BigTV English

Tirumala: తిరుమలలో సర్వదర్శనం నిలిపివేత .. టిటిడి సిబ్బందితో భక్తులు వాగ్వాదం..

Tirumala:తిరుమల తిరుమలలో శ్రీవారి సర్వ దర్శనంపై తీవ్ర గందరగోళం నెలకొంది.టికెట్లు లేకుండా శుక్రవారం సర్వ దర్శనం కి వచ్చిన భక్తులను తితిదే సిబ్బంది దర్మనానికి అనుమతించడంలేదు. దీంతో తితిదే అధికారులతో భక్తులు వాగ్వాదానికి దిగారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు శనివారం ఉదయం నుండి భారీ సంఖ్యలో తిరుమలకు తరలివస్తున్నారు. దీంతో వైకుంఠం క్యూకాంప్లెక్స్-2, నారాయణ గిరి షెడ్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి.

Tirumala: తిరుమలలో సర్వదర్శనం నిలిపివేత .. టిటిడి సిబ్బందితో భక్తులు వాగ్వాదం..
Tirumala latest news
Tirumala

Tirumala latest news(Andhra news today):

తిరుమలలో శ్రీవారి సర్వ దర్శనంపై తీవ్ర గందరగోళం నెలకొంది. టికెట్లు లేకుండా శుక్రవారం సర్వ దర్శనం కి వచ్చిన భక్తులను టిటిడి సిబ్బంది అనుమతించడంలేదు. దీంతో టిటిడి అధికారులతో భక్తులు వాగ్వాదానికి దిగారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు శనివారం ఉదయం నుండి భారీ సంఖ్యలో తిరుమలకు తరలి వస్తున్నారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2, నారాయణ గిరి షెడ్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి.


భక్తులు భారీ సంఖ్యలో ఉండటంతో క్యూలైన్ లు అతిథి గృహం వరకు చేరుకున్నాయి. దీంతో వైకుంఠ దర్శనానికి ఇబ్బందులు కలుగుతాయని భావించి, టోకెన్లు లేని భక్తులను దర్శనానికి టిటిడి అధికారులు నిరాకరించారు. రేపటి సర్వదర్శనం టిక్కెట్లు ఉన్నవారిని సాయంత్రం క్యూలైన్లలోకి అనుమతి ఇస్తామని టిటిడి అధికారులు వెల్లడించారు.

తొలుత వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని శుక్రవారం టోకెన్లు లేకపోయినా.. సర్వదర్శనానికి భక్తులను అనుమతిస్తామని టిటిడి అధికారులు ప్రకటించారు. దీంతో భక్తులు పెద్ద సంఖ్యలో సర్వదర్శనం కోసం బారులు తీరారు. భక్తులు భారీసంఖ్యలో ఉండటంతో కేవలం టోకెన్లు ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తామని మరో ప్రకటన చేసింది టిటిడి. దర్శనానికి భారీ సంఖ్యలో భక్తులు రావడంతో రాత్రి నుంచే టోకెన్లు జారీ చేయడం మొదలు పెట్టారు టిటిడి సిబ్బంది. వైకుంఠ ఏకాదశి , ద్వాదశి రోజుల్లో దర్శనానికి వచ్చే భక్తులకు జారీ చేసిన టికెట్లను ప్రత్యేక రంగుల్లో ముద్రించారు.


రూ.300 ప్రత్యేక దర్మనం టికెట్లను టిటిడి ఆన్ లైన్ లో విడుదల చేసింది. వైకుంఠ ఏకాదశి కావడంతో.. వీఐపీలు కూడా భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. వీఐపీలకు వసతి గదులు కేటాయించలేక టిటిడి అధికారులు తలలు పట్టుకుంటున్నారు. తితిది అధికారులు తీసుకుంటున్న నిర్ణయాల వల్ల తాము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని భక్తులు వాపోయారు.

Tags

Related News

Pawan Kalyan: రూటు మార్చిన పవన్.. నిన్న మామిడి.. నేడు చీరలు, రేపు?

AP Free Bus Scheme: ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్.. ఆ బస్సు లెక్కితే ఉచిత ప్రయాణం ఉండదు

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

Big Stories

×