BigTV English

Kethireddy Farm House: చిక్కుల్లో కేతిరెడ్డి.. ఫామ్‌హౌస్ గురించి కీలక విషయాలు

Kethireddy Farm House: చిక్కుల్లో కేతిరెడ్డి.. ఫామ్‌హౌస్ గురించి కీలక విషయాలు

Kethireddy Farm House: ధర్మవరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికి కష్టాలు మొదలయ్యాయా? గుర్రాల కొండపై నిర్మించిన ఫామ్ హౌస్ మాటేంటి? ఇంతకీ ప్రభుత్వ భూమిని ఏ మేరా కబ్జా అయ్యింది? అధికారుల విచారణలో ఏం తేలింది? స్వయంగా అధికారులే కేతిరెడ్డి బంధువులకు నోటీసులు ఇచ్చారా? ఈ ఎపిసోడ్ కొత్త మలుపు తిరగనుందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.


కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి లీలలు

‘గుడ్ మార్నింగ్ ధర్మవరం’ పేరుతో బాగా ఫేమస్ అయ్యారు ధర్మవరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గుర్రాల కొండపై ఆయన నిర్మించిన ఫామ్‌హౌస్ గురించి రకరకాల వార్తలు వచ్చాయి. పత్రికల్లో వచ్చిన వార్తలపై రంగంలోకి దిగేశారు రెవిన్యూ అధికారులు. ఇప్పుడు ఫామ్‌హౌస్ నిర్వాహకులకు అధికారులు నోటీసులు ఇచ్చారు. నేడు లేదా రేపు వారిని విచారించనున్నారు.


ధర్మవరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి గుర్రాల కొండపై నిర్మించిన ఫామ్‌హౌస్ గురించి కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఫామ్‌హౌస్ అనే ఈ వ్యవసాయ క్షేత్రంలో దాదాపు 2.42 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉన్నట్లు గుర్తించారు రెవెన్యూ అధికారులు. సర్వే నెం 905-2లో ఆ భూమిని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి సోదరుడు వెంకట కృష్ణారెడ్డి భార్య గాలి వసుమతి పేరుతో రిజిస్టర్‌ అయ్యింది.

ఆరున్నర దశాబ్దాల కిందట

కరెక్టుగా ఆరున్నర దశాబ్దాల కిందట వ్యవసాయం చేసుకునేందుకు ధర్మవరం మండలం మోటుమర్లకు చెందిన అంకే నారాయణ, ఓబులమ్మ, తలారి అంజినమ్మలకు పట్టాలు ఇచ్చారు. అయితే ఆ భూమిని వసుమతికి విక్రయించినట్టు రిజిస్టర్‌ చేయించారు.

ALSO READ: ఏపీ సచివాలయంలో అగ్నిప్రమాదం వెనుక.. అలారం ఎందుకు మోగలేదు?

నార్మల్‌గా ప్రభుత్వం ఇచ్చిన భూమికి కొన్ని పరిమితులు ఉంటాయి. వ్యవసాయం చేసుకునేందుకు ఇచ్చిన ఆ భూమిని విక్రయించడానికి ఎలాంటి అనుమతులు ఉండవు. కాకపోతే భూమిని విక్రయించిన ముగ్గురికి రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చారు. తొలుత వసుమతికి రిజిస్టర్‌ పోస్ట్‌ ద్వారా నోటీసులు ఇచ్చారు. ఆమె నోటీసు తీసుకోకపోవడంతో తిరిగి వచ్చేశాయి.

స్వయంగా రెవెన్యూ అధికారులు గురువారం వసుమతికి నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. గుర్రాల కొండపై నిర్మించిన వ్యవసాయ క్షేత్రంలో ప్రభుత్వ భూమిని గుర్తించి దాన్ని స్వాధీనం చేసుకోవాలని ఇటీవల హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు రెవెన్యూ అధికారులు ఆ ప్రాంతంలో ప్రభుత్వ భూమి కబ్జా అయినట్టు గుర్తించి బోర్డు ఏర్పాటు చేసేందుకు వెళ్లారు.

గేటుకు తాళాలు.. ఆపై అధికారులు వెనక్కి

గేటుకు తాళాలు వేసి ఉండటంతో అధికారులు వెనుదిరిగారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రెవెన్యూ సిబ్బంది భూమి పరిశీలనకు వెళ్లనట్టు ఆ మండలం అధికారులు చెప్పారు. రెండున్నర ఎకరాల అసైన్డ్ భూమిని కుటుంబ సభ్యుల పేరుతో కేతిరెడ్డి రిజిస్టర్ చేయించుకున్నట్లు సమాచారం. అయితే స్థల వివాదంపై హైకోర్టులో కేతిరెడ్డి లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం విచారణకు రానున్నట్టు తెలుస్తోంది.

గత ఎన్నికల ప్రచారం సమయంలో గుర్రాల కొండపై నిర్మించిన ఫామ్‌హౌస్ టీడీపీ-వైసీపీ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. దీనికి సంబంధించి అప్పట్లో నారా లోకేష్ పూర్తి వివరాలు బయటపెట్టారు కూడా. భూములను ఆక్రమించుకొని విలాసమంతమైన ఫామ్‌హౌస్, తోటలు, బోటింగ్ వంటివి ఏర్పాటు చేసుకున్నారని ధ్వజమెత్తారు కూడా. ఆరోపణలు నిరూపిస్తే రాజీనామా చేస్తానన్న కేతిరెడ్డి, మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన విషయం తెల్సిందే.

 

Related News

Prakasam District: గిద్దలూరులో విషాదం.. బాత్రూంలో డెలివరీ.. బకెట్లో శిశువును పడేసి.. పరారైన తల్లి

Tirumala: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం

Dasara Navaratri Celebrations: శ్రీ వేదమాత గాయత్రీ దేవిగా.. కనకదుర్గమ్మ దర్శనం

Vijayawada News: స్కూల్‌ బస్సు డ్రైవర్‌కు గుండెపోటు.. అదుపు తప్పిన బస్సు, విద్యార్థులు సేఫ్

AP Council Session: మండలిలో అధికార-విపక్షాల మధ్య మాటలయుద్ధం.. బొత్స-లోకేష్ మధ్య ఏం జరిగింది?

Jagan – Pavan: పవన్ జోలికి వెళ్లొద్దు.. జగన్ ఆదేశాలు తూచా తప్పకుండా పాటిస్తున్న వైసీపీ నేతలు

Amaravati News: మొబైల్ పాస్‌పోర్టు సేవలు..భలే ఉంది కదూ, ఇంకెందుకు ఆలస్యం

Bapatla YSRCP: బాపట్లలో వైసీపీకి దిక్కెవరు?

Big Stories

×