E-Paper
Advertisement

Aavesham Remake: ఆవేశం తెలుగు రీమేక్.. చేసేదెవరు..?

Aavesham Remake: ఆవేశం తెలుగు రీమేక్.. చేసేదెవరు..?
Advertisement

Fahadh Faasil’s Aavesham Movie Telugu Remake: ఒక భాషలో హిట్ అయిన సినిమాను మరో భాషలో రీమేక్ చేయడం కామన్ గా నడుస్తోంది. పాన్ ఇండియా సినిమా వచ్చాకా ఆ భాష ఈ భాష అని లేకుండా అన్ని సినిమాలు అన్ని భాషల్లో రిలీజ్ అవుతున్నాయి. చాలా రేర్ కేసుల్లో ఆ సినిమాలను రీమేక్ ప్లాన్ చేస్తున్నారు. ఇకపోతే తాజాగా భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఒక సినిమా తెలుగులో రీమేక్ చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ సినిమానే ఆవేశం.

మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ హీరోగా నటించిన ఈ సినిమాకు జిత్తు మాధవన్ దర్శకత్వం వహించాడు. ఫహద్ ఫాసిల్ అండ్ ఫ్రెండ్స్ మరియు అన్వర్ రషీద్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నజ్రియా నజీమ్ మరియు అన్వర్ రషీద్ నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 11 న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. రూ. 150 కోట్ల వసూళ్లను అందుకొని వందకోట్ల క్లబ్ లో చేరింది.

Advertisement

ఇక ఈ మధ్యనే ఈ సినిమా ఓటిటీ బాట పట్టిన విషయం తెల్సిందే. అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా మలయాళ భాషలో స్ట్రీమింగ్ అవుతుంది. సినిమా హిట్ టాక్ అందుకున్నప్పటి నుంచి తెలుగులో ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని అభిమానులు ఎంతగానో ఎదురుచూసారు. కనీసం ఓటిటీలోనైనా అన్ని భాషల్లో డబ్బింగ్ ఉంటుందని అయినా అనుకున్నారు. కానీ, మేకర్స్ కేవలం మలయాళ భాషలో మాత్రమే స్ట్రీమింగ్ ఇచ్చారు. అంటే .. ఈ సినిమా తెలుగులో డబ్ చేయడం లేదు.. రీమేక్ ప్లాన్ చేస్తున్నారు అనే టాక్ నడుస్తోంది.

Also Read: Ram Charan: బాబాయ్ తో అబ్బాయ్.. ఎన్నిరోజులు అయ్యింది ఈ ఫ్రేమ్ చూసి..

Advertisement

ఒకవేళ ఈ సినిమా తెలుగు వెర్షన్ ను రిలీజ్ చేయాలనుకుంటే ఈపాటికే రిలీజ్ చేసి ఉండాలి. అలా చేయలేదు అంటే కచ్చితంగా రీమేక్ చేస్తున్నారని అంటున్నారు. అయితే ఫహాద్ ప్లేస్ ను రీప్లేస్ చేసే నటుడు ఎవరు.. ? అని తెలుగువారు మాట్లాడుకుంటున్నారు. మరి రీమేక్ చేస్తే ఆవేశం స్టార్ ఎవరు అవుతారో చూడాలి.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×