BigTV English

Crime: ఆహా ఏమి అందం.. ఏమి చందం.. లుక్ సూపర్.. కట్ చేస్తే మత్తు.. ప్రవేట్ వీడియోలు.. ఆ తర్వాత..?

Crime: ఆహా ఏమి అందం.. ఏమి చందం.. లుక్ సూపర్.. కట్ చేస్తే మత్తు.. ప్రవేట్ వీడియోలు.. ఆ తర్వాత..?

Crime News: అందమైన రూపం.. ఆకట్టుకొనే అభినయం.. మాటల కవ్వింపులు.. వయ్యారాల పలుకులు.. ఇంకేముంది అదృష్టం తలుపుతట్టింది అనుకుంటున్నారా.. అయితే మీకు చిక్కులు వచ్చినట్లే. మీ పరువుకు భంగం కలిగినట్లే. సోషల్ మీడియా ద్వారా చిలుక పలుకులు పలకడం.. ఆ తర్వాత బ్లాక్ మెయిలింగ్ చేయడం నేటి సమాజంలో పలువురికి ఒక వృత్తిలా మారింది. ఇలా ఎందరినో వలలో వేసుకొని, మోసం చేసిన ఓ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మహిళ బాధితుల లిస్ట్ తీస్తున్న పోలీసులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఇంతకు ఈ ఘటన ఎక్కడ వెలుగులోకి వచ్చిందో తెలుసా.. ఏపీలోని విశాఖలో..


నేటి కాలంలో సోషల్ మీడియా ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైంది. అందుకే నేరస్తులు సైతం ఇదే మాద్యమాన్ని వాడుకొని.. ఎందరినో బురిడీ కొట్టిస్తున్నారు. హనీ ట్రాప్ పేరిట జరిగే మోసాలు అయితే రోజురోజుకు అధికమవుతున్నాయి. హనీ ట్రాప్ అంటే ఏమిటో తెలుసా.. సోషల్ మీడియా ద్వారా పరిచయం కావడం.. ఆ తర్వాత వ్యక్తిగత విషయాలు తెలుసుకోవడం.. మత్తు ప్రయోగించడం.. ప్రవేట్ ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ చేయడం. ఇంతకు ఇలా చేస్తున్నది ఎవరో అనుకొనేరు కొందరు అందమైన యువతులు. అందమైన వారే ఎందుకో తెలుసా.. వెంటనే బురిడీ కొట్టించి లక్షలు దండుకోవడం వీరి వంతు.

ఇలాంటి ఘటన జరిగిన నేపథ్యంలో విశాఖ పోలీసులకు ఫిర్యాదు అందింది. ఎన్నో సంచలనమైన కేసులను చేధించిన విశాఖ పోలీసులు.. ఈ కేసు అంతు తేల్చేలా పక్కా ప్రణాళికతో దర్యాప్తు చేసి నిందితురాలు జాయ్ జెమిమాను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు దర్యాప్తులో పోలీసులకు షాకుల మీద షాకులు తగిలాయి.


Also Read: Pawan Kalyan: మా కష్టాలు తీరేదెప్పుడు ? మా గతేంటి ? పవన్ కు నిరసన సెగ…!

హనీ ట్రాప్ పేరిట ఒక ముఠాగా ఏర్పడ్డ దుండగులు.. పథకం ప్రకారం జెమిమాను ఉపయోగించి సోషల్ మీడియా ద్వారా ఎందరినో బురిడీ కొట్టించారు. ముందు పరిచయం.. ఆ తర్వాత మత్తు ఇవ్వడం.. అసభ్యకర వీడియోలు తీయడం.. ఇక బెదిరించడం ఇలా సాగేది ఈ ముఠా పని. అలాగే సంబంధిత మహిళకు ఎలా బుట్టలో పడవేయాలో ట్రైనింగ్ కూడా ఇచ్చారంటే ఈ ముఠా కథ వేరే అని చెప్పవచ్చు.

అయితే ఈ కేసు గురించి విశాఖ సీపీ బాగ్చి మాట్లాడుతూ.. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు. వీరి వలలో పడి మోసపోయిన వారు.. రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్నట్లు దర్యాప్తులో తేలిందన్నారు. ఇదొక ముఠాగా తాము గుర్తించామని, అన్ని ఆధారాలు సేకరిస్తున్నట్లు.. త్వరలోనే మిగిలిన ముఠా సభ్యులను అరెస్ట్ చేయడం జరుగుతుందన్నారు. అలాగే సోషల్ మీడియా వేదికగా జరిగే నేరాల పట్ల యువతీ, యువకులు అప్రమత్తంగా ఉండాలన్నారు. అపరిచిత వ్యక్తులతో స్నేహం చిక్కులే తెచ్చే పరిస్థితులు ఉన్నాయని తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరించారు విశాఖ సీపీ బాగ్చి.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×