Manchu Manoj: మంచు మనోజ్ (Manchu Manoj)చాలా సంవత్సరాల తర్వాత తిరిగి వెండి తెరపై సందడి చేశారు. మంచు మనోజ్ మోహన్ బాబు కుమారుడిగా బాల నటుడిగానే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. బాల నటుడిగా పలు సినిమాలలో నటించిన మనోజ్ అనంతరం హీరోగా ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలలో నటిస్తున్న నేపథ్యంలో కొన్ని వ్యక్తిగత కారణాలవల్ల ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఈయన కుటుంబ సభ్యులు చూయించిన అమ్మాయితో పెళ్లి చేసుకోవడం ఆ అమ్మాయితో వచ్చిన విభేదాల కారణంగా విడాకులు తీసుకుని విడిపోయారు. అప్పటినుంచి మనోజ్ పూర్తిగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ఇక ఇటీవల భూమా మౌనికను(Bhuma Mounika) రెండవ వివాహం చేసుకున్నారు.
బొమ్మలు తయారుచేయడం…
ఇక ఈ వివాహం తర్వాత మనోజ్ తిరిగి ఇండస్ట్రీలో పూర్తిగా యాక్టివ్ అవుతూ వరుస సినిమాలకు కమిట్ అయ్యారు. తాజాగా ఈయన భైరవం(Bhairavam) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో మనోజ్ తన నటనతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక ఈ సినిమా విడుదలైన తరుణంలో ఈయన వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేస్తున్నారు. తాజాగా ఒక పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న మనోజ్ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. సినిమా అవకాశాలు లేకపోవడంతో మౌనిక మనం బొమ్మలు తయారు చేస్తూ బొమ్మలు బిజినెస్ ప్రారంభిద్దామని చెప్పింది. ఎంత సినిమాలు లేకపోతే బొమ్మలు చేసుకొని బ్రతకడం ఏంటి అని తనకు చెప్పాను.
సాయిధరమ్ తేజ సినిమాలో…
ఇక ఈ ఇంటర్వ్యూలో భాగంగా తన సినిమాల గురించి కూడా ప్రశ్నలు ఎదురయ్యాయి. అదే విధంగా సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న సంబరాల యేటిగట్టు సినిమాలో మీకు ఒక అవకాశం వచ్చిందని కాకపోతే అది సినిమాలో మీ పాత్రలో సంజయ్ నటిస్తున్నారని వార్తలు వచ్చాయి. నిజమేనా అంటూ ప్రశ్న ఎదురవడంతో మనోజ్ సమాధానం చెప్పారు కానీ మనం పూర్తి ఇంటర్వ్యూ బయటకు వచ్చినప్పుడు మాత్రమే అది ఏంటో తెలుసుకోగలం. ఇక తన ఇంట్లో ఎదురవుతున్న గొడవలు గురించి కూడా ప్రశ్నలు ఎదురయ్యాయి.
గత రెండు సంవత్సరాల క్రితం మనోజ్ అనుచరులతో విష్ణు గొడవ పడటం, అలాగే ఒక స్నేహితుడు ఇంట్లోకి వెళ్లి మనోజ్ అనుచరులను విష్ణు కొట్టినటువంటి ఒక వీడియో పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. అయితే ఈ వీడియోని మనోజ్ సోషల్ మీడియాలో షేర్ చేయడం కొంతసేపటికి డిలీట్ చేశారు. ఇక ఈ గొడవ గురించి పెద్ద ఎత్తున వార్తలు రావడంతో ఇదొక రియాలిటీ షో అంటూ కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. అసలు గొడవ ఏంటీ? అనే ప్రశ్న కూడా మనోజ్ కు ఎదురైంది. ఒకవేళ ఆయన ఉంటే మీరు ఈ పరిస్థితి ఎదుర్కొనేవారు కాదా? అంటూ తన మామయ్య భూమా నాగిరెడ్డి గురించి కూడా ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తుంది.. ఈ ప్రశ్నకు మనోజ్ సమాధానం చెబుతూ… ఆయన ఉంటే కచ్చితంగా నేను ఈ పరిస్థితులలో ఉండేవాన్ని కాదు అందరిని కూర్చోబెట్టి ఈ సమస్యకు పరిష్కారం చెప్పేవారు అంటూ మనోజ్ మాట్లాడారు. అయితే ఆ వ్యక్తి ఎవరు అనేది చెప్పలేదు కానీ కచ్చితంగా తన మామయ్య భూమా నాగిరెడ్డి గురించే మనోజ్ మాట్లాడారని తెలుస్తుంది. ఇక భూమా నాగిరెడ్డి(Bhuma Nagi Reddy) గొప్ప రాజకీయ నాయకుడనే విషయం అందరికీ తెలిసిందే ఆయన చిన్న కుమార్తెను మనోజ్ రెండో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక కుమార్తె కూడా జన్మించారు.