Reliance Blast: గేమింగ్ ప్రియులకు కీలక వార్త వచ్చేసింది. ఇకపై భారతదేశ గేమింగ్ రంగంలో భారీ మార్పులు రాబోతున్నాయి. దేశంలోని అతిపెద్ద కార్పొరేట్ దిగ్గజాల్లో ఒకటైన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇప్పుడు గేమింగ్ ప్రపంచంలోకి అడుగుపెడుతోంది. అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన ఈ-స్పోర్ట్స్ సంస్థ BLASTతో కలిసి, భారతదేశంలో కొత్త మేధో సంపత్తి (IP)ని అభివృద్ధి చేయడానికి ఈ వ్యాపారంలోకి ప్రవేశిస్తోంది. యువతకు గేమింగ్ అభిమానం పెరుగుతున్న క్రమంలో ఈ కొత్త భాగస్వామ్యం గేమింగ్ పరిశ్రమను మరింత మార్చే అవకాశం ఉంది.
రిలయన్స్, బ్లాస్ట్ మధ్య ఒప్పందం
రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ రైజ్ వరల్డ్‌వైడ్ ఈ-స్పోర్ట్స్ వ్యాపారాన్ని పురోగమింపచేసేందుకు BLASTతో కలిసి పనిచేస్తుంది. ఈ భాగస్వామ్యం ద్వారా, భారతదేశంలోని గేమింగ్ మార్కెట్ అంతర్జాతీయ స్థాయి పోటీలు, ఈవెంట్‌లు, ఇ-స్పోర్ట్స్ టోర్నమెంట్లకు చేరువయ్యే అవకాశముంది.
ప్రముఖ గేమ్‌ల కోసం
BLAST, ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ ఈ-స్పోర్ట్స్ పోటీ నిర్వాహకులలో ఒకటిగా నిలిచింది. డెన్మార్క్‌కు చెందిన ఈ సంస్థ, ఇప్పటికే CS:GO, VALORANT వంటి ప్రముఖ గేమ్‌ల కోసం అంతర్జాతీయ స్థాయి పోటీలను నిర్వహిస్తూ, గేమింగ్ ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపును సంపాదించింది. రిలయన్స్‌తో భాగస్వామ్యం ద్వారా, భారతదేశంలో BLAST అంతర్జాతీయ స్థాయి గేమింగ్ స్థాయికి చేరుకోనుంది.
భారతదేశ గేమింగ్ మార్కెట్ వృద్ధి
రిలయన్స్ ప్రకటన ప్రకారం, భారతదేశం ప్రపంచంలోని అతిపెద్ద గేమింగ్ మార్కెట్లలో ఒకటిగా ఎదుగుతోంది. ప్రస్తుతం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న గేమర్లలో 18% భారతదేశంలోనే ఉన్నారు. 2024 నాటికి భారతదేశ గేమింగ్ పరిశ్రమ విలువ $3.8 బిలియన్లుగా ఉండగా, 2029 నాటికి ఇది $9.2 బిలియన్లకు చేరుకోవచ్చని అంచనా. 19% CAGR వృద్ధితో, ఇది ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో ఒకటిగా అవతరిస్తోంది.
Read Also: QLED TV Launch Offer: రూ.6 వేలకే బ్రాండెడ్ QLED స్మార్ట్ …
వినోదం కంటే కూడా..
ఈ-స్పోర్ట్స్ గేమింగ్ సాధారణ వినోదం కంటే ఇది ఎంతో ముందుకు వెళ్తోంది. ప్రొఫెషనల్ ఈ-స్పోర్ట్స్ ప్లేయర్లు, టీములు, కోచ్‌లు, స్ట్రీమర్‌లు, స్పాన్సర్‌షిప్ డీల్స్ ద్వారా ఈ రంగం భారీ ఎత్తున అభివృద్ధి చెందుతోంది. భారత ప్రభుత్వం కూడా ఈ-స్పోర్ట్స్‌ను మల్టీ-స్పోర్ట్స్ ఈవెంట్‌గా గుర్తించడంతో, ఇది అధికారికంగా గుర్తింపు పొందిన క్రీడల జాబితాలో చేరింది.
రిలయన్స్ వ్యాపారంలో జియో పాత్ర
రిలయన్స్ ఈ వ్యాపారాన్ని విజయవంతంగా విస్తరించడానికి తన డిజిటల్ ఎకోసిస్టమ్ అయిన జియోను వినియోగించుకోనుంది. దేశంలోని అతిపెద్ద టెలికాం నెట్‌వర్క్‌గా ఉన్న జియో, గేమింగ్ కోసం అత్యుత్తమ కనెక్టివిటీ, 5G ఇంటర్నెట్ సేవలు, క్లౌడ్ గేమింగ్ వంటి అత్యాధునిక సాంకేతికతను అందించగలదు. ఇది గేమింగ్ ఈవెంట్లు, టోర్నమెంట్లు, ప్రత్యక్ష ప్రసారాలను మరింత ప్రభావవంతంగా మార్చేందుకు సహాయపడుతుంది.
BLAST CEO స్పందన
BLAST CEO రాబీ డోక్ దీనిపై మాట్లాడుతూ, “భారతదేశంలోని విస్తృతమైన గేమింగ్ టాలెంట్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు ఈ భాగస్వామ్యం గొప్ప అవకాశాన్ని అందిస్తుందన్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రాబల్యంతో భారతదేశ మార్కెట్‌పై ఈ-స్పోర్ట్స్‌ను కొత్త స్థాయికి తీసుకెళ్లగలమని ధీమా వ్యక్తం చేశారు.
భారత గేమింగ్ కమ్యూనిటీకి లాభాలు
-ఈ భాగస్వామ్యం వల్ల భారతదేశ గేమింగ్ కమ్యూనిటీకి అనేక లాభాలు ఉన్నాయి:
-అంతర్జాతీయ పోటీలు: భారత గేమర్‌లు ప్రపంచ స్థాయి టోర్నమెంట్లలో పాల్గొనే అవకాశాలు పెరుగుతాయి.
-ఉత్తమ మౌలిక సదుపాయాలు: BLAST సాంకేతిక పరిజ్ఞానం, రిలయన్స్ వనరులు కలసి భారతదేశంలో ప్రొఫెషనల్ ఈ-స్పోర్ట్స్ మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తాయి.
-కెరీర్ అవకాశాలు: గేమింగ్ పరిశ్రమలో ప్రొఫెషనల్ ప్లేయర్, కోచ్, కామెంటేటర్, ఇతర అవకాశాలు పెరుగుతాయి.
-బ్రాండ్ స్పాన్సర్‌షిప్‌లు: భారత గేమింగ్ మార్కెట్ పెరుగుతుండటంతో, అంతర్జాతీయ బ్రాండ్‌లు ఇక్కడి టోర్నమెంట్లను స్పాన్సర్ చేసే అవకాశాలు పెరుగుతాయి.