E-Paper
Advertisement

ల‌క్కీ నెంబ‌ర్‌, ఆషాఢ మాసం.. మంచి ముహూర్తం..! అచ్చం కేసీఆర్ లెక్క‌నే..! కేటీయారే భిన్నం..

ల‌క్కీ నెంబ‌ర్‌, ఆషాఢ మాసం.. మంచి ముహూర్తం..! అచ్చం కేసీఆర్ లెక్క‌నే..! కేటీయారే భిన్నం..
Advertisement

ఇందులో కొత్తేముంది? ఈ వార్తలో ప్ర‌త్యేక‌తేముంది??

అయితే, ముందు ఈ వార్త చ‌దవండి..

Advertisement

——-

23 అసెంబ్లీ నియోజకవర్గాలకు తెలంగాణ రక్షణ సేన ఇన్ ఛార్జీల నియామకం

Advertisement

తన లక్కీ నంబర్ 5 వచ్చేలా 23 మంది ఇన్ ఛార్జీలను ప్రకటించిన పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత

ఆషాఢ మాసంలో మంచి ముహూర్తంలో ఇన్ ఛార్జీలను ప్రకటించిన పార్టీ చీఫ్

దశలవారీగా రాష్ట్రంలోని మిగతా అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ ఛార్జీలను ప్రకటించనున్న పార్టీ అధ్యక్షులు..

————

క‌వితకు ముహూర్తాల మీద న‌మ్మ‌కం ఎక్కువ‌. నిత్యం పూజ‌లు చేస్తారు. దైవ‌భ‌క్తి ఎక్కువ‌. కావొచ్చు. ఇందులో కొత్తేముంది? ఇప్పుడు మ‌నం కేసీఆర్ గురించి చెప్పుకుందాం. కేసీఆర్‌కు కూడా ల‌క్కీ నెంబ‌ర్లంటే న‌మ్మ‌కం. ఆరు ఆయ‌న ల‌క్కీ నెంబ‌ర్‌. అవి క‌లిసొచ్చేలా కార్య‌క్ర‌మాలు చేస్తూ ఉంటాడు. ముహూర్తాలు కూడా బాగానే ఫాలో అవుతూ ఉంటాడు. అయితే? ఇదీ ఓ వార్తేనా?

సేమ్ కేసీఆర్ లాగే క‌వితకు ఆధ్యాత్మిక‌త భావాలు ఎక్కువే. రాజ‌కీయ ప‌ర‌మైన, విధానాల ప‌రంగా కొన్ని విష‌యాల్లో క‌విత .. కేసీఆర్‌ను ఫాలో అవుతున్న‌ట్టుగా అనిపిస్తుంటుంది. భ‌క్తిభావం విష‌యంలో కూడా పూర్తిగా తండ్రి విధానాల‌నే అనుస‌రిస్తుంద‌నే విష‌యం చెప్ప‌డ‌మే ఈ వార్త ఉద్దేశ్యం.

ఇదేనా వార్త‌..? అయిపోయిందా??

ఇప్పుడు కేటీఆర్ గురించి చెప్పుకుందాం..!

వీరిద్ద‌రికీ పూర్తి విరుద్దం కేటీఆర్‌. ప్ర‌ధానంగా భక్తి విష‌యంలో. అవును. పూజ‌లంటే ప‌డ‌వు. దేవుళ్ల ద‌ర్శ‌నాలుండ‌వు. బొట్టు పెట్టుకోడు. చేతులెత్తి మొక్క‌డు. దైవ నామ‌స్మ‌ర‌ణ జీరో. ఇవ‌న్నీ ఎందుకు.. అత‌డో నాస్తికుడు.. అంతే! అవును.. ఈ విష‌యం అంద‌రికీ తెలుసు.. ఇది కూడా వార్తేనా?

అంద‌రికీ తెలుసుని నేను అనుకోవ‌డం లేదు. తెలియ‌ని వారి కోస‌మే ఈ వార్త‌.

స‌రే, ముగించేద్దామా? ఏం వార్త‌లు దొర‌క‌లే..!

ఇప్పుడు కేటీఆర్‌లో మారిన మ‌నిషి కోణం ట‌చ్ చేద్దాం..! అదే భ‌క్తి విష‌యంలో..

ఆయ‌న ఒక‌ప్పుడు శ్రీ‌రాముడి పేరు చెబితే క‌డుపు నిండుతుందా? ఆక‌లి తీరుతుందా? అని అనేవాడు. ఇప్పుడు మారాడు. అలా అన‌డం లేదు. అలా అంటే రాజ‌కీయంగా ఇబ్బందులు వ‌స్తాయ‌ని గ్ర‌హించాడు. అందుకే అత‌నూ జై శ్రీ‌రామ్ అంటున్నాడు.

గుళ్ల‌కు పోతున్నాడు.. అదీ మీడియా ఉంటేనే.. ఫోటోల కోసం.. వీడియోల కోసం..

చేతులెత్తి మొక్కుతున్నాడు… అది కూడా విలేక‌రుల కోసం..

పూర‌ణాల గాధ‌లు, అప్ప‌టి పేర్ల‌ను స్మ‌రించుకుంటున్నాడు.. సంద‌ర్బోచితంగా ఇలా మాట్లాడితే జ‌నానికి బాగా క‌నెక్ట‌వుతాయ‌ని. మారితే మంచిదే క‌దా..? మొత్తానికి నాస్తికుడు.. ఆస్తికుడ‌య్యాడ‌న్న‌మాట‌..!

కాలేదు. అయిన‌ట్టుగా న‌టించేస్తున్నాడు. అదేందీ..? కేసీఆర్ పెంప‌కంలో.. అలాఎలా..? క‌విత ఇలా.. కేటీఆర్ అలా..?

ఆయుత చండీయాగం చేసేంత భ‌క్తి భావం కేసీఆర్‌లో.. అస‌లు దైవ‌మే లేద‌నే వాద‌న కేటీఆర్‌ది..

ఇదీ వార్త‌.

Related News

అన్నా హజారేలా తెరమరుగు కాకుండా! రాజకీయ పార్టీగా మారబోమని ప్రకటించిన సీజేపీ! నైతిక విశ్వసనీయతే ఊతంగా..!

కాంగ్రెస్ ను ఓడించేందుకు… బీజేపీ, బీఆర్‌ఎస్‌ రహస్య దోస్తానా? గ్రేటర్‌పై బీజేపీ పట్టు.. నల్లగొండపై గులాబీ పంతం..!

కేంద్ర మంత్రైనా… వాస్తవాలు చెప్పడంలో వెనక్కి రారు! మోడీ కేబినెట్‌లో ఉంటూనే జెన్‌జీ శక్తికి జై కొడతారు!

మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ పైనా ఆరోపణలు..! ఆయనకు బ్యాంక్‌ చైర్మన్‌గా ఎందుకు అవకాశం ఇచ్చారు? కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చిన ప్రశాంత్‌ కిషోర్‌..

పుష్కరకాలంలో యువత యూటర్న్‌..! మోడీ అప్పుడు కొత్త ఓటర్ల పాలిట హీరో..! అందుకే నెత్తినెత్తుకున్నారు.. ఇప్పుడెందుకు వైఖరి మారింది? సీఎస్‌డీఎస్‌ ఆసక్తికర విశ్లేషణ..!

ఉద్యమాల ఆయువుపట్టు మీద పాలకుడి దాడి! ప్రశ్నించే గొంతులకు వేదిక లేకుండా చేసే కుయుక్తులు..! ధర్నాచౌక్‌లకు తాళాలేయడం.. రోగానికి మందు కాదు..!

హస్తిన పోరులో తెలంగాణ కీ రోల్‌! రేవంత్‌పై భారీ నమ్మకం పెట్టుకున్న ఏఐసీసీ! ఢిల్లీ పోరులో టీ కాంగ్రెస్‌ హవా!

తమిళనాడు టూర్‌లో మోడీ, విజయ్‌ల ఎడముఖం పెడముఖం! పరువు పోకుండా మోడీ తండ్లాట..! మౌనంగా ఉంటూ ఇమేజీని డ్యామేజీ చేసేలా విజయ్‌..!

Big Stories

Advertisement
×