BigTV English

Road accident on Tirumala: తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం..ఇద్దరు స్పాట్ డెడ్

Road accident on Tirumala: తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం..ఇద్దరు స్పాట్ డెడ్
Advertisement

Road accident on Tirumala Ghat road Two Died: తిరుమలలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జీఎన్‌సీ చివరి మలుపు వద్ద బైక్ ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.


తిరుపతి నుంచి తిరుమలకు తమిళనాడుకు చెందిన ఓ దంపతులు బైక్ పై వెళ్తున్నారు. మార్గమధ్యలో జీఎన్‌సీ చివరి మలుపు వద్ద బైక్ స్కిడ్ అయింది. ఈ ఘటనలో ఆ బైక్ ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో నేరుగా బస్సు కిందకు వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందారు. అయితే మృతదేహాలు బస్సు కింద ఇరుక్కుపోవడంతో తీసేందుకు పోలీసులు తీవ్రంగా కష్టపడ్డారు. చివరికి క్రైన్ సహాయంతో బస్సు కింద ఇరుక్కున మృతదేహాలను బయటకు తీశారు.

Also Read: వైసీపీకి భారీ షాక్..పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే


సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. అలాగే బస్సు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. కాగా, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం జరగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వెంటనే పోలీసులు సహాయక చర్యలు చేపట్టి ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నారు.

Related News

Lokesh In Kurnool: గ్యాప్ రాకూడదు, మళ్లీ మనమే రావాలి – లోకేష్

Modi Kurnool: బాబు-పవన్ రూపంలో ఏపీలో శక్తిమంతమైన నాయకత్వం ఉంది -కర్నూలు సభలో మోదీ

Pawan Kalyan:15 ఏళ్లు మనదే అధికారం.. హై ఓల్టేజ్ స్పీచ్

CM Chandrababu: ప్రధాని మోదీ తెచ్చిన సంస్కరణలు దేశానికి గేమ్ ఛేంజర్లు: సీఎం చంద్రబాబు

CM Chandrababu: లండన్ టూర్‌కి సీఎం చంద్రబాబు.. షెడ్యూల్ ఖరారు, ఎప్పుడంటే..

PM Modi: మల్లన్నసేవలో ప్రధాని మోడీ.. సీఎం చంద్రబాబు, డీసీఎం పవన్‌తో కలిసి శ్రీశైలంలో పర్యటన

Narayana Nadendla: అలా మాట్లాడటం సరికాదు.. నారాయణపై నాదెండ్ల సీరియస్

Jagan: జగన్ ఇరుక్కుపోయారా? ఫారెన్ టూర్‌ చిక్కులు.. రంగంలోకి సీబీఐ, ఇప్పుడెలా?

Big Stories

×