లాక్కోని వెళ్లారు. వెనకలా వస్తున్న ఫ్రెండ్స్‌ ఆ వీడియో తీశారు. బండిపై చాలా దూరం వరకు బారికేడ్‌ను తీసుకెళ్లారు. బందర్‌ రోడ్‌లో ఉన్న మొక్కలను సైతం ధ్వంసం చేశారు.

పోలీస్ స్టైల్ ట్రీట్‌మెంట్!


కట్ చేస్తే.. ఆ వీడియో పోలీసుల కంట పడింది. ఆ యువకులు ఎవరో గుర్తించారు. రామలింగేశ్వరనగర్‌కి చెందిన పవన్‌సాయి, పడమట ప్రాంతానికి చెందిన నవీన్‌‌పై కృష్ణలంక పోలీసులు కేసు ఫైల్‌ చేశారు. వారిని స్టేషన్‌ను పిలిపించారు. సెల్‌లో వేసి కుమ్మేశారు. పోలీస్ మార్క్ కోటింగ్ ఇచ్చారు.

ఆ వీడియోలు వైరల్

ఆర్సీబీ గెలిచిన రాత్రి హుషారుగా యాక్టివ్‌గా ఉన్న ఆ యువకులు.. పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చేటప్పుడు మాత్రం సీన్ మారిపోయింది. కుంటుకుంటూ.. కాళ్ల నొప్పులతో నడవలేక నడిచారు. ఫ్రెండ్స్ భుజాలపై చేతులేసి అతికష్టం మీద స్టేషన్‌ నుంచి బయటపడ్డారు. పాదాలు పగిలిపోయేలా పోలీస్ ట్రీట్‌మెంట్‌ ఇచ్చారని తెలుస్తోంది. ఆ వీడియో కూడా ఎలాగో బయటకు వచ్చింది. మొన్న అలా.. నిన్న ఇలా అంటూ.. ఆ రెండు దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

అంత పిచ్చి ఎందుకు?

బెంగళూరులోనూ ఇలానే ఫ్యాన్స్ ఓవరాక్షన్ వల్ల 11 మంది అమాయకులు చనిపోవాల్సి వచ్చింది. పదుల సంఖ్యలో ఆసుపత్రి పాలు కావాల్సి వచ్చింది. ఎందుకొచ్చిన ఈ పిచ్చి అభిమానం. వాళ్లేమీ దేశం తరఫున కప్ గెలవలేదు. ఐపీఎల్ టోర్నమెంట్ ఫక్తు బిజినెస్. ఫ్రాంచజీలు కోట్లు కుమ్మరిస్తాయి. అంతే మొత్తంలో లాభాలు సంపాదిస్తాయి. అదంతా పైసా వసూల్ గేమ్. మధ్యలో ఫ్యాన్సే గుడ్డలు చించుకుంటారు. చేతులు కోసుకుంటారు. బెట్టింగులు, గొడవలతో బలైపోతుంటారు. మినిమమ్ కామన్ సెన్స్‌తో ఆలోచించినా అర్థమైపోతుంది. వాళ్లు వేరు. మనం వేరు అని. వాళ్లు డబ్బు సంపాదనకు క్రికెట్ ఆడుతారు. మనం మజా కోసం మ్యాచ్‌లు చూస్తుంటాం. ఫ్రెండ్స్‌తో మస్తీ చేసే వరకైతే ఓకే. అంతే కానీ.. తమ అభిమాన టీమ్ గెలిచిందనే ఆనందంలో ఇలా రోడ్లపై పడి పిచ్చిపనులు చేయడం కరెక్ట్ కాదు. చెట్లు విరగ్గొట్టడం, బారికేడ్లు లాక్కెళ్లడం చేస్తే.. పోలీసులు ఊరుకుంటారా మరి? ఇలానే లోపలేసి చితక్కొట్టేస్తారు జాగ్రత్త.

Related News

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Big Stories

×