E-Paper
Advertisement

EC Letter to AP Govt: ఏపీ ప్రభుత్వానికి ఈసీ లేఖ.. మధ్యాహ్నం 3 గంటల్లోగా సమాధానం చెప్పండి..!

EC Letter to AP Govt: ఏపీ ప్రభుత్వానికి ఈసీ లేఖ.. మధ్యాహ్నం 3 గంటల్లోగా సమాధానం చెప్పండి..!
Advertisement

Election Commission Letter to AP Government about Treasury Details: ఏపీ ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ లేఖ రాసింది. డీబీటీ నిధుల పంపిణీపై హైకోర్టుకు వెళ్లిన ప్రభుత్వానికి.. ఈ ఒక్కరోజే నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిపై ఈసీ ప్రభుత్వానికి లేఖ రాసింది. లబ్ధిదారులకు ఈరోజే నగదు ఇవ్వకపోతే ఏమవుతుందని ప్రశ్నించింది. జనవరిలో లబ్ధిదారులకు ఇచ్చేందుకు లేని నగదు.. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలని ప్రశ్నించింది. ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో మధ్యాహ్నం 3 గంటల్లోగా చెప్పాలని ఈసీ లేఖలో కోరింది.

ఎన్నికలకు ముందు డీబీటీ నిధులను విడుదల చేస్తే ఓటర్లు ప్రలోభానికి గురవుతారని పేర్కొంటూ.. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నకారణంగా నిధులను పంపిణీ చేయవద్దని ఈసీ ఆంక్షలు విధించింది. దానిపై హైకోర్టుకు వెళ్లిన ప్రభుత్వానికి కాస్త ఊరట లభించింది. ఈ ఒక్కరోజు మాత్రమే నిధుల విడుదలకు అనుమతి ఇచ్చింది. 11 నుంచి 13 వరకూ ఎలాంటి నిధులు విడుదల చేయవద్దని సూచించింది.

Advertisement

Also Read: జగన్ ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్.. ఆ నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్.. కానీ ?

అలాగే.. డీబీటీ కింద నిధులు విడుదల చేసే పథకాలను ప్రచారంలో వాడొద్దని కండిషన్ పెట్టింది. ఆసరా, చేయూత, వసతి దీవెన, లా నేస్తం, రైతు భరోసా పథకాల లబ్ధిదారులకు నగదు జమ అయ్యే అవకాశం కనిపిస్తోంది. 59 నెలలుగా ప్రభుత్వ పథకాలతో లబ్ధిపొందుతున్న విద్యార్థులు, మహిళలకు కాస్త ఊరట లభించిందని అనుకునేలోగానే ఈసీ ప్రభుత్వానికి రాసిన లేఖ సంచలనమైంది. దానిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Tags

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కొడుకును చున్నీతో గొంతు నులిమి.. తల్లి కిరాతకం

Big Stories

Advertisement
×