BigTV English

Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి..

Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి..
This image has an empty alt attribute; its file name is 4f97b077257bc3754bf87d1aa6965739.jpg

Road Accident : రెండు వేరు వేరు ప్రమాదాలలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన శనివారం తెల్లవారుజామున అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కల్లూరు గ్రామ సమీపంలోని 44 హైవే పై చోటుచేసుకుంది.


వివరాలోకి వెళ్తే.. గార్లదిన్నె మండలం కల్లూరు గ్రామ సమీపంలోని 44 హైవేపై శనివారం తెల్లవారుజామున రైస్ మిల్లు వద్ద బియ్యం పాలిష్ చేసుకుని ట్రాక్టర్ లో లోడ్ చేసి.. గుత్తి మండలం మాముడూరు గ్రామానికి వెళ్తున్నారు. బియ్యం లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ను వెనుక నుంచి ఓ ప్రైవేట్ వోల్వో బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్లో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.

అలాగే పామిడి పట్టణ శివారులో మరో ప్రమాదం జరిగింది. లారీని ఐచర్ వాహనం వెనక నుంచి ఢీకొట్టడంతో.. ఒకరు మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నారు.


రెండు ప్రమాదాల్లో మృతి చెందిన వారిని గుత్తి మండలం మాముడూరు గ్రామానికి చెందిన చిన్న తిప్పయ్య, శ్రీరాములు, నాగార్జున, శ్రీనివాసులు, వాసులుగా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద ఘటనపై పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Related News

Free Bus: ఉచిత బస్సు.. వైసీపీ విమర్శలను జనం నమ్మేస్తారా?

Tollywood Producers: ఏపీకి చేరిన సినిమా పంచాయితీ.. మంత్రి దుర్గేష్ తో ఫిలిం చాంబర్ నేతల సమావేశం

Anantapur News: ఏపీలో షాకింగ్ ఘటన.. బస్సు ఆపలేదని మహిళ ఆగ్రహం.. డ్రైవర్ చెంప పగలకొట్టింది

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు, అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Big Stories

×