BigTV English

Khaleja Re Release: రీ రిలీజ్ లో చరిత్ర సృష్టించిన ఖలేజా.. వరల్డ్ వైడ్ కలెక్షన్లు ఎంతంటే?

Khaleja Re Release: రీ రిలీజ్ లో చరిత్ర సృష్టించిన ఖలేజా.. వరల్డ్ వైడ్ కలెక్షన్లు ఎంతంటే?

Khaleja Movie: సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu)నటించిన సినిమాలలో ఖలేజా (Khaleja)సినిమా ఒకటి. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా 2010 అక్టోబర్ 7వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మహేష్ బాబు, అనుష్క(Anushka) హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా అప్పట్లో ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ప్రేక్షకుల అంచనాలను మాత్రం చేరుకోలేకపోయింది . ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్న నేపథ్యంలోనే సినిమాకు దెబ్బ పడిందని ఇటీవల నిర్మాత కళ్యాణ్ తెలిపారు. ఒకరకంగా చెప్పాలంటే ఈ సినిమాని మహేష్ బాబు అభిమానులే అప్పుడు చంపేశారని ఈయన తెలిపారు.


రీ రిలీజ్ తో రికార్డ్….

ఇలా 14 సంవత్సరాల తర్వాత తిరిగి ఈ సినిమా మరోసారి థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే మొదట్లో విడుదలైన సమయంలో ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిన బుల్లితెరపై మాత్రం సుమారు 1500 సార్లు టెలికాస్ట్ అయ్యి మరొక రికార్డు సృష్టించింది. ఇలా టెలివిజన్లో చూసిన అభిమానులు ఈ సినిమా ఎందుకు ఫ్లాప్ అయ్యిందనే ఆలోచనలు కూడా చేశారు. ఇలా అభిమానుల కోసమే మరోసారి ఈ సినిమాని మే 30 వ తేదీ తిరిగి విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు ఊహించని విధంగా అభిమానుల నుంచి ఆదరణ లభించటం విశేషం.


రీ రిలీజ్ లో చరిత్ర సృష్టించిన ఖలేజా…

ఇలా వారం రోజులపాటు ఈ సినిమాకు మంచి ఆదరణ లభించడమే కాకుండా హౌస్ ఫుల్ కావడంతో చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఇక ఈ సినిమా మొదటి రోజు నుంచి కూడా అద్భుతమైన కలెక్షన్లను రాబట్టింది. తాజాగా ఈ వారం రోజులలో ఖలేజా రీలీజ్ ద్వారా ఎన్ని కలెక్షన్లు రాబట్టిందనే విషయాలను చిత్ర బృందం అధికారక పోస్టర్ ద్వారా వెల్లడించారు. మే 30వ తేదీ విడుదలైన ఈ సినిమా వారం వ్యవధిలోగా ఏకంగా రూ. 13.2 కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టి రికార్డులను సృష్టించింది.. రీ రిలీజ్ సమయంలో ఈ తరహా కలెక్షన్లను ఏ సినిమా కూడా రాబట్టలేదని చెప్పాలి. 14 సంవత్సరాల తర్వాత తిరిగి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్లు చూస్తుంటే ఇదొక రీ రిలీజ్ సినిమా లాగా లేదని, ఈ సినిమా ఒక చరిత్రను సృష్టించిందని చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం ఈ సినిమా కలెక్షన్లకు సంబంధించిన పోస్టర్ విడుదల చేయడమే కాకుండా రీ రిలీజ్ లో ఇంత మంచి సక్సెస్ అందుకోవడంతో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఒకప్పుడు ఈ సినిమాని చంపేసిన అభిమానులే ఇప్పుడు తిరిగి ఈ సినిమాకు ప్రాణం పోసారని చెప్పాలి. ఇక మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఈయన రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే . ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మహేష్ బాబు ఈ సినిమా పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈయన చివరిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించిన గుంటూరు కారం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు కానీ ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయిందని చెప్పాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×