BigTV English

Sajjala Ramakrishna Reddy: వీళ్లు అసలు మనుషులా..? పిశాచాలా..?: సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్!

Sajjala Ramakrishna Reddy: వీళ్లు అసలు మనుషులా..? పిశాచాలా..?: సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్!

Sajjala Ramakrishna Reddy Comments: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఫైరయ్యారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో ప్రజలను చంద్రబాబు తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఏదో జరిగిపోతున్నట్టు క్రియేట్ చేసి విషప్రచారం చేస్తున్నారన్నారు. 2019లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు టీడీపీ ఎందుకు మద్దత్తిచ్చిందని ఆయన ప్రశ్నించారు.


ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో రాష్ట్రంలో అసత్యలు ప్రచారం చేసి భయభ్రాంతులను సృష్టించి దాని ద్వారా లబ్ధి పొందాలని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారన్నారు. చంద్రబాబు అండ్ ముఠా అత్యంత దిగజారుడు రాజకీయం చేస్తోందన్నారు. వీళ్లు అసలు మనుషులా..? పిశాచాలా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఓ చెత్త అని బీజేపీతో చెప్పించగలరా ? అని సవాల్ విసిరారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై విషప్రచారం చేస్తున్న టీడీపీ అప్పుడు అసెంబ్లీలో, మండలిలో ఎందుకు మద్దతిచ్చిందంటూ సజ్జల ప్రశ్నించారు. బాలకృష్ణ, పవన్ కల్యాణ్ భూములు కొన్నారు.. మరి ఆ పత్రాలు జిరాక్స్ కాపీలేనా? అంటూ ప్రశ్నించారు. వీళ్లంతా కలిసి రాష్ట్రంలో ఏదో జరిగిపోతున్నట్టు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు.

తన హయాంలోనే ప్రారంభమైన ఈ-స్టాంపింగ్ విధానాన్ని బాబు జిరాక్స్ కాపీలంటున్నారన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేస్తామని చంద్రబాబు.. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షాతో ఎందుకు చెప్పించలేదని ప్రశ్నించారు. ల్యాండ్ టైటిలింగ్ తర్వాత భూమికి ప్రభుత్వం పూచీ ఇస్తుందని ఆయన పేర్కొన్నారు.


Also Read: ఏపీ ప్రభుత్వానికి ఈసీ లేఖ.. మధ్యాహ్నం 3 గంటల్లోగా సమాధానం చెప్పండి..

ఇదిలా ఉంటే.. పలు సభలు, సమావేశాలు, ర్యాలీలలో పాల్గొన్న చంద్రబాబు, పవన్ కల్యాణ్.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో రాష్ట్రంలోని భూములను సీఎం జగన్ దోచుకుంటారని వారు పేర్కొన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో మీ ఇల్లు మీది కాదు.. మీ భూములు మీవి కావంటూ లోకేశ్ కూడా ఆరోపణలు చేశారు. ఇలాంటి చట్టాన్ని తీసుకొచ్చిన జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించాలన్నారు. ఈ చట్టం ద్వారా జగన్ మోహన్ రెడ్డి మీ స్థలాన్ని బ్యాంకులో తనఖా పెట్టే అవకాశముందని లోకేశ్ పేర్కొన్నారు. కూటమి అధికారంలోకి రాగానే ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. వీరి ఆరోపణలపై స్పందించిన సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్ గా బదులిచ్చారు.

Tags

Related News

Yellow Shirt: అసలైన పసుపు సైనికుడు.. కూతురు పెళ్లిలో కూడా పసుపు చొక్కానే

Roja Hot Comments: శుక్రవారం వస్తే జంప్.. జగన్‌పై రోజా సెటైర్లు?

Digital Book: డిజిటల్ బుక్‌తో వైసీపీ వార్నింగ్.. రెడ్ బుక్ విజృంభించే టైమ్ వచ్చిందా?

Mother Killed Son: కళ్లలో కారం, చీరతో ఉరి.. ఎకరం భూమి కోసం కొడుకును చంపిన తల్లి

Jagan: ప్రతిపక్ష హోదా వల్ల లాభం ఏంటి? ఎమ్మెల్యేలకు ప్రశ్నించే హక్కు ఉండదా? జగన్ లాజిక్ ఏంటి?

Tirumala News: భక్తులకు నేరుగా శ్రీవారి దర్శనం, సాయంత్రం తిరుమలకు సీఎం చంద్రబాబు

Amaravati News: హెచ్ 1 బీ వీసా ఎఫెక్ట్.. ఏపీకి టెక్ కంపెనీ యాక్సెంచర్, విశాఖలో కొత్త క్యాంపస్‌

Nellore News: రెచ్చిపోయిన హిజ్రాలు.. న‌ర్సుపై మూకుమ్మడిగా దాడి, అడిగినంత ఇవ్వలేదని

Big Stories

×